For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నికోటిన్ బయటకు పంపి క్యాన్సర్ ముప్పు నుండి కాపాడే ఆహారాలు

|

ప్రపంచంలో ధూమపాన ప్రియులు మిలియన్లకొద్ది ఉన్నారు. వీరిలో చాలామంది తమకున్న ధూమపానం అలవాటును మానేయాలనుకుంటూనే ఉంటారు. కాని మానలేకపోతుంటారు. ఏ ఉపయోగంలేని ధూమపానాన్ని అలవాటు చేసుకోవడం వల్ల ఎలా ప్రయోజనం ఉండదు. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే పొగ తాగకపోవటం, ఒకవేళ ఆ అలవాటుంటే మానెయ్యటం మంచిదని నిపుణులు చెబుతుంటారు. అయినా ... పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్ని సార్లు, ఎంతమంది చెప్పినా పొగతాగడాన్ని మాత్రం వదల్లేరు కొందరు మూర్ఖులు. దాదాపు సిగరెట్టు తాగేవాళ్లందరికీ తెలుసు... అది మంచి అలవాటు కాదని! మరి ఎందుకు మానలేకపోతున్నట్టు??-ఎందుకంటే సిగరెట్టు తాగకుండా ఉండలేరు కాబట్టి. మరి ఎందుకు ఉండలేరు?

ఒక్కటే కారణం. నికోటిన్‌! ఇదో పెద్ద వల. నిజానికి నికోటిన్‌ దానికి అదేగా ఏమంత చెడేం చెయ్యదు. అది చేసేదల్లా మాటిమాటికీ సిగరెట్టు తాగాలని అనిపించేలా తహతహలాడించటమే! అయితే అదొక్కటి చాలు.. జరగాల్సిన నష్టం జరిగిపోవటానికి. ఎందుకంటే మనం నికోటిన్‌ కోసం వెంపర్లాడుతూ సిగరెట్టు తాగుతుంటే... దీంతో పాటే సిగరెట్టులో ఉండే బోలెడు హానికర వ్యాధి కారకాలు.. ముఖ్యంగా క్యాన్సర్‌ కారకాలు మన ఒంట్లో చేరిపోతుంటాయి. అవి చెయ్యాల్సిన నష్టం అవి చేసేస్తుంటాయి.

అంటే.. ముందు నికోటిన్‌ వల వేస్తుంటుంది... ఆ తర్వాత క్యాన్సర్‌ కారకాలు ఒళ్లంతా కబళిస్తుంటాయి! దీనర్థమేమిటి? మనం నికోటిన్‌ తహతహ నుంచి బయటపడగలిగితే చాలు.. సిగరెట్టుకు స్వస్తి చెప్పటం తేలిక. పొగాకులో ఉండే ముఖ్యమైన రెండు పదార్థాలు నికొటిస్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌. సుమారు 20 సిగరెట్లు త్రాగటం వలన 0.09గ్రాముల నికోటిన్‌, 369ఘన సెంటీ లీటర్ల కార్బన్‌ మోన్సాక్సైడ్‌ శరీరంలోనికి ప్రవేశిస్తాయి.

ఈ రెండు-గుండె రక్త ప్రసరణ వ్యవస్థపై ఎక్కువగా పనిచేస్తాయి. నికోటిన్‌ వలన రక్తనాళాలు కుదించుకు పోయి, రక్తపోటు పెరుగుతుంది. నికోటిన్‌ శరీర నాడీ మండల వ్యవస్థను ఉద్రిక్తపరచడం వలన శరీరంలోని రస గ్రంథుల నుండి ప్రవించే రసాలు ఎక్కువవుతాయి. వీటివలన శరీర వ్యవస్థతో చురుకుగా పనిచేసే పదార్థాలు రక్తంలోకి అధికంగా ప్రవేశించి గుండెమీద, రక్తనాళాల మీద చెడు ప్రభావం కలిగిస్తాయి. వీటి వలన శరీరంలోని ముఖ్యభాగాలైన గుండె, మెదడు, మూత్రపిండాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం కూడా చాలా పాడైపోతుంది.

