For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీకు మైగ్రేన్ తలనొప్పి ఉందో లేదో తెలుసుకోవడం ఎలా...

|

మైగ్రేన్ హెడ్ ఏక్ చాలా సాధారణంగా వచ్చే తలనొప్పి. కానీ కొన్ని సందర్భాల్లో, నార్మల్ తలనొప్పిగా అనిపిస్తుంటుంది. మైగ్రేన్ తలనొప్పి వయస్సుతో నిమిత్తం లేకుండా ఏవయస్సు వారికైనా వస్తుంది. కాబట్టి వెంటనే మెడికేర్ తీసుకోవడం చాలా అవసరం.

మైగ్రేన్ హెడ్ ఏక్ చాలా తీవ్రంగా ఒక్క వైపు మాత్రమే తీవ్రమైన నొప్పితో బాధిస్తుంటుంది. ప్రస్తుత రోజుల్లో , ఈ తలనొప్పి చాలా సాధారణ సమస్యగా మారింది. ఇది తలకు ఒక్కవైపు మాత్రమే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో నొప్పి తలమొత్తం విస్తరిస్తుంది.

మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు ఇతర లక్షణాలు కూడా కలిగి ఉంటారు . దీన్నే aura అని పిలుస్తుంటారు. ఈ లక్షణాలున్న వారిలో ఏదో జరగుతుందని గ్రహిస్తుంటారు లేదా ఆందోళన కలిగి ఉంటారు . ఇది కేవలం మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారిలో మాత్రమే తెలుస్తుంది.

మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారిలో ఈ మైగ్రేన్ రాక ముందు నుండే ఈ aura లక్షణాలు బయటపడుతుంటాయి. కంటకి అడ్డుగా కొన్ని విజ్యువల్ లైన్స్ లేదా స్పాట్స్ ను చూస్తున్నట్లుగా అనిపిస్తుంటుంది. మరియు కొన్ని అసాధరన మరియు అసౌకర్యమైన ఆలోచనలను కలిగి ఉంటారు .

కొన్ని సందర్భాల్లో, చాలా షార్ఫ్ హెడ్ ఏక్ ను కలిగి ఉంటారు. అది కూడా మైగ్రేన్ హెడ్ ఏక్ కు ఒక సంకేతంగా గుర్తించాలి. ఈ ఆర్టికల్ మీ మైగ్రేన్ హెడ్ ఏక్ కు సంబంధించిన కొన్ని సందేహాలను క్లియర్ చేస్తుంది. మరి మీకు తీవ్రంగా బాధించే తలనొప్పి సాధారణ నొప్పా లేదా మైగ్రేన్ హెడ్ ఏకా అని తెలుసుకోవడానికి ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

1.ఒక వైపు మాత్రమే తలనొప్పి బాధిస్తుంటుంది:

1.ఒక వైపు మాత్రమే తలనొప్పి బాధిస్తుంటుంది:

తలకు ఒక వైపు మాత్రమే ఎక్కువగా నొప్పి వస్తుంటుంది. మరియు తరచూ తలనొప్పికి గురి చేస్తుంటే అది మైగ్రేన్ తలనొప్పిగా గుర్తించాలి . మైగ్రేన్ హెడ్ ఏక్ చాలా షార్ప్ గా , తరచుగా ఒక సైడ్ హెడ్ ఏక్ , ఒక వైపు నెక్ పెయిన్ కూడా ఉంటే అది మైగ్రేన్ తలనొప్పికి సంకేతంగా గుర్తించాలి.

2.బ్రైట్ లైట్ మరియు వికారం:

2.బ్రైట్ లైట్ మరియు వికారం:

తలనొప్పితో పాటు వికారంగా, బ్రైట్ లైట్ గా మరియు కొన్ని ఆహారాలు కూడా మైగ్రేన్ తలనొప్పికి కారణం అవుతాయి . వన్ సైడ్ తలనొప్పితో పాటు రెండు కళ్ళలో ఏ ఒక్క కన్ను నొప్పిగా అనిపించినా..అది మైగ్రేన్ తలనొప్పిగా భావించాలి.

3.అసాధరణమైన ఆలోచనలు:

3.అసాధరణమైన ఆలోచనలు:

మైగ్రేన్ తలనొప్పికి ముందు, విజువల్ గా కళ్లకు మిరుమిట్లుగొలిపినట్లుగా అనిపించవచ్చు. దీన్నే aura అనిపిలుస్తారు . కంటిచూపులో అసౌకర్యంగా అనిపించడం, ఇబ్బందిగా ఉంటే అది మైగ్రేన్ తలనొప్పిగా గుర్తించాలి. ఇది తలనొప్పి ప్రారంభమవ్వడానికి ముందు 5 నిముషాల నుండి ఒక గంట వరకూ వుంటుంది.

4.డిప్రెషన్ మరియు చీకాకు:

4.డిప్రెషన్ మరియు చీకాకు:

తరచూ మూడ్ మారుతుంటడం మరియు సడెన్ గా డిప్రెషన్ లోకి మారడం జరగుతుంది . మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు తలనొప్పితో పాటు ఈ లక్షణాలను కూడా కలిగి ఉంటారు.

5.నిద్రసమస్యలు:

5.నిద్రసమస్యలు:

తలనొప్పి సమస్యలున్న వారు పూర్తిగా నిద్రపోలేరు . మద్యరాత్రిలో నిద్రలేవడం, మరియు తిరిగి నిద్రపోవడానికి కష్టంగా భావించే వారిలో ఈ సమస్యలు అధికంగా ఉంటాయి.

6.ముక్కు నుండి నీరు కారడం లేదా ముక్కుదిబ్బడ:

6.ముక్కు నుండి నీరు కారడం లేదా ముక్కుదిబ్బడ:

మైగ్రేన్ తలనొప్పితో బాధపడే వారు కళ్ళ నుండి మరియు ముక్కనుండి నీరు కారడం లేదా ముక్కుదిబ్బడగా ఫీలవుతారు. శ్వాసనాళంలో ఇబ్బందలుగా ఫీలవుతారు . ఈ లక్షనాలున్నట్లైతే మైగ్రేన్ తలనొప్పి ఉన్నట్టుగా గుర్తించాలి . అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ ను కలవడం తప్పనిసరి.

7.వామిటింగ్:

7.వామిటింగ్:

తలతిరగడంతో పాటు వాంతులు కూడా అవుతుంటే మైగ్రేన్ తలనొప్పిగా గుర్తించాలి . మీరు వికారం, కళ్లు తిరగడం మరియు తలతిరగడం వంటి లక్షణాలు కనిపించినట్లైతే మైగ్రేన్ తలనొప్పికి ఇది ఒక ఖచ్చితమైన సంకేతంగా గుర్తించాలి.

English summary

Signs That You Are Having A Migraine Headache

Migraine headaches are very peculiar, but, sometimes, they may be mislead as to a normal headache. Migraine headache can occur to any person and needs medical care.
Story first published: Wednesday, December 23, 2015, 16:33 [IST]
Desktop Bottom Promotion