For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ ఆహారాలు తింటే ముసలితనం మీ దరిచేరదు

|

ఎప్పటికైనా అన్ని వయసులూ దాటుకుని వృద్ధాప్యం లోకి అడుగుపెట్టక తప్పదు. కానీ వృద్ధాప్యంలో పడ్డాక కూడా 'మీకు ఇంత వయసున్నట్టు కనబడరు అనే మెచ్చుకోలు పొందామంటే అది మన ఆరోగ్యాన్నీ, ఆహారపు అలవాట్లను సూచిస్తుంది. ఇంకా అనవసరపు ఆందోళనలకు లోనుకాకుండా, పొల్యూషన్‌ బారినపడకుండా ఉంటే కాలాన్ని పది-పదిహేనేళ్లు వెనక్కు తిప్పుకోవచ్చు.

చిన్ననాటి నుంచే ఆహారపు అలవాట్లు ఒక క్రమపద్ధతిలో ఉంటే అది మన శరీర సౌందర్యానికి చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది. శరీరానికి అందాల్సిన పోషకాలు, విటమిన్లు సమపాళ్లలో అందించాలి. ఆహారంలో నూనెలు, కొవ్వులు, కోలాలు, కాఫీలు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్నవారి శరీరతత్వం సౌందర్యాన్నే సూచిస్తుంది.

8 సూపర్ ఫుడ్స్ తో యవ్వనం..ఆరోగ్యం మీ సొంతం: క్లిక్ చేయండి

మీరు తినే ఆహారంలో తప్పనిసరిగా ఇక్కడ ఇచ్చినవి జతచేసుకుంటే 'మీరే కాలేజి అనిపించుకోవడం ఖాయం. ఇవన్నీ రోగనిరోధకశక్తిని పెంచేవే కాక జీర్ణక్రియ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మీ ఆహారంలో అవి ఎంత శాతం ఉంటున్నాయో ఒకసారి చెక్‌ చేసుకోండి.

యువతవలే ఉత్సాహంగా వుండాలంటే!: క్లిక్ చేయండి

పుచ్చకాయ:

పుచ్చకాయ:

పుచ్చకాయ చర్మ సౌందర్యానికి చాలా మంచిది. ఇందులో ఎ, బి, సి విటమిన్‌లు పుష్కలంగా ఉండి చర్మాన్ని పునరుజ్జీవింప చేస్తాయి. గింజల్లో ఉన్న సోడియం, జింక్‌, విటమిన్‌ ఇ గుణాలు యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.

ఎండుఫలాలు:

ఎండుఫలాలు:

బాదం, పిస్తా, జీడిపప్పుల్లో విటమిన్‌ ఇ, ఐరన్‌, పొటాషియమ్‌, జింక్‌, ఒమెగా-3 ఫాటీ ఆసిడ్స్‌ ఉంటాయి. ఇవన్నీ శరీర సౌందర్యాన్ని పెంచేవి. ఇందులో ఉండే నూనెలో ముఖం కాంతివంతంగా కనిపించడానికి ఉపకరిస్తాయి.

పెరుగు-తేనె :

పెరుగు-తేనె :

పెరుగులో చలువ చేసే గుణం ఉంటుంది. ఇది అరుగుదలను మెరుగుపరిచే ఆహారం. తేనె శక్తినిచ్చే ఔషధం. తేనె వత్తిడిని తగ్గించడమే గాక మతిమరుపును కూడా అరికడుతుంది.

వ్యాయామం:

వ్యాయామం:

ఇవి కాకుండా కొద్దిపాటి వ్యాయామం సరిపోతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ రోజే ఈ ఆరోగ్య సూత్రాల్ని పాటించి నవయవ్వనం సొంతం చేసుకోండి.

సోయాబీన్స్‌:

సోయాబీన్స్‌:

ఇవి హార్మోన్‌ ఇంబాలెన్స్‌ను అరికడుతుంది. బ్రెస్ట్‌, పేగు, ఉదర కేన్సర్ల నివారణకు ఉపయోగపడతాయి. వయసు పైబడనీయకుండా ఇందులో ఉన్న సైటిక్‌ యాసిడ్స్‌ ఉపయోగపడతాయి. హార్ట్‌, అల్జీమర్‌ జబ్బులను, ఈస్ట్రోజన్‌ను అరికడుతుంది. మెనోపాజ్‌దశను దరిచేరకుండా నిరోధిస్తుంది.

చాక్లెట్స్:

చాక్లెట్స్:

చాక్లెట్స్‌ అయితే బిట్టర్‌ చాక్లెట్స్‌ ఉపయోగించాలి. ఇతర చాక్లెట్లలో ఉన్న ఫాట్‌, చెక్కల ఇందులో ఉండకపోవడం వల్ల ఇవి అందాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి.

