For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కిడ్నీలో స్టోన్స్ కు మీరు తీసుకొనే ఆహారమే కారణమా...

|

జ్వరం, జలుబు, కడుపునొప్పి, ఇన్ ఫెక్షన్స్ వంటి సమస్యలు కొద్దిరోజులే ఉన్నా..మనల్ని బాగా భాదిస్తుంటాయి. అయితే వీటి నివారణకు సరైన చికిత్స తీసుకుంటే వీటి బారి నుండి విముక్తి పొందవచ్చు. అయితే, దీర్ఘకాలిక వ్యాధులు అలా కాదు...ఏళ్ల తరబడి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఇలాంటి దీర్ఘకాలిక అనారోగ్యాలకు కొన్ని ఆహార నియమాలను పాటిస్తుంటే వాటి నుండి త్వరగా కోలుకోవడం చాలా సులభం.

READ MORE: కిడ్నీ ఇన్ఫెక్షన్ ను నివారించే 20 ఉత్తమ హోం రెమెడీస్

అలాంటి దీర్ఘకాలికంగా వేధించే సమస్యల్లో కిడ్నీ సమస్యలు ఒకటి. ఈ మద్యకాలంలో కిడ్నీలో రాళ్ల సమస్యను కూడా ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు. ఈ సమస్యకు ప్రస్తుతం ఎన్నో రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ తీసుకొనే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

మంచి నీరే మహా ఔషధం:

మంచి నీరే మహా ఔషధం:

శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపి, విసర్జక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో నీళ్లు బాగా సహకరిస్తాయి. అందుకే కిడ్నీలో రాళ్లు చేరకుండా ఉండాలన్నా, లేక చేరిన రాళ్లను క్రమంగా తగ్గించాలన్నా కనీసం రెండున్నర నుంచి మూడ లీటర్ల నీళ్లు త్రాగడం మంచిదని వైద్యుల సలహా. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నవారు. సమస్య ఎక్కువగా ఉన్నవారు ప్రతి రోజూ 4లీటర్లకు తగ్గకుండా నీరు త్రాగడం మంచిది. నీళ్లు తక్కువైనా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి.

 ఉప్ప విషయంలో జాగ్రత్తలు వహించాలి:

ఉప్ప విషయంలో జాగ్రత్తలు వహించాలి:

కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు , సమస్య తీవ్రం కాకుండా ఉండాలంటే, వారు తీసుకొనే ఆహారంలో ఉప్పుశాతాన్ని తగ్గించాలి. అలాగే ప్యాక్ చేసిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్, హోటల్ ఫుడ్స్, రెస్టారెంట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో సోడియం శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అలాంటి ఆహారాలను బయట కొనాలనుకొన్నప్పుడు వాటిలోని సోడియం 15శాతం కంటే తక్కువ ఉన్న వాటిని మాత్రమే ఎంపిక చేసుకోవాలి. రుచి కోసం ఉప్పుకి ప్రత్యామ్నాయంగా మిరియాలు, నిమ్మరసం వంటివి ఉపయోగించుకోవచ్చు.

 క్యాల్షియం :

క్యాల్షియం :

క్యాల్షియం అధికంగా ఉన్న ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల కిడ్నీలలో ఉండే ఆక్సలేట్ రాళ్ల సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. గంజి, ఆరెంజ్, సోయా ఉత్పత్తుల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

రెడ్ మీట్ లో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఇంకా వీటిలో ఉండే యూరిక్ యాసిడ్ వల్ల కిడ్నీ స్టోన్స్ ను ఏర్పడేలా చేస్తాయి . యూరిక్ యాసిడ్ ఎక్కువగా పెరగడం వల్ల కిడ్నీ స్టోన్ అధికమైవుతాయి.కాబట్టి కిడ్నీ సమస్యలున్నవారు, రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి.

కార్బొనేటెడ్ డ్రింక్స్ :

కార్బొనేటెడ్ డ్రింక్స్ :

సోడా మరియు ఇతర ఎనర్జీ డ్రింక్స్ వంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ కిడ్నీ స్టోన్స్ పెంచే ప్రమాధాన్ని సూచిస్తుంది. కోలాలో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ వల్ల కిడ్నీ స్టోన్స్ పెరగానికి అవకాశం ఉంది. మరియు ఇవి క్రోనిక్ కిడ్నీ డిసీజ్ ను పెంచడానికి కారణం అవుతాయి. ఇంకా క్రోనిక్ కిడ్నీ స్టోన్ డిసీజ్ ను పెంచడంలో కూడా ముఖ్య పాత్రను వహిస్తాయి.

రిఫైండ్ చేసిన కార్బోహైడ్రేట్స్:

రిఫైండ్ చేసిన కార్బోహైడ్రేట్స్:

రిఫైడ్ కార్బోహైడ్రేట్స్ రైస్, షుగర్, మరియు రిఫైండ్ ఫ్లోర్స్ లో ఇన్సులిన్ లెవల్స్ అధికంగా ఉండటం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. దాని వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణం అవుతాయి.

కెఫిన్:

కెఫిన్:

ఎక్కువగా కెఫినేటెడ్ డ్రింక్స్ త్రాగడం వల్ల యూరిన్ లో క్యాల్షియం పెరిగి, కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణం అవుతుంది . కెఫిన్ డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి ఇది ఒక ముఖ్య కారణం కావచ్చు.

ఆర్టిఫిషియల్ స్వీట్ నర్న్స్:

ఆర్టిఫిషియల్ స్వీట్ నర్న్స్:

ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి కారణం అవుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం కిడ్నీ స్టోన్స్ ఏర్పడటాకి కారణం అవుతుందని వెల్లడిస్తున్నారు.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

ఆల్కహాల్ పరిమితికి మించి తీసుకోవడం వల్ల కిడ్నీలను మరియు లివర్ ను డ్యామేజ్ చేస్తుంది. ఇది డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది. ఇది కిడ్నీలు నార్మల్ గా పనిచేయడానికి అంతరాయం కలిగించి, కిడ్నీ స్టోన్స్ పెరిగేలా చేస్తుంది.

పాలకూర

పాలకూర

పాలకూర, బెండకాయ, దుంపలు వంటి వాటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పోషకాలతో పాటు వాటిలో ఆక్సలేట్లు కూడా ఎక్కువగా ఉండడం వల్ల మూత్రపిండాల్లో క్యాల్షియం ఆక్సలేట్ రాళ్లున్న వారికి అవి హాని చేస్తాయి. అందుకే వీటిని తక్కువ మోతాదులో, అదీ క్యాల్షియ అధికంగా ఉండే ఆహారంతో పాటు కలిపి తీసుకోవాలి.

డార్క్ చాక్లెట్,

డార్క్ చాక్లెట్,

డార్క్ చాక్లెట్, బ్లాక్ టీ, సోయాబీన్ , చిలకదడదుంప వేరుశెనగ వంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి.

విటమిన్ సి

విటమిన్ సి

విటమిన్ సి కూడా మరీ ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవడం మంచిది. ఆహారంగా ఏది తీసుకున్నా అందులో సోడియం శాతం తక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

English summary

Foods That Trigger Kidney Stones: Health Tips in Telugu

Some of the causes of kidney stone includes dehydration, excessive consumption of alcohol, heredity, overweight, digestive problems and improper diet. The symptoms may vary from person to person. However, some of the common symptoms are frequent urination, blood in urine, nausea, fever, chills and extreme exhaustion.
Desktop Bottom Promotion