For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చెవి ఇన్ ఫెక్షన్ నివారణకి ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Super
|

పెద్దవారిలో కంటే శిశువులలో చెవి ఇన్ ఫెక్షన్లు అధికం.పోషకాహార లోపం,అంతర్గత గాయాలు,పర్యావరణ సంబంధిత ఎలర్జీలు, అడినాయిడ్ గ్రంధుల వాపు లేదా ఇంఫెక్షన్లు, అధిక శ్లేష్మం,ఫుడ్ ఎలర్జీలు,జన్యుపరమైన లోపాలు,సైనస్ ఇంఫెక్షన్లు, ఫీటల్ ఆల్కాహాల్ సిండ్రోం(తల్లి గర్భిణికాలంలో మితిమీరి మద్యము సేవించినట్లయితే శిశువుకు సంక్రమించు మానసిక క్షీణత), పొగ త్రాగడం,జలుబు, శ్వాశ కోశ ఇన్ ఫెక్షన్లు, చెవిలో గులిమి పేరుకుపోవడం లాంటివి చెవి ఇన్ ఫెక్షన్లకి కారకాలు.

READ MORE: చెవి నొప్పికి త్వరగా ఉపశమనం కలిగించే ఉత్తమ చిట్కాలు

చెవి ఇన్ ఫెక్షన్ల సంకేతాలు అందరిలో ఒకేలాగ ఉండవు.చెవి పోటు, వికారం, నిద్రలేమి,శబ్దాలకి పెద్దగా స్పందించకపోవడం, తీవ్ర జ్వరం,తలనెప్పి,చెవిలో లాగుతున్నట్లుండడం, చెవి నుండి ద్రవం లాంటిది కారడం మొదలైన సంకేతాల ద్వారా చెవి ఇన్ ఫెక్షన్ ని గుర్తించవచ్చు.

READ MORE: జ్ఞానదంతాల నొప్పికి ఉపశమనం కలిగించే స్మూత్ ఫుడ్స్

ఈ ఇన్ ఫెక్షన్ ని నివారించడానికి ఇంటిలో అవలంబించగలిగే మూలికా వైద్య పద్ధతులు కింద పేర్కొన్నాము, ప్రయత్నించి చూడండి.

ఉప్పు లేదా బియ్యం:

ఉప్పు లేదా బియ్యం:

ఇది అధ్భుతం గా పనిచేసే చిట్కా.ఒక కప్పు ఉప్పు తీసుకుని దానిని, మైక్రో వేవ్, కడాయి లేదా డబల్ బాయిలర్ లో 3-5 నిమిషాలు వేడిచెయ్యాలి.ఇప్పుడు ఒక మందమైన సాక్సు లేదా బట్ట లో ఈ వేడి చేసిన ఉప్పు వెయ్యండి. సాక్సు లేదా బట్ట పై భాగం లో ఒక ముడి వేసి బిగించాలి . ఇది వెచ్చగా ఉన్నప్పుడు ఇన్ ఫెక్షన్ కి గురైన చెవి మీద 5-10 నిమిషాలు ఉంచాలి.ప్రతీరోజూ ఇలా చెయ్యాలి. ఉప్పు కి బదులు బియ్యం వేడి చేసి, బట్ట లో మూట కట్టి చెవి మీద ఉంచవచ్చు

ఆలివ్ లేదా ఆవ నూనె:

ఆలివ్ లేదా ఆవ నూనె:

