For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కండరాల బెనుకు లేదా కండరాల నొప్పిని నివారించే 12 ఉత్తమ చిట్కాలు

|

మజిల్ స్ప్రైన్ అనేది ఈ మద్యకాలంలో ఎక్కువగా వింటున్నాము. చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొటున్నారు. ముఖ్యంగా అధిక బరువు మరియు ఊబకాయంతో ఉన్నవారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు . ఇది గాయాలైనప్పుడు లేదా పడినప్పుడు స్నాయువులు లేదా లింగ్మెంట్స్ మడగబడినప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటారు . ఇది చాలా బాధాకరమైన పరిస్థితి మరియు వాపు కూడా ఉంటుంది . ఇది సాధారణంగా పాదాల వద్ద ఉన్న కండరాల్లో ఎక్కువగా ఏర్పడుతుంది .

మజిల్ పెయిన్ ను మనం ఇంట్లోనే ఎలా నివారించుకోవాలి? కండరాలు గాయపడ్డప్పుడు నొప్పిని మరియు వాపులను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి.

సాధారణంగా మజిల్స్ గాయపడ్డప్పుడు మనం ఆప్రదేశంలో కదలికల వల్ల మరింత డ్యామేజ్ జరగకుండా లేదా వాపు రాకుండా బ్యాండేజ్ చుడుతుంటాము. తదుపరి గాయలు కాకుండా ఉండటం కోసం ఇలా బ్యాండేజ్ చుడుతుంటాము. అయితే బ్యాండేజ్ ను మరీ టైట్ గా చుట్టకూడదు. అలా చుట్టడం వల్ల ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ జరగదు. అది మరో సమస్యకు దారితీస్తుంది .

READ MORE: మజిల్స్ పెంచాలా? అయితే ఈ నియమాలు పాటించండి

కండరాల నొప్పిని మరియు వాపును తగ్గించుకోవడానికి ఉత్తమ సహసజ మార్గాలున్నాయి. ఈ హోం రెమెడీస్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు సురక్షితమైనవి.

READ MORE: స్త్రీలను ఆకర్షించే 10 పురుషత్వ లక్షణాలు

మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఏవిధంగా ఉపయోగించాలో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

కండరాల నొప్పి లేదా సలుపు నివారించే సులభ చిట్కాలు

కండరాల నొప్పి లేదా సలుపు నివారించే సులభ చిట్కాలు

బాదం ఆయిల్ మరియు గార్లిక్ ఆయిల్: ఇక టీస్పూన్ గార్లిక్ మరియు ఒక టీస్పూన్ బాదం ఆయిల్ ను ఒక గిన్నెలో తీసుకొని కొద్దిగా వేడి చేయాలి . నొప్పి ఉన్న మరియు సలుపుతున్న కండరప్రాంతంలో అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. మజిల్ పెయిన్ నివారించడానికి ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.

 ఆముదం:

ఆముదం:

ఆముదంనూనెను వేడి చేసి కాటన్ ప్యాడ్ మీద వేసి , నొప్పి ఉన్న కండారల మీద అప్లై చేస్తూ సున్నితమైన మసాజ్ ను ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్ మరియు రోజ్మెరీ ఆయిల్ :

యూకలిప్టస్ ఆయిల్ మరియు రోజ్మెరీ ఆయిల్ :

కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ మరియు కొద్దిగా రోజ్మెరీ ఆయిల్ మిక్స్ చేసి, సలుపుతున్న కండరాల మీద మసాజ్ చేయాలి.ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దాంతో వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

హార్స్ చెస్ట్ నట్:

హార్స్ చెస్ట్ నట్:

కండరాల యొక్క నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ ను నుండి ఉపశమనం కలిగించడంలో మరియు కండరాల గాయలను మాన్పడంలో ఈ మూలిక చాలా బాగా సహాయపడుతుంది. వీటిలో ఎసిన్ అనే నయం చేసే గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల వీటితో తయారుచేసి జెల్ ను అప్లై చేస్తే వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

 లైమ్ లీవ్స్ పౌడర్ మరియు తేనె:

లైమ్ లీవ్స్ పౌడర్ మరియు తేనె:

నిమ్మ ఆకులను పేస్ట్ లేదా పౌడ్ చేసి దీనికి కొద్దిగా తేనె మిక్స్ చేసి నొప్పి మరియు సలుపు ఉన్న కండరాల మీద అప్లై చేస్తే తక్షణం వాపు మరియు నొప్పి తగ్గిస్తుంది.

మజిల్స్ సలుపుతుంటే ఉల్లిపాయ పేస్ట్

మజిల్స్ సలుపుతుంటే ఉల్లిపాయ పేస్ట్

ఉల్లిపాయను సేస్ట్ చేసి మందపాటి కాటన్ క్లాత్ లో వేసి నొప్పి ఉన్న ప్రదేశంలో కట్టులా కట్టుకోవడం వల్ల, త్వరగా వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్ జ్యూస్:

పైనాపిల్లో బ్రొమోలిన్ అనే కంటెంట్ ఉంటుంది. ఇది నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది . త్వరగా నొప్పులను నివారించుకోవాలంటే పైనాపిల్ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవాలి . కండరాల లాగడానికి కూడా తక్షణ ఉపశమనం కలిగించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

పార్ల్సే:

పార్ల్సే:

పార్ల్సేను పేస్ట్ గా చేసి దీన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో నేరుగా అప్లై చేస్తే తక్షణం ఉపశమనం కలుగుతుంది . కండరాల వాపు మరియు నొప్పిని నివారించడంలో ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. వాపు మరియు నొప్పి నుండి త్వరగా ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.

థైమ్ ఆయిల్:

థైమ్ ఆయిల్:

కొన్ని చుక్కల థైమ్ ఆయిల్ ను నీటిలో వేసి మిక్స్ చేసి, ఈ నీటితో కండరాల సలుపుతున్న ప్రదేశంలో మసాజ్ చేయడంవల్ల నొప్పి మరియు వాపు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. థైమ్ ఆయిల్ కు కొద్దిగా బాదం ఆయిల్ మిక్స్ చేసి కూడా మసాజ్ చేసుకోవచ్చు.

పసుపు పేస్ట్:

పసుపు పేస్ట్:

పసుపులు హీలింగ్ అండ్ ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణగణాలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే . పసుపులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి వాపు, నొప్పి ఉన్న ప్రదేశంలో అప్లై చేస్తే వాపు మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ఐస్ ప్యాక్ :

ఐస్ ప్యాక్ :

గాయం అయిన వెంటనే ఆ ప్రదేశంలో ఐస్ ప్యాక్ పెట్టుకోవడం వల్ల ఉపశమనం కలుగుతుంది. ఇందులో అనెస్థిటిక్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గింస్తుంది. ఇలా ఒక మూడు రోజులు చేస్తే మంచిది.

కొంత ఎత్తులో ఉంచాలి:

కొంత ఎత్తులో ఉంచాలి:

గాయం అయిన లేదా కండరాల పట్టివేతకు గురైనప్పుడు ఆ భాగం కొంత ఎత్తులో ఉండే విధంగా కాళ్ళ క్రింది పిల్లో(దిండు)ను అమర్చుకోవడం ఉత్తమం.

English summary

12 Best Home Remedies For Muscle Sprain

Muscle sprain occurs due to injury when the ligaments and tendons are twisted or injured. It is very painful condition and there is severe swelling also. It usually occurs in foot muscles near foot joint. How to get rid of muscle pain at home?
Desktop Bottom Promotion