For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కళ్ళు నొప్పిగా ఉన్నాయా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని...

By Super
|

అత్యంత సున్నితమైన అవయవాలలో కన్ను ఒకటి, కంటికి చిన్ని దెబ్బ తగిలినా ప్రమాదకర పరిస్థితులు వస్తాయి. చాలామంది కంటికి ఎక్కువ శ్రద్ధ తీసుకోరు, భవిష్యత్తులో దీనివల్ల అనేక ఇబ్బందులు కలగడమే కాకుండా కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది.

మీరు నొప్పి లేదా కంట్లో ఏదైనా అసౌకర్యంగా ఉన్నట్లు అనిపిస్తే, మీరు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే ఆ పరిస్థితి చాలా క్లిష్టమైనది, మీరు కంటిచూపు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. READ MORE: కంటి అలసట, ఒత్తిడి తగ్గించుకోవడానికి 10 మార్గాలు

కంటి నొప్పికి ఇక్కడ కొన్ని సాధారణ కారణాలు ఇవ్వబడ్డాయి. కంటి చూపు చాలా ప్రధానం, కంటి నొప్పికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కంటి నొప్పి లో రకాలు

కంటి నొప్పి లో రకాలు

కంటి నొప్పిని ఆప్తల్మాల్జియా అంటారు, ఇవి రెండు రకాలు.

కంటిలోపల నొప్పి:

కంటిలోపల నొప్పి:

ఇది కంటి ఉపరితలంపై వస్తుంది. దీనివల్ల దురద, మంట, జిల వంటివి వస్తాయి. మీ కంటికి దెబ్బ తగిలినపుడు సాధారణంగా ఇలాంటివి సంభవిస్తాయి. ఈ రకమైన కంటి నొప్పిని కంటి చుక్కల మందుతో తేలికగా చికిత్స చేయవచ్చు.

ఆర్బిటాల్ నొప్పి:

ఆర్బిటాల్ నొప్పి:

ఇది కంటి లోపల వస్తుంది, దీనివల్ల గుచ్చుకున్నట్లు, బాగా నొప్పి, ఇసుక తగిలినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పిని మీరు గమనించి నపుడు మంచి వైద్యుడిని సంప్రదించడం మంచిది, ఇది తీవ్రమైన పరిస్థితికి అంతర్లీన కారణం కావచ్చు.

విదేశీ వస్తువులను ప్రవేసపెట్టడం

విదేశీ వస్తువులను ప్రవేసపెట్టడం

మీ కంట్లో మురికి, దుమ్ము చేరినపుడు ఈ రకమైన నొప్పి రావడం చాలా సాధారణం. దీనివల్ల కంట్లో దురద, ఎర్రగా మారాదం జరిగి, కన్ను నీరుకారుతూ ఉంటుంది. మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అద్భుతమైన చిట్కాలను ఇస్తాము.

దేబ్బతగిలినపుడు

దేబ్బతగిలినపుడు

కంట్లో నొప్పికి దెబ్బతగలడం కూడా ఒక ప్రధానం కారణం. రసాయనాల వల్ల మంటలు లేదా వెలుతురూ వల్ల మంటల వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది. సూర్యరశ్మి వంటి కాంతి ని నిలకడగా, ఎక్కువ సేపు చూడడం వల్ల కూడా దురదలు వస్తాయి, వీటివల్ల కూడా కళ్ళలో నొప్పులు వస్తాయి! కనుబొమల కింద మీరేపుడైన నొప్పిని అనుభవించారా? కనుబొమల కింద నొప్పికి ఇక్కడ 12 కారణాలు ఇవ్వబడ్డాయి.

 స్టై

స్టై

మీ సేబాకస్ గ్లాండ్స్ నల్లగా ఉండడం వాళ్ళ ఎర్రటి మొటిమ లాంటిది ఏర్పడుతుంది దీన్నే స్టై అంటారు. ఇది సాధారణంగా కంటి లోపల లేదా కనురెప్ప చివర ఏర్పడుతుంది. ఇది ప్రమాదకరం కాదు, కొన్ని రోజులలోనే మానిపోతుంది. కన్ను చాలా సున్నితంగా ఉండడం వాళ్ళ, కొద్ది పాటి నొప్పి ఉంటుంది. అది దానంతట తగ్గేదాకా దాన్ని తాకకుండా ఉండడం మంచిది.

కాంటాక్ట్ లెన్స్ వల్ల దురదలు

కాంటాక్ట్ లెన్స్ వల్ల దురదలు

మీరు ప్రతిరోజూ, రోజంతా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నట్లితే, మీ కంటిలో నొప్పి వస్తుంది. మధ్యమధ్యలో లెన్స్ ని శుభ్రం చేసుకోకపోతే నొప్పి తీవ్రమౌతుంది. ఆ దురద వాళ్ళ కంట్లో నొప్పెకాకుండా ఇన్ఫెక్షన్ కి కూడా దారితీస్తుంది. పాతవి, ఎక్స్పైర్ అయిన లెన్స్ వల్ల కూడా మీ కళ్ళకు నొప్పి కలుగవచ్చు.

గ్లుకోమ

గ్లుకోమ

గ్లుకోమ అనేది ప్రమాదకరమైన పరిస్థితి, దీనివల్ల కంటిలోపల ఒత్తికి పెరిగి కంటి లోని ఆప్టిక్ నేర్వ్ ను దెబ్బతీస్తుంది. దీనివల్ల విపరీతమైన నొప్పి ఉంటుంది, ఒకవేళ దీన్ని గుర్తించకపోతే, కంటిచూపు పోయే ప్రమాదం ఉంది.

తగినంత విశ్రాంతి:

తగినంత విశ్రాంతి:

మీ కంటికి ఏరకమైన దురద లేదా నొప్పిగా ఉన్నట్లయితే, వాటిని కష్టపెట్టకుండా విశ్రాంతి నివ్వడం మంచిది. టెలివిజన్ చూడడం, కంపూటర్ లేదా మొబైల్ ఫోన్లను వాడడం మానుకోండి, అవి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తాయి.

నీటితో చికిత్స:

నీటితో చికిత్స:

కొద్ది చల్లని నీటిని మీ కంటిపై చల్లి శుభ్రం చేసుకుంటే, దురద తగ్గి తేలికగా ఉంటుంది.

మీ నొప్పి దానంతట అది తగ్గకుండా, పునరావ్రుతమౌతుంటే, వైద్యుడిని సంప్రదించి, తరచుగా కంటి పరిక్ష చేయించుకోవడం మంచిది. స్వంత చికిత్స మానుకోండి.

English summary

Have eye pain? Here’s what you should know

Eye is one of the most delicate organs and even little damage to the eye can have serious consequences. Most of us doesn't care much about eye and in future it create a lot of issues including loss of eye sight.
Desktop Bottom Promotion