For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బి అలర్ట్ ! టూ మచ్ గా సాల్ట్ తింటున్నారని తెలిపే సంకేతాలు..

|

ఉప్పు (Salt) భూమిమీద జంతువులన్నింటి మనుగడకు కావలసిన లవణము. ఇది షడ్రుచులలో ఒకటి. ఉప్పులో అత్యధిక శాతం ఉండే రసాయనం సోడియం క్లోరైడ్. ఉప్పు ఆహార పదార్థాలకు రుచిని ఇస్తుంది. ముఖ్యంగా మన భారతీయ వంటకాలలో ఉప్పుది ఒక ప్రధాన పాత్ర. ఆహారాన్ని భద్రపరచడానికి కూడా ఉప్పును వాడుతారు. ఉదాహరణకు ఆవకాయ మొదలగు పచ్చళ్ళను, చేపలను (ఉప్పు చేపలు) ఎక్కువ కాలం నిలువ ఉంచటానికి ఉప్పును వాడుతారు.

మన దేశంలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనశైలి మారుతోంది. ప్యాకేజ్డ్‌, ప్రాసెస్‌ చేసిన, రెడిమేడ్‌గా దొరికే ఆహారాలను తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఇందులో సోడియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ప్రతీరోజు సగటున ఒక భారతీయుడు 30 గ్రాముల ఉప్పు వాడుతున్నాడు. ఇది జాతీయ పోషకాహార సంస్థ సిఫార్సు కన్నా చాలా ఎక్కువ. రోజుకు ఆరు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పు తీసుకూడదని సంస్థ సూచిస్తోంది. అంతే కాదు ఇలాంటి ఆర్టిఫిషియల్, ప్రొసెస్డ్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

మన శరీరంలో ఉప్పుమీద ఆధారపడని అవయవమంటూ ఏమీలేదంటే అతిశయోక్తి కాదు. మన శరీరంలో జరిగే రసాయనిక చర్యలు అన్నీ కూడా ఉప్పు మీదే ఆధారపడి ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ముఖ్యమైన పదార్థం. కండరాలు సంకోచించడంలో, నీటి నిల్వ ఉండటంలో కీలక పాత్ర వహిస్తుంది. అంతేకాక శరీరంలో జీర్ణవ్యవస్థకు అవసరమైన పోషకాలు ఉప్పులో ఉన్నాయి. శరీరంలో సోడియం తక్కువైతే డీహైడ్రేషన్‌ కలుగుతుంది. మరోవైపు సోడియం ఎక్కువ ఉండే ఉప్పు పదార్థాలు తీసుకుంటే అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మనం నిత్యం ఆహారాల్లో తీసుకొనే ఉప్పు పరిమానం పరిమితంగా, తగిన మోతాదులోనే తీసుకోవాలి. సోడియం కంటెంట్ ఎక్కువైతే అనేక ఆరోగ్య సమస్యలకు గురికావల్సి వస్తుంది.

శరీరానికి సోడియం ఎక్కువైతే స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఎక్కువ సాల్ట్ తినడం వల్ల అనారోగ్యానికి సూచికగా కొన్ని హెచ్చరిక సంకేతాలు మనకు తెలుస్తాయి. కాబట్టి, ఎక్సెస్ సాల్ట్ తీసుకోకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ క్రింది హెచ్చరిక సంకేతాలను గుర్తించి. ఉప్పు తినడం తగ్గించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీరు ఉప్పు ఎక్కువ తింటున్నారని తెలిపే కొన్ని హెచ్చరిక సంకేతాలు ఈ క్రింది విధంగా...

ఉప్పు ఎక్కువగా తింటున్నారని తెలిపే సంకేతాలు...

1. ఎక్కువ దాహం వేస్తుంది:

1. ఎక్కువ దాహం వేస్తుంది:

సోడియం ఎక్కువగా తినడం వల్ల తరచూ నీరు దాహం వేస్తుంటుంది . ముఖ్యంగా కణజాలాల్లో ఫ్లూయిడ్ అసమతౌల్యానికి గురిచేస్తుంది . శరీరంలో ఉప్పు ఎక్కువైతే, ఇది రక్తనాళాల్లోని కణాల నుండి నీటిని గ్రహించేస్తుంది. దాంతో శరీరానికి నీరు అవసరం అవుతోందని, బాడీ నుండి బ్రెయిన్ కు సంకేతాలను అందిస్తుంది. దాంతో మనకు నీరు త్రాగాలనిపించడం లేదా దప్పికగా ఉండటం జరగుతుంది.

2. కడుపు ఉబ్బరం మరియు స్టొమక్ అప్ సెట్:

2. కడుపు ఉబ్బరం మరియు స్టొమక్ అప్ సెట్:

ప్రతి రోజూ మన శరీరానికి అందాల్సిన దానికి కంటే ఎక్కువగా ఉప్పు అందడం వల్ల శరీరంలోనికి ద్రవాలు చేరడం అధికమౌతుంది. మరియు ఇది కడుపుబ్బరానికి దారితీస్తుంది. దాంతో మనకు అసౌకర్యంగా మరియు అననుభూతికి గురి చేస్తుంది. శరీరంలో ద్రవాలు పెరగడం వల్ల బ్లడ్ రక్తపరిమాణం పెరుగుతుంది దాంతో హార్ట్ లో రక్తపరిమాణం పెరగడం వల్ల హైబిపితో ప్రమాదానికి గురిచేస్తుంది.

