For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చక్కెర కంటే బెల్లం మంచిది అనడానికి 10 కారణాలు

By Nutheti
|

పండుగలు, పబ్బాలు, ఫంక్షన్స్ వచ్చాయంటే.. బెల్లానికి మొదటి ప్లేస్. ఏ శుభకార్యాలకైనా భారతీయులు ముందుగా ప్రాధాన్యత ఇచ్చేది తీపిపదార్థాలకే. అందుకే ఎలాంటి స్వీట్ చేయాలన్నా బెల్లం తప్పనిసరి. మన జీవితంలో తీపిని నింపే వస్తువు బెల్లం. చక్కెర కూడా తీపి పదార్థమే అయినా.. బెల్లం తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

భారతీయ వంటకాల్లో సాధారణంగా ఉపయోగించే పదార్థం బెల్లం. ఆహారాలకు స్వీట్ నెస్ ని ఇచ్చే బెల్లంలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. చెరకు నుంచి తయారు చేయబడే బెల్లం అందరికీ అందుబాటులో ఉండే పదార్థం.

చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుందో మీకు తెలుసా ? చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుందో మీకు తెలుసా ?

షుగర్ పేషంట్స్ తీపికి దూరంగా ఉండాలి. అయితే ఆర్గానిక్ బెల్లం తీసుకోవడం వల్ల ఎలాంటి హానికలుగదు. అలాగే డైజెషన్ సమస్యలు నివారించడానికి కూడా బెల్లంను తీసుకోవచ్చు. అలాగే బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. అసలు బెల్లం ఆరోగ్యానికి మంచిదా అని చాలా మంది అనుకుంటారు ? అందుకే తీపి పదార్థాలకు దూరంగా ఉంటారు. అయితే బెల్లం తీసుకోవడం ఆరోగ్యకరం అని చెప్పడానికి 10 కారణాలున్నాయి. అవేంటో చూద్దాం..

న్యాచురల్ స్వీట్ నెస్

న్యాచురల్ స్వీట్ నెస్

బెల్లంను కేవలం స్వీట్ నెస్ కోసమే కాదు.. ఇందులో చాలా విభిన్నమైన ఫ్లేవర్ ఉంటుంది. అది వంటకాలకు మంచి రుచిని ఇస్తుంది. అదే చక్కెర అయితే కేవలం స్వీట్ నెస్ ని మాత్రమే ఇస్తుంది. బెల్లం స్వీట్ నెస్ తో పాటు.. మంచి రుచిని కూడా అందిస్తుంది.

క్లెన్సింగ్ గుణాలు

క్లెన్సింగ్ గుణాలు

బెల్లంలో స్వీట్ నెస్ మాత్రమే కాకుండా.. క్లెన్సింగ్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇది జీర్ణక్రియకు, శ్వాసనాళ సమస్యలకు చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థలో పేరుకున్న మలినాలను తొలగించి, కాన్ట్సిపేషన్ ను నివారిస్తుంది. శరీరంలోని టాక్సిన్స్ ని తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

తక్షణ శక్తి

తక్షణ శక్తి

బెల్లంలో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి సహాయపడతాయి. మధుమేహంతో బాధపడేవాళ్లు చక్కెర తినలేరు కాబట్టి.. బెల్లం తీసుకోవచ్చు.

జీర్ణక్రియకు

జీర్ణక్రియకు

భోజనం తర్వాత కొంచెం బెల్లం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ ఎంజైమ్స్ కి శక్తినిచ్చి త్వరగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. ఇది అసెంటిక్ యాసిడ్ లా మారి.. జీర్ణక్రియ సజావుగా సాగడానికి సహాయపడుతుంది. హెవీ మీల్ తీసుకున్నప్పుడు బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఈజీగా జీర్ణమవుతుంది.

మినరల్స్

మినరల్స్

బెల్లంలో చాలా మినరల్స్ ఉంటాయి. ఐరన్ లోపంతో బాధపడేవాళ్లకు బెల్లం చక్కటి పరిష్కారం. కాబట్టి రెగ్యులర్ డైట్ లో బెల్లం చేర్చుకుంటే సరిపోతుంది. చక్కెరతో పోల్చితే బెల్లంలో చాలా ప్రయోజనాలు దాగున్నాయి.

రక్త శుద్ధికి

రక్త శుద్ధికి

క్లెన్సింగ్ గుణాలతో పాటు రక్తాన్ని శుద్ధిపరిచే గుణాలు కూడా బెల్లంలో ఉన్నాయి. అలాగే రక్తం ఉత్పత్తి చేయడానికి బెల్లం సహాయపడుతుంది. ఎర్రరక్త కణాలు తక్కువగా ఉన్నవాళ్లు, గర్భిణీ స్త్రీలు బెల్లం తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

కీళ్ల నొప్పులు

కీళ్ల నొప్పులు

బెల్లం తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే కండరాలను కూడా ఆరోగ్యంగా ఉంచడానికి ఇది సహకరిస్తుంది.

చర్మానికి, జుట్టుకి

చర్మానికి, జుట్టుకి

బెల్లంలో బ్లడ్ ప్యూరిఫైరింగ్ ప్రాపర్టీస్ ఉండటం వల్ల ఇది జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే మొటిమలు, మచ్చలు సమస్యను తగ్గించి, చర్మానికి నిగారింపు తీసుకురావడానికి సహకరిస్తుంది.

రుతుక్రమ సమస్యలు

రుతుక్రమ సమస్యలు

రుతుక్రమ సమస్యలు ముఖ్య కారణం శరీరానికి కావాల్సిన మోతాదులో మినరల్స్ అందకపోవడమే. బెల్లంలో మినరల్స్ ఎక్కవగా ఉంటాయి కాబట్టి మహిళలు దీన్ని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే సహజంగా రుతుక్రమ సమస్యలు తగ్గించుకోవచ్చు.

వెచ్చదనాన్ని ఇవ్వడానికి

వెచ్చదనాన్ని ఇవ్వడానికి

ఎక్కువ దేశాల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ తీసుకుంటారు. ట్రెడిషన్ గా వస్తున్న ఈ పద్ధతి చలికాలంలో బాగా సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన వెచ్చదనాన్ని పొందడానికి బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ తీసుకోవడం మంచిది.

English summary

10 Amazing Benefits Of Organic Jaggery: Is Jaggery Better than Sugar: Does Jaggery good for Diabetic patients

Jaggery is one of the most commonly used ingredients in the Indian kitchen. This amorphous, sometimes misshaped, gooey-looking food is a natural sweetener. Made from sugarcane juice, jaggery is also an en easily available ingredient in the Indian market.
Desktop Bottom Promotion