కొంత కాలం పాటు పొగతాగి మానేసినప్పటికి దాని దుష్ప్రభావాల బారి నుంచి తప్పించుకోలేరు. పొగతాగడం మానేసిన తర్వాత కూడా అప్పటి వరకు ఒంట్లో చేరిన నికోటిన్ దుష్ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మొదట నికోటిన్ ను శరీరం నుండి తొలగించాలి. మరి శరీరంలో ఇదివరికే చేరిన నికోటిన్ ను 24 గంటల్లో తొలగించుకోవడానికి కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి.ఇవి మీ శరీరంలో నికోటిన్ తొలగించే సామర్థ్యంను కలిగి ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాము..

 బ్రొకోలీ:

బ్రొకోలీ:

ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లోవిటమిన్ సి మరియు బి5 అధికంగా ఉన్నాయి. పొగతాగడం వల్ల శరీరంలో విటమిన్ సి తగ్గిపోతుంది. ఊపిరితిత్తులను శుభ్రం చేస్తుంది. అందువల్ల బ్రొకోలి ఆహారంతో తీసుకోవడం వల్ల శరీరంలో చేరే నికోటిన్ ను బయటకు నెట్టివేయబడుతుంది. అంతే కాదు బ్రొకోలి బరువు తగ్గించడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా గర్భినీ స్త్రీలకు ఆరోగ్యకరమైన ఆహారం.

ఆరెంజ్:

ఆరెంజ్:

సిట్రస్ పండ్లలో, జ్యూసులలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే విటమిన్ సి ఫుడ్స్ తీసుకుంటారు, ఆటోమాటిక్ గా శరీరంలోని నికోటిన్ బయటకు నెట్టివేయబడుతుంది. శరీర నాడీవ్యవస్తను సక్రమంగా పనిచేసేలా చేసి ఒత్తిడి తగ్గించడంలో సిట్రస్ పండ్లు, జ్యూలు బాగా పనిచేస్తాయి. కాబట్టి ఆహారంతో పాటు ప్రతి రోజూ ఆరెంజ్ కు ప్రాధాన్యత ఇవ్వండి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :

ఆకుకూరలు డార్క్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. ఇందులో విటమిన్స్ అధికంగా లేకపోయినా, ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ బి9 అధికంగా ఉంటుంది. ఇవి అతి తక్కువ సమయంలో శరీరంలోని నికోటిన్ ను బయటకు నెట్టివేస్తుంది. నికోటిన్ ను బయటకు పంపుటకు ఆకు కూరలు తీసుకోవడం చాలా ఆరోగ్యం.

అల్లం:

అల్లం:

శరీరంలోని నికోటిన్ ను 24గంటల్లో బయటకు నెట్టివేయడానికి పచ్చి అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. కొద్దిగా అల్లం ముక్కను నమలడం వల్ల నికోటిన్ కోరికలను తగ్గిస్తుంది. ఈ మూలిక ఆరోగ్యకరంగా బరువు తగ్గిస్తుంది.

క్రాన్ బెర్రీస్:

క్రాన్ బెర్రీస్:

బెర్రీస్ లో స్ట్రాబెర్రీ శరీరంలో నికోటిన్ ను తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా శరీరంలోని విషాలను కూడా బయటకు నెట్టివేయబడుతాయి. మీరు తీసుకొనే డిజర్ట్ లో క్రాన్ బెర్రీన్ ని గార్నిష్ గా చేసి తీసుకోవచ్చు మరియు స్మూతీస్ టాక్సిన్స్ ను తొలగిస్తాయి.

నిమ్మ:

నిమ్మ:

నిమ్మలో కూడా సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి శరీరంలోని నికోటిన్ ను 24గంటల్లోపు ఫ్లష్ అవుట్ చేసేస్తుంది. సిట్రిక్ యాసిడ్ మరియు విటమిన్ సి నికోటిస్ మరియు స్మోకింగ్ వల్ల అవాంఛితంగా వచ్చే అనారోగ్య సమస్యలను నివారిస్తుంది.

