For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ నాలుక రంగు మీ ఆరోగ్య సమస్యలను ఎలా చెప్పుతుంది?

By Super
|

మీ నాలుక రంగు మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్పుతుంది. మీ నాలుక మరియు నాలుక రంగు మీ ఆరోగ్య సమస్య గురించి ఎలా బహిర్గతం చేస్తుంది.

మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీ డాక్టర్ మీ నాలుకను ఎందుకు చూస్తారో ఆలోచించారా? మీ నాలుక వాపు గురించే కాకుండా రంగు గురించి కూడా చూస్తారు. మాకు నాలుక రుచి మరియు మాట్లాడటం కోసం మాత్రమే అని అనుకుంటున్నాము. అయితే,ఆ సందర్భంలో కాదు.

సంప్రదాయ చైనీస్ ఔషధం మీ నాలుక మీ ఆరోగ్యాన్ని అంచనా వేస్తుందని పేర్కొంది. కానీ

మీకు మీ నాలుక రంగు మీ ఆరోగ్య సమస్యలను ఎలా బహిర్గతం చేస్తుందో అనే ఆలోచన లేదా?

How Colour Of Your Tongue Reveals Your Health Issue

నాలుక రుచి మరియు మింగడానికి, మాట్లాడటానికి సహాయపడే కండరాలను కలిగి ఉంటుంది. నాలుక రక్త నాళాలు లాలాజలమును సమృద్ధిగా సరఫరా చేయటం మరియు నిరంతరం ప్రవహించే విధంగా చేస్తాయి. ఈ విధంగా నాలుక నిరంతరం శుభ్రం చేస్తుంది. అందువలన హానికరమైన బ్యాక్టీరియా వృద్ధి తగ్గుతుంది.

అందువలన,రంగులో ఎటువంటి మార్పు ఉండదు. నాలుక యొక్క నిర్మాణం మరియు తేమ మీ ఆరోగ్య పరిస్థితిని నిర్ణయిస్తాయి. ఒక ఆరోగ్యకరమైన నాలుక రంగు పింక్ రంగులో ఉంటుంది. మీ నాలుక రంగు మీ ఆరోగ్య సమస్యలను ఎలా బహిర్గతం చేస్తుందో అని ఆశ్చర్యానికి గురి అయితే, దానిని అన్వేషించటానికి ఇక్కడ మీకు మేము చెప్పే కారణాలు సహాయపడతాయి.

నాలుక వివిధ రంగులు మరియు దాని సంబంధిత ఆరోగ్య సమస్యల గురించి ఇక్కడ చూడండి.

How Colour Of Your Tongue Reveals Your Health Issue

ఎర్ర నాలుక
మీ శరీరంలో ఉత్పత్తి అయ్యే అసాధారణ వేడి వలన రుచి మొగ్గలలో వాపు కనిపిస్తుంది అందువలన నాలుక ఎర్రగా కనబడుతుంది. ఎరుపు నాలుకకు విటమిన్ లోపం, స్కార్లెట్ ఫీవర్ మరియు కవాసకీ వ్యాధి అనేవి కొన్ని కారణాలుగా ఉన్నాయి. మీ రోజువారీ ఆహారంలో ఇనుము,విటమిన్ B-12 మరియు విటమిన్ B3 విటమిన్లు తగినంత మోతాదులో ఉండాలి.

నల్ల నాలుక
నల్ల నాలుక అనేది ఒక హానిచేయని పరిస్థితి. ఇది పేలవమైన నోటి పరిశుభ్రత కారణంగా సంభవిస్తుంది. కొన్నిసార్లు బ్యాక్టీరియా మరియు ఈస్ట్ నాలుక మధ్యభాగం మరియు ఉపరితలం వెంబడి చిక్కుకొని ఉండుట వలన చర్మం మీద నల్లని పాచెస్ తయారు అవుతాయి. స్మోకింగ్, ఎక్కువగా కాఫీ త్రాగటం వంటి అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ పరిస్థితికి దోహదపడతాయి.

పసుపు నాలుక
మీ నాలుక రంగు పసుపు రంగులో ఉంటే, అది మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్తుంది? పసుపు నాలుక మరియు నలుపు నాలుక కారణాలు పోలి ఉంటాయి. పసుపు నాలుక నాలుక ఉపరితలంపై ఈస్ట్ ఏర్పడటం మరియు మంచి నోటి పరిశుభ్రత లేకపోవడం వలన సంభవిస్తుంది.

How Colour Of Your Tongue Reveals Your Health Issue

గోధుమ నాలుక
గోధుమ నాలుక పుట్టకురుపు అనే చర్మ క్యాన్సర్ ప్రారంభ దశ రూపాన్ని సూచిస్తుంది. ముదురు రంగులో మారిన నాలుక మీద గోధుమ మచ్చలు కలిగి ఉంటే, మీరు వెంటనే మీ డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

ఊదా నాలుక
క్రానిక్ బ్రోన్కైటిస్, అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు మరియు చల్లని ఆహారాలు భారీగా తీసుకోవడం అనేవి ఊదా నాలుక రావటానికి కొన్ని కారణాలుగా ఉన్నాయి.గులాబీ రంగు నాలుక రావటానికి వెల్లుల్లి మరియు అల్లం తగినంత మోతాదులో తీసుకోవాలి.

తెలుపు నాలుక
మీరు ఎప్పుడైనా మీ నాలుక తెలుపుగా కనిపిస్తే మీ నాలుక రంగు, మీ ఆరోగ్య సమస్యలను బహిర్గతం చేస్తుందని ఆలోచించారా? నిర్జలీకరణ, నోటి వ్యాధి లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్ మరియు ల్యూకోప్లాకియా, నాలుక ఉపరితల కణాలు అదనపు పెరుగుదల,ధూమపానం వంటివి తెలుపు నాలుకకు కొన్ని కారణాలుగా ఉన్నాయి. నీరు పుష్కలంగా త్రాగటం మరియు మంచి నోటి పరిశుభ్రత నిర్వహించడం ద్వారా ఈ పరిస్థితిని అధిగమించడానికి కొన్ని మార్గాలుగా ఉన్నాయి.

కాబట్టి, ఇప్పుడు మీకు మీ నాలుక రంగు మీ ఆరోగ్యం గురించి ఏమి చెప్పిందో తెలుసుకున్నారు కదా. ఆరోగ్యకరమైన మరియు పరిశుభ్రత అలవాట్లను అనుసరించండి. ఒక ఆరోగ్యకరమైన నాలుక కలిగి ఉండటానికి మంచి నోటి పరిశుభ్రత సాధన మరియు సమతుల్య ఆహారం తీసుకోవాలి.

English summary

How Colour Of Your Tongue Reveals Your Health Issue

what does the color of your tongue say about your health, how colour of your tongue reveal your health issue, colour of your tongue, tongue color.
Story first published: Monday, May 11, 2015, 9:31 [IST]
Desktop Bottom Promotion