For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయాణాల్లో సిక్ నెస్ ని తగ్గించే పవర్ ఫుల్ టిప్స్

By Nutheti
|

హ్యాపీగా, జాలీగా షికారుకి వెళ్లాలంటే చాలా మంది హడలిపోతుంటారు. బస్సెక్కినా, ట్రైనెక్కినా.. వాంతులు వాళ్లను భయపెడుతుంటాయి. వాంతులు, కళ్లు తిరగడం, వికారం వంటి సమస్యలతో.. ఎక్కడి వెళ్లాలన్నా ఆలోచిస్తుంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే.. ప్రయాణం తర్వాత నీరసించిపోవాల్సి వస్తుంటుంది.

READ MORE: ప్రయాణంలో మీరు ఖచ్చితంగా తినకూడని 6 ఆహారాలు

బస్సు, రైళ్లే కాదు కారుల్లో వెళ్లటానికి కూడా వాళ్లకు సమస్యగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. ఈజీగా హోం రెమిడీస్ ఫాలో అవ్వొచ్చు. ఇలా ప్రయాణాల్లో ఇబ్బంది పడే అనారోగ్య సమస్యను మోషన్ సిక్ నెస్ అంటారు. ప్రయాణాల్లో వచ్చే వాంతులు, వికారాన్ని అధిగమించడానికి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి.

zinger

అల్లం టీ: అల్లం చాలా పవర్ ఫుల్ యాంటీ బయోటిక్ మెడిసిన్. ఇది వాంతులను ఈజీగా తగ్గిస్తుంది. వీటిలో ఎసిడిక్ యాసిడ్స్ తిన్న ఆహారం తేలికగా జీర్ణమవడానికి సహాయపడుతుంది. కాబట్టి, ప్రయాణానికి ముందు జింజర్ టీ లేదా అల్లంతో తయారుచేసిన ఆహారాలను తీసుకుంటే ఎలాంటి సమస్య లేకుండా ప్రయాణం పూర్తి చేసుకోవచ్చు. వాంతులు, వికారం మీ దరిచేరకుండా ఉంటాయి.

mint

పుదీనా టీ: పుదీనా టీ కూడా వాంతులను తగ్గించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. ఫ్రెష్ గా ఉండే పుదీనా ఆకులను నీళ్ళలో వేసి బాగా మరిగించి ప్రయాణానికి ముందు తీసుకోవాలి. అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని చేతిలో పట్టుకుని వాసన చూడటం లేదా నమలటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. పుదీనా ఆకు నుంచి వచ్చే సువాసన వాంతులు తగ్గిస్తాయి.

lemon

నిమ్మరసం: పెప్పర్, నిమ్మరసం మిక్స్ చేసిన వాటర్ తాగడం వల్ల ప్రయాణాల్లో ఇబ్బందిపెట్టే తలనొప్పి, తలతిరగడం వంటి లక్షణాల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. గోరువెచ్చని నీటిలో మిరియాలు, నిమ్మరసం కలుపుని తాగితే మరింత పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.

English summary

Foods That Stop Vomiting During Travel: Travel sickness: How To Combat Travel Sickness

Some people get nausea, vomiting and dizziness while travelling. This is called motion sickness and is caused by the disturbance of the vestibular apparatus in ears during to motion (travel).
Story first published: Tuesday, December 1, 2015, 16:56 [IST]
Desktop Bottom Promotion