For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెమికల్ ట్రీట్మెంట్స్ కంటే.. హెర్బల్ ట్రీట్మెంట్సే బెటర్

|

పూర్వీకులు తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకునే వాళ్లో మీకు తెలుసా ? వాళ్లు మనకంటే చాలా శక్తివంతంగా.. ఆరోగ్యంగా ఉండేవాళ్లు. వాళ్ల ఆరోగ్య రహస్యం వాళ్లు ఉపయోగించిన హెర్బల్ రెమిడీస్.

READ MORE: వివిధ రకాల వ్యాధుల కోసం 15 రకాల హెర్బల్ టీలు

హెర్బల్స్ తో పొందే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ బాగా తెలుసు. కానీ వాటిని వాడడంలో విఫలమవుతున్నాం. మనమంతా కెమికల్ ట్రీట్ మెంట్ కే అడిక్ట్ అవుతున్నాం. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తోంది. అదే మనం హెర్బల్ రెమిడీస్ వాడటం మొదలుపెడితే.. ఎలాంటి అనారోగ్య సమస్య అయినా.. ఈజీగా నయమవుతుంది.

షుగర్( డయాబెటిస్) ను కంట్రోల్ చేయడానికి బెస్ట్ హెర్బల్ రెమెడీస్షుగర్( డయాబెటిస్) ను కంట్రోల్ చేయడానికి బెస్ట్ హెర్బల్ రెమెడీస్

మనం ఖచ్చితంగా మూలికలను మన డైట్ లో చేర్చుకోవడం, మూలికల టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది. హెర్బల్ టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవడానికి, బరువు తగ్గడానికి సహకరిస్తాయి. మూలికలు కేవలం రోగాలను నయం చేయడమే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతాయి, ఏకాగ్రత పెరగడానికి, సరైన నిద్రతో పాటు ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడతాయి. పూర్వకాలం నుంచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్న, ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న మూలికల గురించి తెలుసుకుందాం. రోగాలను నయం చేయడానికే కాకుండా.. మెరుగైన ఆరోగ్యానికి ఉపయోగపడే మూలికలేంటో ఇప్పుడే చూడండి.

యూకలిప్టస్ ఆయిల్

యూకలిప్టస్ ఆయిల్

జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి సమస్యల నుంచి బయటపడటానికి యూకలిప్టస్ ఆయిల్ చక్కటి ట్రీట్ మెంట్. దీన్ని టీ, దగ్గు సిరప్ లలో వాడతారు.

సోంపు

సోంపు

సోంపును నమిలినా, టీతో పాటు తాగినా.. జీర్ణక్రియ సమస్యలు, దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది. డైయేరియా, గొంతు సమస్యల నుంచి కూడా బయటపడటానికి ఇది సహకరిస్తుంది. దీన్ని పేస్ట్ లా చేసి వాడటం వల్ల తలనొప్పి నుంచి కూడా బయటపడవచ్చు.

సొంఠి

సొంఠి

సొంఠి పొడిని టీ ద్వారాగానీ, ఆహారంలోగానీ చేర్చుకోవడం మంచిది. అంతేకాదు నొప్పులు, జాయింట్ పెయిన్, రక్తప్రసరణ పెరగడానికి, ఆస్తమా నుంచి బయటపడటానికి, జలుబు, దగ్గు, ఫ్లూల నుంచి ఉపశమనం కలగడానికి సొంఠి ఉపయోగపడుతుంది.

రోజ్ మేరీ

రోజ్ మేరీ

కండరాల నొప్పుల నుంచి ఉపశమనం కలగడానికి రోజ్ మేరీ సహకరిస్తుంది. అంతేకాదు రక్తప్రసరణ, జీర్ణక్రియ సజావుగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది.

అలోవెరా

అలోవెరా

రక్తస్రావ నివారిణిగా అలోవెరా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడటానికి, గాయాలను మాన్పడానికి ఇది సహాయపడుతుంది. ముఖానికి అలోవెరా జెల్ రాయడం వల్ల చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.

తేనెటీగ పుప్పొడి ( bee pollen )

తేనెటీగ పుప్పొడి ( bee pollen )

తేనెటీగ పుప్పొడిని ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరగడమే కాదు.. జీర్ణక్రియ సజావుగా ఉండటానికి సహాయపడుతుంది. వ్యాధినిరోధక వ్యవస్థకు తోడ్పడుతుంది.

బ్లాక్ బెర్రీ

బ్లాక్ బెర్రీ

బ్లాక్ బెర్రీ ఆకులను టీ పొడిలో వాడతారు. ఈ టీ తాగడం వల్ల నొప్పులు, డైయేరియా, జీర్ణక్రియ పెరగడానికి సహాయపడుతుంది. నోటి అల్సర్లు, గొంతు సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ టీ తాగడం మంచిది.

రెస్బెర్రీ

రెస్బెర్రీ

రస్బెర్రీ రూట్స్ ని ఉడికించి టీ తయారు చేసుకోవచ్చు. ఈ టీ తాగడం వల్ల దగ్గు, డైయేరియా నుంచి బయటపడవచ్చు.

బక్వీట్ ( buckwheat )

బక్వీట్ ( buckwheat )

బక్వీట్ సీడ్స్ ని సోపులలో వాడతారు. బక్వీట్ తో గంజి లేదా జావ చేసుకుని తాగడం వల్ల బీపీ నార్మల్ గా ఉంటుంది. బ్లడ్ క్లాటింగ్, డైయేరియా నుంచి ఉపశమనం కలిగించడానికి ఈ సోప్ లు ఉపయోగపడతాయి.

కారం పొడి

కారం పొడి

కారం పొడిలో నొప్పిని తగ్గించే గుణం, ఆర్థరైటిస్, జీర్ణక్రియ సమస్యలను తగ్గించే గుణం ఉంటుంది. గాయాలకు యాంటీ సెప్టిక్ లా కూడా కారం పొడిని ఉపయోగించవచ్చు. గాయాలపై దీన్ని వేయడం వల్ల బాధగా ఉన్నప్పటికీ.. మంచి మందులా పనిచేస్తుంది.

రెడ్ క్లోవర్

రెడ్ క్లోవర్

ఆస్తమా, ఇన్ల్ఫమేషన్, బ్రోంచిటిస్, రక్త ప్రసరణ వంటి సమస్యల నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. వీటి పూలు, ఆకులు, కాండాలను టీ లేదా, ఆహారంలో చేర్చుకోవడం మంచిది.

రోజ్ హిప్

రోజ్ హిప్

ఆరంజె కలర్ ఉండే బెర్రీ ఫ్రూట్ ఇది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ పండుని డైరెక్ట్ గా తీసుకున్నా, టీలో చేర్చుకున్నా మంచిది. దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

English summary

17 Herbal Health Secrets Of Ancient Times in telugu

Do you know how people in ancient times used to keep themselves fit and fine? They were more energetic and healthier than us. The reason for their well-being and increased physical strength is the use of herbal remedies.
Desktop Bottom Promotion