For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో ఖచ్చితంగా తినకూడని 8 మీ ఫేవరెట్ ఫుడ్స్ ...

|

వేసవి వెళ్ళింది చిలకరి జల్లులు మొదలయ్యాయి. ఎక్కడ చూసినా తొలకరి జల్లులతో పులకరింతలు పెడుతన్నాయి. వేడి నుండి కాస్త ఉపశమనం కలిగిస్తూ నేనున్నానంటా పలకరించే తొలకరి జల్లులంటే అందరికీ ఇష్టమే. ఆ ఇష్టం, ఫీలింగ్స్ తో పాటు అనేక జబ్బులను కూడా తీసుకొస్తుంది వర్షాకాలం. అది ముఖ్యంగా మనం తీసుకొనే ఆహార పదార్థాల వల్లే అవుతుంది.

ఇతర సీజన్లలో వలే ఈ సీజన్ లో కూడా వేడి వేడి సమోసా తినడాలనుకోవడా, ఫ్రెష్ గా ఫ్రూట్ జ్యూస్ త్రాగడానికి ఇష్టపడుతుంటారు. ఇంకా ఉల్లిపాయ పకోడా చట్నీ ఇలా చెప్పకుంటే వర్షాకాలం చాలా వంటల్నే పరిచయం చేస్తుంది. అయితే ఇలాంటి ఫుడ్స్ మాన్స్ సూన్ (వర్షాకాలం) తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా...?

READ MORE: వర్షాకాలంలో వ్యాధినిరోధకతను పెంచే హెల్తీ ఫుడ్స్

నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి ఫుడ్స్ ఈ సీజన్ లో అనేక వ్యాధుల బారీన పడేలా చేస్తుందన్ని అభిప్రాయపడుతున్నారు. మాన్ సూన్ సీజన్ లో వాతావరణంలో హ్యుముడిటి పెరగడం వల్ల మన శరీరంలో జీర్ణవ్యవస్థ యొక్క సామర్థం తగ్గుతుంది. దాంతో వ్యాధినిరోధకత లోపించడం వల్ల ఇన్ఫెక్షన్స్ మొదలవుతాయి.

READ MORE: వర్షాకాలంలో బాధించే జబ్బులు-నివారణా చర్యలు

అందువల్ల మీరు హెల్తీగా ఉంటూ, మాన్ సూన్ లవ్లీ వాతావరణంను ఎంజాయ్ చేయాలంటే, ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని ఆహారాలను తప్పనిసరిగా తినకుండా నివారించాలి. వీటిని తినకపోవడం వల్ల కొంత వరకూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతాము..మరి ఈ ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

పకోడాలు:

పకోడాలు:

వర్షపు జల్లులలో ప్రతి ఒక్కరూ కోరుకొనేది ఒక కప్పు టీతో వేడి వేడి సమోసాలు. అయితే మనం వర్షాకాలంలో అవాయిడ్ చేయాల్సిన ఆహారాల్లో ఇది ఒక ప్రధాణ ఆహారం. ఎందుకంటే వీటిని నూనెలో డీఫ్ ఫ్రై చేయడం.హ్యుముడిటి వల్ల ఆయిల్ ఫుడ్స్ జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది . కాబట్టి, పొట్టకు ఇబ్బంది కలిగించే ఇలాంటి డీఫ్రైడ్ ఫుడ్స్ ను సాధ్యమైనంత వరకూ తినకుండా ఉండటమే మంచిది.

ఛాట్:

ఛాట్:

వాతావరనం చల్లగా ఉన్నప్పుడు తినకూడని రెండవ ఫేవరెట్ ఫుడ్ ఛాట్. ఎందుకంటే ఛాట్స్ రోడ్ సైడ్ మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. వర్షాకాలంలో ఇలా రోడ్ సైడ్ ఫుడ్ చాలా త్వరగా ఇన్ఫెక్షన్స్ కు గురి చేస్తాయి. ఎందుకంటే వాటి తయారీకి ఉపయోగించే నీళ్ళు, చట్నీలు, మసాలాలు ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ కారణం అవుతాయి. వర్షకాలంలో ప్రమాధానికి గురిచేస్తాయి.