కొకోవా:

కొకోవా:

ఇందు ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా ఉండి ఆరోగ్యవంతమైన రక్తప్రసరణకు సహకరిస్తాయి. లో, హై బ్లడ్‌ ప్రెషర్స్‌ను నివారిస్తుంది. దీన్ని కేకుల్లో, మిల్క్‌షేక్స్‌లో వాడడం మంచిది.

బెర్రీస్‌:

బెర్రీస్‌:

స్ట్రాబెర్రీస్‌, నల్లద్రాక్ష, బ్లూబెర్రీస్‌, నేరేడు పండ్ల వంటి వాటిలో సైటో కెమికల్స్‌ ఉంటాయి. ఇవి కేన్సర్‌ నిరోధకశక్తిని కలిగి ఉంటాయి. నేరేడు పళ్ళలో విటమిన్‌ ఎ, సి ఉంటాయి. ఇవి చక్కెర వ్యాధిని నిరోధిస్తాయి. వీటిలో అరుగుదలను పెంచే గుణాలు కూడా ఉన్నాయి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

రోగనిరోధకశక్తిని పెంచే మరొక దినుసు వెల్లుల్లి. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును కూడా అరికడుతుంది. చర్మరోగాలకు చక్కని మందు వెల్లుల్లి. ఇది హృదయ సంబంధిత వ్యాధులకు కూడా ఔషధంగా పని చేస్తుంది. ఈ వాసన పడని వారు మొదటి చాలా తక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకేసారిగా ఎక్కువ మొత్తం తీసుకుంటే వాంతులు, విరోచనాలు, కడుపులో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

టమాటా:

టమాటా:

అధిక రోగనిరోధకశక్తిగల కూరగాయ టమాటా. ఇది గుండె సంబంధిత వ్యాధులను, ఉదర, నోటి, పేగు కేన్సర్లను అరికడుతుంది. ఇందులో 'ఎ, 'ఇ విటమిన్లు ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు, చర్మానికి చాలా మంచిది. టమాటాను బ్యూటీపార్లర్లలో ఫేస్‌ మాస్కుల్లో కూడా ఉపయోగిస్తారు.

ప్రకృతి ప్రసాదితాలు పళ్ళు-కూరలు

ప్రకృతి ప్రసాదితాలు పళ్ళు-కూరలు

క్యాబేజీ, బ్రొకోలీ, ముల్లంగి, ఉసిరి, క్యారెట్‌ ఇవన్నీ విటమిన్లు పుష్కలంగా గల కూరగాయలు. విటమిన్‌ ఎ, సిలు కంటిచూపుకు, కంటికి సంబంధించిన జబ్బుల నుంచి రక్షణ నిస్తాయి. పాలకూర లేదా ఇతర ఆకుకూరలన్నీ శరీరానికి కావలసిన ఐరన్‌ను అందించి అనీమియా బారిన పడకుండా చేస్తాయి. సమృద్ధిగా పోషకాలను అందించే కళ్ళకింపైన రంగులున్న కూరగాయలు గుండెజబ్బులను, మానసికవత్తిడి, డిజార్డర్స్‌ వంటి జబ్బుల నుంచి రక్షణనిస్తాయి. ఇంకా కేన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా వీటిలో ఉన్నాయి. ఇక పళ్ల విషయానికొస్తే బొప్పాయి, అరటిపండు, సపోటాల్లో ఐరన్‌, పొటాషియం, విటమిన్‌ 'ఇ' ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మానికి నిగారింపునిచ్చి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. కూరగాయలు ఎక్కువగా ఉడికిస్తే అందులో ఉన్న పోషకాలు, ఖనిజాలు నష్టపోతాం.

నీళ్ళు-పళ్ళరసాలు:

నీళ్ళు-పళ్ళరసాలు:

శరీరం మెరుస్తూ ఉండాలంటే రోజూ ఎంత ఎక్కువ నీరు తాగితే అంత మంచిది. ఒకటి లేదు రెండు కూరగాయల, లేదా పళ్లరసాలు తీసుకోవడం చాలా మంచిది. సొరకాయ, దోసకాయ, ఆరంజ్‌, బత్తాయి, నిమ్మరసం చాలా మంచిది. కొబ్బరినీళ్ళలో కూడా అందాన్ని పెంచే గుణాలు అధికం.

English summary

Top 12 Anti-Aging Nutrition Food Habits

Anti-aging foods include both exotic foods and everyday foods. Learn which anti-aging foods are good for you and worth the money. Learn about nutrition and how it relates to anti-aging and longevity.
Desktop Bottom Promotion