క్యారెట్స్:

క్యారెట్స్:

ఒక్కసారి పొగ తాగిన తర్వాత అందులోని నికోటిన్ మూడు రోజుల వరకూ శరీరంలో అలాగే నిల్వ ఉంటుంది . రోజూ ఎక్కుగా పొగ తాగేవారైతే నికోటిన్ మీ చర్మసౌందర్యాన్ని పాడు చేయడమే కాకుండా మిమ్మల్ని అందవిహీనంగా కనబడేలా చేస్తుంది. అందుకు క్యారెట్ జ్యూస్ తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ ఎ, సి మరియు కె, బి లు శరీరంలోని నికోటిన్ తొలగించడానికి బాగా సహాయపడుతాయి.

దానిమ్మ:

దానిమ్మ:

ఎర్రని దానిమ్మ గింజలు తినడం వల్ల శరీరంలోని రక్తప్రసరణను పెంచి రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. అంతే కాదు పొగ తాగాలానే ఆలోచనను తగ్గిస్తుంది. ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ తగ్గిస్తుంది మరియు బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ చేస్తుంది. మీరు రెడ్ ఫ్రూట్ తిన్నప్పుడు ఆటోమ్యాటిక్ గా నికోటిన్ ఫ్లష్ అవుట్ అవుతుంది

గోధుమలు:

గోధుమలు:

గోధుమలు బ్లడ్ వెజల్స్ ను టైట్ అప్ చేస్తుంది . కాబట్టి మీరు విటమిన్ ఇ అధికంగా ఉన్న ఆహారాలు గోధుమలు వంటివి తీసుకోవడం వల్ల సర్క్యులేషన్ సిస్టమ్ యొక్క స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది.

కాలే:

కాలే:

ఐసోతయోసైనేట్స్ మరియు ఇతర యాంటీఆక్సిడెంట్స్ కు మంచి సోర్స్ ఫుడ్ కాలే . ఇది శరీరంలో టాక్సిన్స్ తో పాటు నికోటిన్ కూడా ఫ్లష్ అవుట్ చేస్తుంది. కాలేను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.

కివి ఫ్రూట్:

కివి ఫ్రూట్:

శరీరంలో చేరిపోయిన నికోటిన్ ను అతి సులభంగా బయటకు పంపడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ కివి పండు. ఈ పండులో విటమిన్ ఎ మరియు సి, ఇ అధికంగా ఉన్నాయి. పొగతాగినప్పుడు ఈ విటమిన్స్ ను శరీరం నుండి అధిక శాతంలో తగ్గిపోతాయి కాబట్టి ఈ కివి పండును తినడం వల్ల ఈ విటమిన్స్ రీ స్టోర్ అవుతాయి.

వాటర్:

వాటర్:

ప్రతి రోజూ శరీరానికి సరిపడా నీరు త్రాగడం వల్ల శరీరంలో టాక్సిన్స్ తో పాటు, నికోటిన్ కూడా ఫ్లష్ అవుట్ చేయవచ్చు.

గ్రేప్ ఫ్రూట్ జ్యూస్:

గ్రేప్ ఫ్రూట్ జ్యూస్:

గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ రక్తంలో కిడ్నీ నికోటిన్ తొలగిస్తుందని క్లీనికల్ గా నిరూపించబడినది

చిల్లీ పెప్పర్స్:

చిల్లీ పెప్పర్స్:

చిల్లీ పెప్పర్ లో ఉండే కెమికల్ క్యాప్ససిన్ అనే కెమికల్ స్పైసీ కిక్ మెటబాలిజంను వేగవంతం చేస్తుంది . దాంతో శరీరంలోని నికోటిన్ ను చెమట రూపంలో బయటకు నెట్టేస్తుంది

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి బై ప్రొడక్షన్ ను ప్రమోట్ చేస్తుంది. ఇది నికోటిన్ మరియు ఇతర టాక్సిన్స్ ను శరీరం నుండి ఎఫెక్టివ్ గా తొలగిస్తుంది . మరియు వెల్లుల్లిలో ఉండే ఆర్గనో సల్ఫర్ అనే కాంపౌడ్ అల్లిసిన్ లంగ్స్ ను క్లియర్ చేస్తుంది. దాంతో లంగ్ క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది

English summary

Foods That Flush Nicotine From Your Body Within 24 Hours

Smoking is dangerous to health and we are all aware of that. There are more than a billion people in the world who are addicted to this bad habit.
Story first published: Thursday, October 8, 2015, 15:26 [IST]
Desktop Bottom Promotion