కొంచం ఆవ లేదా ఆలివ్ నూనె తీసుకుని వెచ్చబెట్టాలి. కొన్ని చుక్కల వెచ్చటి నూనె చెవిలో వెయ్యడం ద్వారా చెవి నెప్పి నుండి విముక్తి పొందవచ్చు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి లో ఉండే నొప్పి నివారణ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల చాలా వ్యాధుల నివారణకి వెల్లుల్లి వాడతారు. అందులో చెవి ఇన్ ఫెక్షన్ కూడా ఒకటి.ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలని 2 టేబుల్ స్పూన్ల ఆవ లేదా నువ్వుల నూనెలో నూనె నల్లగా మారేవరకూ వేయించాలి.దీనిని వడకట్టి 2-4 చుక్కలచొప్పున వెచ్చటి నూనె ని ఇన్ ఫెక్షన్ ఉన్న చెవిలో వెయ్యాలి. వెల్లుల్లి ని మరొకవిధం గా కూడా వాడచ్చు. 2-3 తాజా వెల్లుల్లి రెబ్బలని నీటిలో 5 నిమిషాలు మరిగించాలి.నీరు మరిగాకా వెల్లుల్లి రెబ్బలని మెత్తగా నలిపి, ఆ నీటిలో కాస్త ఉప్పు కలపాలి.ఒక శుభ్రమైన బట్ట మీద ఈ వెల్లుల్లి నీటిని తీసుకుని ఇన్ ఫెక్షన్ ఉన్న చెవిలో మెల్లిగా పోయాలి. లేదా రోజూ 2-3 వెల్లుల్లి రెబ్బాలు తినడం వల్ల ఇన్ ఫెక్షన్ లు త్వరగా తగ్గుముఖం పడతాయి.

ఆపిల్ సిడార్ వెనిగర్

ఆపిల్ సిడార్ వెనిగర్

చెవి ఇన్ ఫెక్షన్ల నుండి ఉపశమనానికి ఆపిల్ సిడార్ వెనిగర్ ని కూడా ఉపయోగించవచ్చు,కొంచం ఆల్కాహాల్ లేదా నీరు తీసుకుని దానికి సమపాళ్ళలో ఆపిల్ సిడార్ వెనిగర్ కలపాలి.ఒక దూది ని ఈ ద్రవం లో ముంచండి. ఈ దూది ని చెవిలో పెట్టుకోవాలి. దూది ని తీసేసాకా అపసవ్య దిశలో పడుకోవడం వల్ల ఆపిల్ సిడార్ ద్రవం చెవి లోకి ఇంకుతుంది.తరువాత హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించి తడిగా ఉన్న చెవిని ఆరబెట్టుకోవచ్చు. ఒక వేళ ఆపిల్ సిడార్ వెనిగర్ అందుబాటులో లేకపోతే వైట్ వెనిగర్ అయినా ఉపయోగించవచ్చు.

ఉల్లిపాయ

ఉల్లిపాయ

ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని సన్నగా తరగాలి,దీనిని ఒక బౌల్ లో తీసుకుని మైక్రో వేవ్ లో 1-2 నిమిషాలు వేడిచెయ్యాలి. చల్లారాకా ఉల్లిపాయ నుండి రసం పిండి ఆ రసాన్ని చెవిలో వెయ్యాలి. తలని అటూ ఇటూ కదల్చడం ద్వారా ఈ రసం లోపలకి ఇంకేటట్లు చెయ్యవచ్చు. ఇంకొక పద్ధతేమిటంటే ఒక ఉల్లిపాయని దాదాపు ఒక అరగంట పాటు బేక్ చెయ్యాలి.ఇప్పుడు ఈ ఉల్లిపాయ ని సగానికి కోసి ఒక సగాన్ని శుభ్రమైన బట్టలోకి తీసుకుని ఇన్ ఫెక్షన్ ఉన్న చెవి మీద ఒక 5 నిమిషాలపాటు ఉంచాలి.మరలా రెండో చెవి మీద కూడా ఇలాగే చెయ్యాలి.