కచోరి/సమోస:

కచోరి/సమోస:

రోడ్లోకి వెళ్ళగానే నోరూరిస్తూ వేడి వేడిగా కలర్ ఫుల్ గా ఆకర్షిస్తుంటాయి. వర్షాకాలంలో సమోసా మరియు కచోరి వంటివి తినకపోవడమే మంచిది. ఎందుకంటే వీటి స్టఫింగ్ కోసం ఉపయోగించే పదార్థాల వల్ల స్టొమక్ అప్ సెట్, డయాబెటిస్, ఎసిడిటికి కారనం అవుతాయి .

ఇండో చైనీస్ ట్రీట్:

ఇండో చైనీస్ ట్రీట్:

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో చిన్న పెద్దవరకూ ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్స్ కు ఎక్కువగా ఆకర్షిలౌతున్నారు. వర్షాకాలంలో వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే వీటిలో ఉపయోగించే స్పైసీ సాస్ లు మరియు స్టఫింగ్ పదార్థాలు స్టొమక్ ఇన్ఫెక్షన్స్ కు కారణం అవుతాయి. వీటి తయారీకు ఉపయోగించే కలుషిత నీరు, వీటి మీద వాలే ఈగలు, దోమలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మరీ ముఖ్యంగా వీటిలో ఉపయోగించే ఆర్టిఫిషియల్ కలర్స్, అజినామోటో, మరియు ఆయిల్స్ కూడా ఆరోగ్యానికి మరో విధంగా హాని కలిగిస్తాయి.

గ్రీన్ లీఫ్స్:

గ్రీన్ లీఫ్స్:

అవును, ఈ విషయం మీరు వినే ఉంటారు. వర్షాకాలంలో అవాయిడ్ చేయాల్సిన ఆహారాల్లో ఆకు కూరలు కూడా ఉండటం మీకు ఒక్కింత ఆశ్చర్యం కలిగించవచ్చు. వర్షాకాలంలో ఫొల్లెట్ మరియు బి12 మరియు విటమిన్ కె అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలని డాక్టర్లు సలహాలిస్తుంటారు. అయితే వర్షాకాలంలో వీటికి దూరంగా ఉండటం మంచింది. వీటిని సరిగి శుభ్రం చేయకపోతే, స్టొమక్ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది.

ఫ్రూట్ జ్యూస్:

ఫ్రూట్ జ్యూస్:

వ్యాధినిరోధకతను పెంచుకోవడానికి ప్రతి రోజూ ఫ్రూట్ జ్యూస్ ను తీసుకోవడం మంచిది. అయితే వర్షాకాలం వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. చల్లని వాతావరణంలో పండ్లు చాలా త్వరగా పాడవుతాయి. వాటిని సరిగా గమనించకుండా ఉపయోగిస్తే ఆరోగ్యానికి ముప్పే..

 సీఫుడ్:

సీఫుడ్:

వర్షాకాలంలో చేపలు, మరియు ప్రాన్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. అందుకే రెస్టారెంట్స్ లో వీటితో తయారుచేసే వెరైటీ ఫుడ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని సరిగా నిల్వచేయకపోతే త్వరగా పాడవుతాయి. కాబట్టి, ఫ్రెష్ గా ఉన్న ఆహారాలను మాత్రమే తీసుకోవాలి.

కార్బోనేటెడ్ డ్రింక్స్:

కార్బోనేటెడ్ డ్రింక్స్:

కార్బోనేటెడ్ డ్రింక్స్ ఏ సీజన్లో అయినా నివారించాల్సి పానీయాలు. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్స్ లో మినిరల్ లెవల్స్ తగ్గిపోవడం వల్ల మన శరీంలో ఎంజైమ్ యాక్టివిటీని తగ్గిస్తుంది. దాంతో జీర్ణం అవ్వడం కష్టంగా మారుతుంది. మరియు ఇది బరువు పెరగడానికి మరో కారణం.

English summary

8 Favourite Foods To Avoid In Monsoon: Health Tips in Telugu

According to experts, it is said that these foods which are famous in the rainy season, bring on several diseases. Due to the increase of humidity levels during the monsoon, the body's digestive ability is reduced and also brings on infections.
Story first published: Wednesday, June 24, 2015, 17:19 [IST]
Desktop Bottom Promotion