For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుల్లపుల్లని పచ్చిమామిడికాయలోని 14 ఆరోగ్య ప్రయోజనాలు

|

మండించే వేసవి మధురమైన మామిళ్లనీ అందించి వేసవి ఎంతో హాయి అనిపించేలా చేస్తుంది. ఎ, సి విటమిన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇందులోని సి- విటమిన్‌ అద్భుత యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ వేసవి సీజన్ లో ప్రతీ వీధి కార్నర్ లోనూ, సంధుల్లో, మార్కెట్లోనూ పచ్చిమామిడి కాయలు రాశులుగా పోసి అమ్ముతుంటారు. వీటిని చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.

పండిన మామిడి పండ్ల కంటే పచ్చిమామిడిలో చాలా మంచిది . ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. అదే పండిన మామిడి పండులో క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల మరింత బరువు పెరగడానికి కారణం అవుతుంది.

అందువల్ల పచ్చిమామిడికాయలను తినడం ఉత్తమ ఎంపిక. పచ్చిమామిడికాయలు డయాబెటిక్ వారికి మేలు చేస్తుంది. అయితే ఏదైనా కూడా మితంగా తీసుకోవడం అనేది అన్ని రకాల ఆరోగ్యానికి మంచిది . అదే విధంగా పచ్చిమామిడికాయను ఎక్కువగా తినడ వల్ల గొంతునొప్ని, అజీర్తి, డైసెంట్రీ మరియు పొట్ట ఉదరంలో నొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా పచ్చిమామిడిలో పాలు కారుతుంటే అలాంటి వాటికి దూరంగా ఉండాలి.

పచ్చిమామిడికాయలో పాలు కారుతుంటే, వాటిని పూర్తిగా నివారించాలి. లేదంటే ఇది పొట్ట అంతర్భాగంలోని ప్రేగులు, గొంతు, మరియు నోటి ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. మరి పచ్చిమామిడికాయలను మితంగా తీసుకోవడం వల్ల పొందే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

 బరువు తగ్గిస్తుంది:

బరువు తగ్గిస్తుంది:

పచ్చిమామిడికాయ తినడానికి ఒక ఉత్తమ ఆహారం. మీరు క్యాలరీలు తగ్గించుకోవాలని అనుకుంటే పండిన మామిడిపండ్లు కంటే పచ్చిమామిడికాయలను తీసుకోవడం మంచిది. పండిన పండ్లలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే మరింత బరువు పెంచుతుంది.

 ఎసిడిటి:

ఎసిడిటి:

మీరు ఎసిడిటితో మరియు గుండెలో మంట వంటి లక్షణాలతో బాధపడుతుంటే ఈ పచ్చిమామిడి ఉత్తమ పరిష్కారం . ఎసిడిటి తగ్గించడానికి ఒక చిన్న పచ్చిమామిడి ముక్కను తినాలి.

మార్నింగ్ సిక్ నెస్:

మార్నింగ్ సిక్ నెస్:

గర్భినీ స్త్రీలో ఇది సాధారణ సమస్య. అందువల్ల పచ్చిమామిడి మరియు మరేదైనా ఇతర పుల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల సమస్యను నివారించవచ్చు.

ఎనర్జీ ఇస్తుంది:

ఎనర్జీ ఇస్తుంది:

పచ్చిమామిడి ఎనర్జీని అందిస్తుంది . కొందరు ఆరోగ్య నిపుణుల ప్రాకారం భోజనం తర్వాత తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

కాలేయానికి మంచిది:

కాలేయానికి మంచిది:

పచ్చిమామిడి వల్ల మరో ఉత్తమ ప్రయోజనం కాలేయ వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . పిత్తాశయంలో ఆమ్లామలను ప్రేరేపించి జీర్ణరసాలను పెంచతుంది.

ప్రిక్లీహీట్ తగ్గిస్తుంది:

ప్రిక్లీహీట్ తగ్గిస్తుంది:

ప్రిక్లీహిట్ తగ్గించడం మాత్రమే కాదు , సన్ స్ట్రోక్ తగలకుండా రక్షణ కల్పిస్తుంది.

 రక్తప్రసరణకు మంచిది:

రక్తప్రసరణకు మంచిది:

పచ్చిమామిడిలో ఉండే విటమిన్ సి వల్ల రక్తంలోని డిజార్డర్స్ ను తగ్గిస్తుంది . రక్తం యొక్క ఎలాసిటిని పెంచుతుంది. కొత్తగా రక్తకణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

మలబద్దకాన్ని నివారిస్తుంది:

మలబద్దకాన్ని నివారిస్తుంది:

మలబద్దక సమస్య ఉన్నవారు కొద్దిగా పచ్చిమామడికాయను చప్పరించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా ఉప్పు , తేనె మిక్స్ చేసి తీసుకుంటే మరింత మేలు.

చెమట:

చెమట:

పచ్చిమామిడికాయ జ్యూస్ త్రాగడం వల్ల, వేసవిలో సోడియం క్లోరైడకం ఐరన్ చెమటరూపంలో కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి పచ్చిమామిడికాయ వీటిని బర్తీ చేస్తుంది.

డయాబెటిస్:

డయాబెటిస్:

డయాబెటిస్ వారికి చాలా మేలు చేస్తుండి . పెరుగుతో పాటు తీసుకుంటే శరీరంలో షుగర్ లెవల్స్ ను కట్ చేస్తుంది.

మినిరల్స్ కోల్పోకుండా నివారిస్తుంది:

మినిరల్స్ కోల్పోకుండా నివారిస్తుంది:

శరీరంలో ఐరన్ మరియు సోడియం క్లోరైడ్ కోల్పోకుండా నివారిస్తుంది . పచ్చిమామిడికాయ వల్ల ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

 దంతసమస్యలు:

దంతసమస్యలు:

పచ్చిమామిడికాయ దంతక్షయాన్ని నివారిస్తుంది . దంతాల నుండి రక్తస్రావం జరగకుండా , నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.

వ్యాదినిరోధక పెంచుతుంది

వ్యాదినిరోధక పెంచుతుంది

శరీరంలో వ్యాధినిరోధకతను పెంచి, ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది

స్కూర్వి

స్కూర్వి

విటమిన్ లోపం వల్ల ఏర్పడి స్కూర్వి వ్యాధిని నివారిస్తుంది

English summary

14 Health Benefits Of Green/ Raw Mango

Raw mango is one of the healthiest fruits you can try out in the beginning of summer. At every nook and corner you will see a cart loaded with raw mangoes and it is indeed a bliss to see people indulging in this lovely sour treat.
Story first published: Saturday, April 4, 2015, 17:36 [IST]
Desktop Bottom Promotion