హీటింగ్ ప్యాడ్ లేదా వెచ్చటి నీళ్ళ బాటిల్ టెక్నిక్:

హీటింగ్ ప్యాడ్ లేదా వెచ్చటి నీళ్ళ బాటిల్ టెక్నిక్:

ఇన్ ఫెక్షన్ ఉన్న చెవి కి కాస్త వేడి ని తగిలించడం వల్ల నొప్పిని నివారించి అక్కడ బాక్టీరియా పెరగకుండా అరికట్టవచ్చు.హీటింగ్ ప్యాడ్ లేదా వెచ్చటి నీరు నింపిన సీసా ని ఇన్ ఫెక్షన్ ఉన్న చెవి మీద ఉంచాలి. చెవి ఇంఫెక్షన్ వల్ల వచ్చే నొప్పి నివారణకు కాపడం కూడా పెట్టవచ్చు. ఒక శుభ్రమైన బట్ట ని వెచ్చటి నీటిలో ముంచి పిండాలి.ఈ బట్ట ని ఇన్ ఫెక్షన్ ఉన్న చెవి మీద ఉంచాలి. ప్రతీరోజూ అంటే నొప్పి తగ్గుముఖం పట్టేవరకూ ఈ పద్ధతిని పాటించాలి. గమనిక:చెవి దగ్గర అధిక వేడి పనికిరాదు. అందువల్ల వెచ్చటి బట్ట లేదా సీసా ని ఒక 5 నిమిషాలు చెవి మీద ఉంచి తీయాలి. కాసేపాగి మరలా చెవి కి వేడి తగలనీయచ్చు.

రొమ్ము పాలు:

రొమ్ము పాలు:

ఒక చిన్న డ్రాపర్ తీసుకుని కొన్ని చుక్కల రొమ్ము పాలు ఇన్ ఫెక్షన్ ఉన్న చెవిలో వెయ్యాలి.ఇలా ప్రతీ కొన్ని గంటలకీ ఒకసారి చేసి చెవి నెప్పి ని నివారించవచ్చు. ఈ పద్ధతి చిన్న పిల్లలకే కాక పెద్ద వారికి కూడా ఉపయుక్తమే.

తేనె

తేనె

మనూక చెట్టు నుండి తీసిన మనూక తేనె పలు రకాల వ్యాధులకి నివారిణి గా రుజువు చెయ్యబడింది. కొంచం తేనె తీసుకుని చెవి కెనాల్ చుట్టూ రుద్దడం వల్ల చెవి ఇన్ ఫెక్షన్ల వల్ల వచ్చే నెప్పి ని నివారించవచ్చు

 హైడ్రోజన్ పెరాక్సైడ్:

హైడ్రోజన్ పెరాక్సైడ్:

చెవి ఇన్ ఫెక్షన్ ల నివారణ కి ఇది చాలా ప్రసిద్ధం.ఒక చిన్న దూది ని హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ముంచి పిండాలి. ఇప్పుడు ఈ దూది ని చెవి మీద ఉంచాలి. తరువాత వెచ్చటి నీటితో చెవి చుట్టూ శుభ్రం చేసుకోవచ్చు.

కొలోడియల్ సిల్వర్

కొలోడియల్ సిల్వర్

కొలోడియల్ సిల్వర్ అనే ఈ పదార్ధం అరుదుగా వంటగదుల్లో దర్శనమిస్తుంది.కానీ ఇది చెవి నెప్పి నివారణకి చాలా సమర్ధవంతం గా పనిచేస్తుంది.కొంచం కొలోడియల్ సిల్వర్ ని వెచ్చబెట్టి చెవిలో వెయ్యాలి లేదా కొంచం కొలోడియల్ సిల్వర్ ని సుగంధ నూనెలో కలిపి చెవి నెప్పి నివారణ కి వాడవచ్చు.

English summary

Home Remedies to Cure Ear Infection: Health Tips in Telugu

Infants and small children are more likely to get ear infection as compared to adults. Some common causes of ear infection include nutritional deficiencies, internal injuries, environmental allergies, infected or swollen adenoids, excess mucus, food allergies, genetic defects, sinus infections, fetal alcohol syndrome, tobacco smoking, colds, upper respiratory infections and buildup of wax in the ear.
Desktop Bottom Promotion