For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెర్బల్ టీలలో రకాలు.. వాటి ఆరోగ్య రహస్యాలు

By Nutheti
|

నిద్ర లేచింది మొదలు నిద్రపోయేవరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. నిస్సత్తువగా ఉన్నా, ఉల్లాసంగా ఉన్నా టీ తాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఓ అంతర్భాగమైంది. మ‌నిషికి ప్ర‌శాంతంగా ఉండ‌టంతో పాటు ఆరోగ్యం కాపాడుకోవ‌డానికి హెర్బ‌ల్ టి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

READ MORE: కెమికల్ ట్రీట్మెంట్స్ కంటే.. హెర్బల్ ట్రీట్మెంట్సే బెటర్

సాధారణంగా టీ, కాఫీలు అనారోగ్యమని చెబుతుంటారు. కానీ హెర్బల్ టీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మూసుకుపోయిన రక్తనాళాలను వ్యాకోచం చెందేలా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉత్తేజాన్ని కల్గించే ఆహార పదార్థాలలో టీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది.

షుగర్( డయాబెటిస్) ను కంట్రోల్ చేయడానికి బెస్ట్ హెర్బల్ రెమెడీస్

అలసటగా అనిపించినప్పుడు చాలా మంది టీ తాగాలనుకుంటారు. అయితే సాధారణ టీకి బదులు హెర్బల్ టీ తాగితే రిలాక్సేషన్ తో పాటు, హెల్త్ కి కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. హెర్బల్ టీలో రకరకాల వనమూలికలు ఉంటాయి. ఇది రుచికరమే కాక అనేక ఔషధాలు మెండుగా ఉంటాయి. హెర్బల్ టీ తాగడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇంతకీ ఎలాంటి హెర్బల్ టీలో ఎలాంటి ప్రయోజనాలు, ఎలాంటి గుణాలున్నాయో చూద్దాం..

చామంతి టీ ( చమోమిలే టీ )

చామంతి టీ ( చమోమిలే టీ )

చమోమిలే టీనే చేమంతి టీ అంటారు. దీన్ని చేమంతి పూల రెక్కలు, ఆకులతో తయారు చేస్తారు. ఈ హెర్బల్ టీ జీర్ణవ్యవస్థ, రిలాక్సేషన్, ఆర్థరైటిస్, వెన్ను నొప్పి వంటి రకరకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే గుణం చమోమిలే టీలో ఉంది. అలాగే సూర్యరశ్మి వల్ల కమిలిపోకుండా ఉండటానికి ఇది సహాయపడుతుంది. దాంతోపాటు గొంతు నొప్పి, గొంతులో వచ్చే ఇన్ఫెక్షన్లను కూడా ఇది తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క టీ

దాల్చిన చెక్క టీ

ఘాటైన సువాసన కలిగిన దాల్చిన చెక్క టీ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ హెర్బల్ టీని తరచుగా తీసుకోవడం వల్ల మేధాశక్తిని, ఆలోచనా శక్తిని పెంచుతుంది. పొట్టలో వచ్చే సమస్యలు గ్యాస్, డయేరియా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ వంటి గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే వ్యాధినిరోధకతను పెంచడానికి ఇది సహాయపడుతుంది.

అల్లం టీ

అల్లం టీ

వికారం తగ్గించడంలో, ఆకలి పెంచడంలో అల్లం టీ సహాయపడుతుంది. అలాగే మార్నింగ్ సిక్ నెస్ తగ్గించడానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలకు అల్లం టీ పవర్ ఫుల్ మెడిసిన్ లా పనిచేస్తుంది.

పుదినా టీ

పుదినా టీ

హెర్చల్ టీలలో పుదినా టీ చాలా టేస్టీగా ఉంటుంది. మంచి సువాసనాబరితంగా ఉంటుంది. ఈ హెర్బల్ టీ నొప్పి, వాపు, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, శ్వాసనాళాల వాపు వంటి అరుదైన సమస్యలకు మెడిసిన్ లా పనిచేస్తుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీ ఫ్రీ రాడికల్స్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. అలాగే క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండేలా గ్రీ టీ కాపాడుతుంది.

హనీ ( తేనె ) టీ

హనీ ( తేనె ) టీ

తేనెతో చేసిన హెర్బల్ టీ గొంతు ఇన్ఫెక్షన్లకు మంచి పరిష్కారం. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి.

నిమ్మకాయ ఔషధతైలం

నిమ్మకాయ ఔషధతైలం

నిమ్మకాయ ఔషధతైలంతో తయారు చేసిన టీ చెమటను ప్రేరేపిస్తుంది. దీనివల్ల జ్వరం వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. నోటి చుట్టూ వచ్చే పుళ్లు తగ్గించడంలో ఈ నిమ్మకాయ ఔషధతైలంతో తయారు చేసిన క్రీమ్ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

లెమన్ గ్రాస్ టీ

లెమన్ గ్రాస్ టీ

లెమన్ గ్రాస్ టీ తరచుగా తీసుకోవడం వల్ల శరీరాన్నంతటినీ శుద్ధిపరుస్తుంది. ఎలాంటి అనారోగ్య సమస్యా దరిచేరకుండా ప్రొటెక్ట్ చేస్తుంది.

లావెండర్ టీ

లావెండర్ టీ

లావెండర్ టీ తీసుకోవడం వల్ల ప్రశాంతతను కలిగిస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగించి నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది.

మందారం టీ

మందారం టీ

మందారపువ్వు అలంకరణకు మాత్రమే కాదు ఆరోగ్యానికి మంచిదే. మందారంలోని యాంటీ ఆక్సిడెంట్లు యువతలో వచ్చే తేలికపాటి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. రోజు మూడుకప్పుల మందారం టీ అధిక రక్తపోటుకు మంచి మందులా పనిచేస్తుంది.

బ్లాక్ టీ

బ్లాక్ టీ

బ్లాక్ టీలో రోగాలతో పోరాడే లక్షణాలు పుష్కలం. బ్లాక్ టీలో డయాబెటీస్‌తో పోరాడే యాంటీ బయోటిక్స్ ఉంటాయి. గుండె జబ్బుల ప్రమాదాన్నితగ్గించడంలోనూ ఇది పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. ఈ టీ మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

English summary

11 Types of Hearbal Teas and Their Health Benefits: Herbal teas and their health secrets

Herbal teas are not only refreshing but also is healthy for the body. It is beneficial in several ways such as it cures headache, improves digestion, flushes out toxins, enhances complexion and reduces hair fall.
Story first published: Thursday, December 3, 2015, 10:57 [IST]