For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐరన్ లోపం ఉందని తెలిపే హెచ్చరికలేంటి ? అనీమియాకి హోం రెమిడీస్.. !!

By Nutheti
|

మ‌నం త‌ర‌చుగా ఐర‌న్ లోపం గురించి వింటుంటాం. ముఖ్యంగా మ‌హిళ‌ల్లో, చిన్న పిల్ల‌ల్లో ఐర‌న్ లోపం గురించి వైద్యులు చెబుతుంటారు. మ‌న శ‌రీరంలోని అన్ని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా కావ‌డానికి హెమోగ్లోబిన్ తోడ్ప‌డుతుంది. ఆ హెమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి ఐర‌న్ అవ‌స‌రం. ఐర‌న్ లోపిస్తే ర‌క్త‌హీన‌త‌కు దారితీస్తుంది. దానినే అనీమియా అని పిలుస్తారు.

రక్తహీనత ఉన్నా కూడా మనుషుల్లో ఎలాంటి మార్పు కనిపించకుండా లోలోపల దెబ్బతీస్తుంది. ఇది మెల్లగా రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ లోపిస్తే.. పెద్దపేగు క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది దరిచేరకముందే.. అరికట్టాలి. ఒకవేళ ఐరన్ లోపంతో బాధపడుతుంటే.. తీసుకునే ఆహారం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. ఐరన్ లోపం లక్షణాలు, దాని నివారణా మార్గాలేంటో ఇప్పుడు చూద్దాం..

ఏకాగ్రత

ఏకాగ్రత

ఐర‌న్ లోపం వ‌ల్ల తీవ్ర అల‌స‌ట ఉంటుంది. చిన్న చిన్న ప‌నుల‌కే ఎక్కువ అల‌సిపోతారు. అల‌స‌ట‌తో పాటు చికాకు, బ‌ల‌హీనంగా మార‌డం, ఏకాగ్ర‌త కుద‌ర‌క‌పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

అలసట

అలసట

నిత్యం చేసే పనులే అయినా కూడా.. ఐరన్ లోపించినప్పుడు శ్వాస తీసుకోవ‌డం క‌ష్టంగా అనిపిస్తుంటుంది. ఊరికే ఆయాసపడుతున్నట్టు కనిపిస్తే.. ఐరన్ లోపమని గుర్తించాలి.

తలనొప్పి

తలనొప్పి

ఐరన్ లోపించినప్పుడు మెదడుపై ప్రభావం పడుతుంది. మెదడులోని ర‌క్త‌నాళాలు ఉబ్బి త‌ల‌నొప్పిగా ఉంటుంది.

ఆందోళన

ఆందోళన

ఐర‌న్‌లోపం ఉన్న‌వారిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది. అన్ని విష‌యాల‌కూ తీవ్రంగా ఆందోళ‌న చెందుతుంటారు. చాలా ఆత్రుతగా వ్యవహరిస్తారు.

థైరాయిడ్

థైరాయిడ్

ఐర‌న్ లోపం వ‌ల్ల థైరాయిడ్ గ్రంథి ప‌నితీరు మంద‌గిస్తుంది. దానివ‌ల్ల హైపోథారాయిడిజమ్ అనే స‌మ‌స్య త‌లెత్త‌వ‌చ్చు. త్వ‌ర‌గా అల‌సిపోతుండ‌డం, బ‌రువు పెరుగుతుండ‌డం, శ‌రీరం చ‌ల్ల‌గా అనిపించ‌డం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

ఎగ్స్

ఎగ్స్

ఐరన్ కోడిగుడ్లలో ఎక్కువగా లభిస్తుంది. అయితే ఉడికించిన కోడిగుడ్లు తీసుకోవడం వల్ల.. ఐరన్ లోపం నుంచి బయటపడవచ్చు.

చేపలు

చేపలు

చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్సే కాదు.. ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి తరచుగా చేపలు తీసుకోవాలి. అలాగే ఐరన్ లోపంతో బాధపడేవాళ్లు చేపలను డైట్ లో చేర్చుకుంటే మంచిది.

బీన్స్, ఆకుకూరలు

బీన్స్, ఆకుకూరలు

బీన్స్, ఆకుకూరల్లో ఐరన్ తగిన స్థాయిలో ఉంటుంది. ఆకుకూరలు పిల్లలు తినడానికి ఇష్టపడరు. కాబట్టి.. బీన్స్ ఇవ్వడం, ఆకుకూరలను చపాతీలతో కలిపి ఇవ్వడం వల్ల ఐరన్ అందివ్వవచ్చు.

కూరగాయలు

కూరగాయలు

ఐరన్ లోపం ఉన్నవాళ్లు చిలకడదుంప, బఠాణీలు, బ్రొకోలి వంటి ఆకుపచ్చని కూరగాయలు తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. అందుబాటులో ఉండే కూరగాయలను నిత్యం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.

డ్రైఫ్రూట్స్

డ్రైఫ్రూట్స్

ఐరన్ లోపంతో బాధపడే స్ర్తీలు నిత్యం డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. వీటి ద్వారా ఐరన్ ని శరీరానికి కావాల్సినంత పొందవచ్చు. వీటిని రాత్రిపూట నానబెట్టి తీసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

మాంసం

మాంసం

శక్తివంతమైన ఆహారం తీసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసాహారంలో ఐరన్ మెండుగా ఉంటుంది. మేక, గొర్రె, చేపలు, రొయ్యలు తీసుకోవడం ద్వారా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. వారానికి రెండుసార్లు మాంసాహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బెల్లం

బెల్లం

చాలామంది స్వీట్స్ చేసేటప్పుడు చక్కెరనే వాడుతారు. కానీ.. పంచదారకు బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి మంచిది. బెల్లం ద్వారా ఐరన్ ఎక్కువ మోతాదులో పొందవచ్చు.

బీట్ రూట్

బీట్ రూట్

బీట్ రూట్ లో ఐరన్ రిచ్ గా ఉంటుంది. ఇది అనీమియాతో పోరాడుతుంది. అలాగే ఎర్రరక్తకణాల సామర్థ్యాన్ని పెంచడానికి తోడ్పడుతుంది. ఆక్సిజన్ స్థాయిని కూడా పెంచుతుంది.

పీనట్ బటర్

పీనట్ బటర్

పీనట్ బటర్ లో ఐరన్ లభిస్తుంది. రెగ్యులర్ డైట్ లో పీనట్ బటర్ చేర్చుకుంటే.. మంచి ఫలితాలుంటాయి. లేదంటే.. గుప్పెడు వేరుశనగలు తీసుకున్నా.. ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు.

English summary

Iron-rich Foods To Combat Anaemia: Signs And Remedies of Iron Deficiency

Anaemia is a common disorder of the blood. A person is said to have anaemia when his/her blood count of haemoglobin percentage is low. The role of haemoglobin is to transport oxygen to various parts of the body.
Desktop Bottom Promotion