For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వేసవి సీజన్ లో ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ నివారించే మార్గాలు

|

వేసవికాలో జ్వరం, డయోరియా, సన్ స్ట్రోక్ వంటి జబ్బులతో పాటు, జీర్ణ సమస్యలు ఎదుర్కోవడం కూడా సహజమే. చాలా మంది వేసవికాలంలో అజీర్తి మరియు ఎసిడిక్ రిఫ్లెక్షన్ సమస్యతో బాధపడుతుంటారు. నిజానికి, వేసవి సీజన్ మొదలవ్వగానే వేసవి వేడిని ఎదుర్కోవడానికి జీవనశైలి మరియు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ఉత్తమం.

వాస్తవానికి, యాసిడ్ రిఫ్లెక్షన్ సమస్య ఉన్నప్పుడు, దీన్ని నివారించుకోవడానికి వెంటనే చికిత్సనందించకపోతే, దీర్ఘకాలంలో ప్రమాదకరంగా మారుతుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ మీద, గొంతు మరియు ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది.

ఈ సీజన్ లో చాలమంది బార్బెక్యూను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే హాట్ డాగ్స్, చీజ్ బర్గర్, సలాడ్ డ్రెస్సింగ్, బార్బెక్యూ సాస్, సోడా మరియు ఆల్కహాల్ వంటివి వేసవి సీజన్ లో హార్ట్ బర్న్ కు దారితీస్తుంది.

ఎవరైతే హార్ట్ బర్న్ కు గురి అయ్యుంటారో, వారు చెస్ట్ పెయిన్ కు కూడా దారితీస్తుంది. హార్ట్ అటాక్ కు గురి చేస్తుంది.

కాబట్టి, ఈ తీవ్ర పరిస్థితిని ఎదుర్కోక ముందే వెంటనే చికిత్సను తీసుకోవడం మంచిది. వేసవి సీజన్ లో యాసిడ్ రిఫ్లెక్షన్ ను నివారించుకోవడానికి కొన్ని మార్గాలు క్రింది విధంగా...

1. అరటి పండ్లు:

1. అరటి పండ్లు:

అరటి పండ్లు తినడం వల్ల హార్ట్ బర్న్ నివారించుకోవచ్చు. వేసవిలో హార్ట్ బర్న్ నివారించుకోవడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.

2. స్మోకింగ్:

2. స్మోకింగ్:

వేసవి సీజన్ లో హార్ట్ బర్న్ కు కారణం? స్మోకింగ్ కూడా అసిడిక్ రిఫ్లెక్షన్ కు ఒక ప్రధాణ లక్షణం. కాబట్టి, ధూమపానం నివారించాలి.

3. మాంసాహారం:

3. మాంసాహారం:

వేసవిలో మాంసాహారం తినేవారు, ముఖ్యంగా చికెన్..స్కిన్ లెస్ చికెన్ తీసుకోవాలి . ఫిష్ అయితే ఫ్రై చేసినవి కాకుండా, ఉడికించిన ఆహారాలను తీసుకోవాలి.

4. భోజనం తర్వాత :

4. భోజనం తర్వాత :

ఫుల్ గా భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోకూడదు. రాత్రుల్లో సాధ్యమైనంత తర్వాత తినాలి. పడుకోవడానికి కనీసం రెండు మూడు గంటల ముందు తింటే అసిడిక్ రిఫ్లెక్షన్ కు దారి తీయ్యదు.

5.గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

5.గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:

ఉల్లిపాయలు, సలాడ్ డ్రెస్సింగ్ మరియు టమోటోలను సాద్యమైనంత వరకూ తగ్గించుకోవాలి. ఎక్కువగా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలి.

6. బెవరేజస్:

6. బెవరేజస్:

బెవరేజస్ హార్ట్ బర్న్ ను మరింత తీవ్రం చేస్తుంది . సోడా మరియు ఆల్కహాల్ అసిడిక్ రిఫ్లెక్షన్ ప్రధాణ లక్షణాలు కలిగి ఉంటుంది . కాబట్టి, వేసవిలో వీటి వాడకాన్ని తగ్గించాలి లేదా వీటికి దూరంగా ఉండాలి.

7. వర్కౌట్స్:

7. వర్కౌట్స్:

ప్రతి రోజూ వ్యాయామాలు చేయడం ఉత్తమం. ముఖ్యంగా భోజనానికి మరియు వ్యాయామాలకు చాలా గ్యాప్ ఉండేలా చూసుకోవాలి.

8. పండ్లు:

8. పండ్లు:

వేసవిలో అసిడిటికి కారణం అయ్యే స్ట్రాబెర్రీ, నిమ్మ మరియు ఆరెంజ్ వంటి అసిడిక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి . వేసవిలో వాటర్ మెలోను తీసుకోవచ్చు.

English summary

How To Prevent Heartburn In Summer

Most of us do suffer indigestion and acid reflux in summer. Actually, it is better to make certain changes to your diet once the summer heat starts scorching your body.
Story first published: Saturday, May 2, 2015, 17:31 [IST]
Desktop Bottom Promotion