3. కాళ్ళు చేతులు వాపులు :

3. కాళ్ళు చేతులు వాపులు :

ఉప్పు పరిమితికి మించి తీసుకోవడం వల్ల శరీరంలో ద్రవాలు ఏర్పడి చేతులు, కాళ్ళు వాపులకు దారితీస్తుంది . దీన్ని వైద్యపరిభాషలో ఎడిమా అని పిలుస్తారు. ఇది ఇదివరికే కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి మరియు అధిక రక్తపోటు ఉన్నవారికి చాలా హానికరం.

4. సాల్ట్ ఫుడ్స్ మీద కోరికలు పెరుగుతాయి:

4. సాల్ట్ ఫుడ్స్ మీద కోరికలు పెరుగుతాయి:

శరీరంలో సోడియం కంటెంట్ ఎక్కువైతే సాల్ట్ ఫుడ్స్ మీద కోరికలు ఎక్కువగా పెరుగుతాయి . ఇది మరిన్ని ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది . సాల్ట్ ఫుడ్స్ మరియు స్నాక్స్ తినడం వల్ల ఇతర ఆహారాలు కూడా సాల్ట్ ఫుడ్సే ఎంపిక చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారనడానికి ఇది కూడా ఒక సంకేతం.

5. హైబ్లడ్ ప్రెజర్:

5. హైబ్లడ్ ప్రెజర్:

మీరు ఉప్పు ఎక్కువగా తీసుకుంటున్నారనడానికి మరో సంకేతం హైబ్లడ్ ప్రెజర్ . రక్తనాళాల్లో రక్తప్రసరణను పెంచుతుంది . ఇది రక్తం మీద ఒత్తిడి కలిగిస్తుంది. దాంతో ఆ ప్రెజర్ హార్ట్, బ్రెయిన్, కిడ్నీల మీద మరింత పని భారానికి గురిచేస్తుంది .శరీరంలోపలి భాగాల్లో ఇలా ఎక్స్ ట్రా ప్రెజర్ పడటం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది.

6. బోన్స్ వీక్ గా మారుతుంది:

6. బోన్స్ వీక్ గా మారుతుంది:

రెగ్యులర్ డైట్ లో ఎక్సెస్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఎముకల్లోని క్యాల్షియం యూరిన్ రూపంలో కోల్పోవడం జరుగుతుంది . ఇది ఎముకలు వీక్ గా మరియు పెళుసుగా మారడానికి కారణం అవుతుంది. మోనోపాజ్ దశలో ఉన్న మహిళల్లో క్యాల్షియం లోపం ఉంటుంది కాబట్టి, ఉప్పును తప్పనిసరిగా తగ్గించాలి.

7. కిడ్నీ స్టోన్స్:

7. కిడ్నీ స్టోన్స్:

ఉప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీల మీద ఎక్కవ పనిభారాన్ని పెంచుతుంది. ఎక్కువ నీరు వల్ల రక్తప్రవాహం పెరుగుతుంది . దాంతో కిడ్నీలు మరింత ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. ఎముకల్లో క్యాల్షియం లోపించడం మరియు యూరిన్ లో పోవడం, ఎక్సెస్ క్యాల్షియం లోపించండ వల్ల కిడ్నిలో కిడ్ని స్టోన్స్ ఏర్పడటానికి కారణం అవుతుంది.

8. ఓస్టిరియోపోసిస్ :

8. ఓస్టిరియోపోసిస్ :

ఓస్టిరియోపోసిస్ ను నివారించడానికి మరియు నయం చేయడానికి డైట్ అండ్ డైజెషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఎక్సెస్ సాల్ట్ ఎముకల్లోని క్యాల్షియంను గ్రహించి మూత్రంలో క్యాల్షియం పోవడానికి కారణం అవుతుంది. ఎక్సెస్ సాల్ట్ వల్ల ఎక్సెస్ క్యాల్షియం మూత్రం ద్వారా కోల్పోవడం వల్ల ఎముకలు పల్చగా మారుతాయి.

9. స్టొమక్ క్యాన్సర్ :

9. స్టొమక్ క్యాన్సర్ :

ఉప్పు ఎక్కువ ఉన్న ఆహారాలు మరియు ప్రొసెస్డ్ ఫుడ్స్ స్టొమక్ క్యాన్సర్ కు కారణం అవుతాయి. మరియు క్యాన్సర్ కు కారణం అయ్యే టాప్ 5 ఫుడ్స్ లో ఉప్పు ఒకటి. దీన్ని తప్పనిసరిగా పరిమితం చేయాల్సి ఉంటుంది. లేదా నివారించాల్సి ఉంటుంది. జపనీస్ అధికంగా ఊరగాయలు, సాల్టీ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల ఎక్కువ మంది స్టొమక్ క్యాన్సర్ బారిన పడుతుంటారని నిపుణులు సూచిస్తున్నారు.

10. డీహైడ్రేషన్:

10. డీహైడ్రేషన్:

పరిమితికి మించి ఉప్పు తినడం మరియు సరిపడా నీరు త్రాగకపోతే డీహైడ్రేషన్ కు గురి కావల్సి వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల నోరు తడిఆరిపోవడం, కళ్ళు తిరగడం, నిద్రలేమి, డ్రైస్కిన్, మలబద్దకం మరియు తలనొప్పి వంటి లక్షణాలతో అనారోగ్యానికి గురికావల్సి వస్తుంది.

English summary

BE AWARE! 10 Warning Signs of Consuming Too Much Salt ...

Processed, packaged and junk foods contain a lot of salt in them that you may not be aware of. The quantity of salt used may be much higher than the recommended limit. Limiting salt consumption alone is not enough; however, you must avoid these artificial foods as well.
Story first published:Tuesday, December 1, 2015, 16:27 [IST]
Desktop Bottom Promotion