Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
హెల్తీ హ్యాబిట్సే కానీ.. మోదాదు మించితే ప్రమాదమే
హెల్తీ హ్యాబిట్స్ ఫాలో అవడం చాలా సాధారణం. కానీ కొన్ని మంచి అలవాట్లు.. ఎక్కువగా చేయడం వల్ల అనారోగ్యకరంగా మారుతాయి. అదేంటి అనుకుంటున్నారా ? అవును దేనికైనా పరిమితి ఉంటుంది. అంతకుమించి చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
ఆరోగ్యానికి మంచిది కదా అని.. హెల్తీ హ్యాబిట్సే కదా అని.. లిమిట్ లేకుండా చేయడం వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. అలాగే.. అన్ హెల్తీకి కారణమవుతాయి. కాబట్టి మంచి అలవాట్లను గుడ్డిగా ఫాలో అవకుండా.. ఎలాంటి సమయంలో.. ఎంత సేపు చేయాలో తెలుసుకోవాలి.
READ MORE: వీకెండ్స్ లో ఉత్సాహాన్నిచ్చే హ్యాబిట్స్
ఆరోగ్యకరమైన అలవాట్లు ఫాలో అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ తప్పులు చేయకూడదు అనేదానిపై అవగాహన ఉండాలి. కాబట్టి ఆరోగ్యకరమే అయినా.. ఆరోగ్యానికి కారణమయ్యే.. ఆ అలవాట్లు, వాటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓ సారి చూద్దాం..

నీళ్లు తాగడం
పెద్దవాళ్లు రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలి. కానీ అంతకంటే ఎక్కువ తాగడం మంచిది కాదు. 8 గ్లాసుల కంటే ఎక్కువ తాగడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. కాబట్టి ఈ అలవాటు మానుకోండి. అలాగే బాటిల్స్ లో నిలువ ఉంచుకుని నీళ్లు తాగడం కూడా మంచిది కాదు.

మార్నింగ్ హ్యాబిట్స్
ఉదయాన్నే వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అలాగే బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కాబట్టి సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

తక్కువ ఫ్యాట్ ఫుడ్స్
తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాల్లో ఎనర్జీ ఉండదు. ప్రొటీన్స్ ఉండవు. కాబట్టి తక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్ డైట్ తీసుకోవడం మానేయడం మంచిది.

సప్లిమెంట్స్
చాలా వరెస్ట్ హెల్తీ హ్యాబిట్ ఇది. ఎందుకంటే పోషకాలు పొందడానికి తీసుకునే ట్యాబ్లెట్స్ మీరు ఆహారం ద్వారా పొందే న్యూట్రియంట్స్ ని పీల్చేస్తాయి. కాబట్టి పోషకాలు పొందడానికి ట్యాబ్లెట్స్ తీసుకోవడం కంటే.. డైట్ తీసుకోవడం మంచిది.

భోజనం మానేయడం
భోజనాన్ని మాత్రం మానేయకండి. అలా మీల్స్ తినకపోవడం వల్ల బరువు పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అంతేకాదు గ్యాస్ర్టిక్ ప్రాబ్లమ్స్, పొట్టలో సమస్యలకు కారణమవుతుంది.

జ్యూస్ డైట్స్
మీరు బరువు తగ్గాలనుకుంటే.. హెల్తీ వ్యాయామం, హెల్తీ డైట్ ఫాలో అవండి. అంతేకానీ.. జ్యూస్ డైట్ ఫాలో అవకూడదు. ఎందుకంటే.. వీటిల్లో పోషకాలు ఉండవు.

రోజుకి రెండుసార్లు స్నానం
రోజూ స్నానం చేస్తున్నారా ? అయితే అది ఆరోగ్యానికి మంచిది కాదు. అదేంటి అనుకుంటున్నారా ? నిజమే.. రోజుకి రెండు సార్లు స్నానం చేసే అలవాటు ఉంటే.. మీ చర్మానికి మంచిది కాదు. ఇన్ఫెక్షన్ కి కారణమవుతుంది. అలాగే శరీరంపై ఉండే న్యాచురల్ ఆయిల్స్ కోల్పోయి చర్మం పొడిబారుతుంది.

సూర్యరశ్మికి దూరమైతే
రోజులో ఎంత వీలైతే అంత సూర్యరశ్మి పొందండం చాలా అవసరం. చాలా మంది సూర్య కిరణాలు ఆరోగ్యానికి హానికరం అని ఫీలవుతుంటారు. కానీ అది తప్పు. ఎందుకంటే సూర్యుని నుంచి విటమిన్ డి పొందవచ్చు. అది ఆరోగ్యానికి మంచిది.



Click it and Unblock the Notifications
