For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ముఖంలో దాగి ఉండే 10 ఆరోగ్య సమస్యలు

By Super
|

మీ ముఖాన్ని చూసి మీ ఆరోగ్య సమస్య ఏమిటో ఖచ్చితంగా చెప్పవచ్చని మీకు తెలుసా? మీరు దిగ్భ్రాంతి చెందారా? ఒక కొత్త అధ్యయనంలో మీ ముఖం శరీరం లోపల ఏమి జరుగుతుందో చాలా చెబుతుందని తెలిసింది. మీ ముఖం మీద చెమట ఎక్కువగా ఉంటే హార్మోన్ల లోపం అని అర్ధము. మీరు రక్తహీనత లేదా తక్కువ రక్తపోటు బాధపడుతూ ఉంటే మీ పెదాలు మరియు కళ్ళ యొక్క రంగు తెలియజేస్తుంది.

అదే విధంగా, మీ ముఖం మీద చూడటానికి ఇతర ఆరోగ్య సమస్యలు చాలా ఉన్నాయి..మీ ముఖం డల్ గా ఉండి ఫ్లాకీ చర్మం లేదా ఉబ్బిన కళ్ళు ఉంటే ఏదో విషయం ఉందని వైద్యుడు సందర్శించాలని నిర్ధారించుకోండి. మరోవైపు, ఈ ఆరోగ్య సమస్యలు అంతర సంబంధమైనవి మరియు చాలా భిన్నమైన అర్థాన్ని కలిగి ఉంటాయి.

అయితే,మీ ముఖం ఏమి చెప్పుతుందో తెలుసుకోవాలంటే ఈ రోజు ఈ సంకేతాలను గమనించవచ్చు:

ముఖం మీద జుట్టు

ముఖం మీద జుట్టు

కొంత మంది మహిళలకు ముఖం మీద జుట్టు ఉండటం వలన ఇబ్బందిగా ఉంటుంది. ఇది పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్ యొక్క చిహ్నం. చాలా మంది యువ మహిళలు ఈ స్థితితో బాధపడుతున్నారు. దీని వలన వంధ్యత్వం, పీరియడ్స్ అస్తవ్యస్థంగా లేదా రాకపోవటం జరుగుతుంది.

చెప్పలేని ముడతలు

చెప్పలేని ముడతలు

ఈ ముడుతలు అనేవి ముఖ్యంగా మహిళల్లో బోలు ఎముకల వ్యాధికి ఒక సంకేతం అని తెలుసా.అకాల ముడుతలు అనేవి విటమిన్ డి లోపానికి సంకేతం కావచ్చు. మీ ముఖం మీ ఆరోగ్యం గురించి చెప్పే విషయాలలో ఇది ఒకటి.

పలిగిన పెదవులు

పలిగిన పెదవులు

మీ పెదవులు పగిలితే మీ శరీరానికి నీరు తక్కువ అయిందని అర్ధం. అంతేకాక అది థైరాయిడ్ పనిచేయకపోవడం మరియు ఒక డ్రగ్ అలెర్జీ అని కూడా అర్ధము. మరోవైపు, పగిలిన పొడి పెదవులు, పొడి నోరు మరియు కీళ్ళ నొప్పి తో పాటు పొడి చర్మం కూడా కలిసి ఉంటే కాలేయ సమస్య అని అర్ధం.

చెమట ముఖం

చెమట ముఖం

చెమట పట్టటం అనేది సాదారణం. కానీ చెమట ఎక్కువగా పట్టటం అనేది పెద్ద వయస్సు మహిళల్లో హార్మోన్ల లోపాలు లేదా మెనోపాజ్ వంటి వాటిని సూచిస్తుంది. మీ ముఖం మీద చెమట ఎక్కువగా పడుతూ ఉంటే, అది ఒక వైద్యుడుని సందర్శించే సమయం అని గుర్తుంచుకోవాలి.

పాలిపోయిన చర్మం

పాలిపోయిన చర్మం

మీ చర్మం పాలిపోతే మీకు ఒత్తిడి ఎక్కువగా ఉందని అర్ధం. ఈ ఆరోగ్య సమస్యలతో పాటు ఇతర చిహ్నాలుగా మైకము,అతిసారం,మసక బారిన దృష్టి,వికారం,అలసటతో కూడిన నిరాశ ఉంటుంది.

మీ పెదవులు యొక్క రంగు

మీ పెదవులు యొక్క రంగు

మీ పెదవులు లేదా కనురెప్పలు రంగు మారటం ప్రారంభం అయితే,అది మీ ముఖం మీ ఆరోగ్యం గురించి చెప్పే ఒక విషయం. పెదవుల రంగు యొక్క మార్పు మీ రక్తహీనతను సూచిస్తుంది.

ముక్కు &కళ్ళ కింద రాష్

ముక్కు &కళ్ళ కింద రాష్

ముక్కు లేదా కళ్ళ కింద రాష్ అనేది లూపస్ కి ఒక సంకేతం కావచ్చు. మీ రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. అలాగే మీ కీళ్ళు,చర్మం,మూత్రపిండాలు,గుండె,ఊపిరితిత్తులు మరియు మెదడు నష్టంనకు కారణమయ్యే ఒక ఆరోగ్య సమస్యను సూచిస్తుంది.

పొడి చర్మం

పొడి చర్మం

పొడి చర్మం ఒక ఆరోగ్య సమస్యకు మరొక సూచనగా ఉంది. తేమ లేకపోతే మీరు మధుమేహం మరియు థైరాయిడ్ పరీక్ష చేయించుకొనే సమయం అని అర్ధం. పొడి చర్మం అనేది మీ ముఖం మీద ఉన్న ఆరోగ్య ఇబ్బందులను తెలియజేస్తుంది.

మెడ పిగ్మెంటేషన్

మెడ పిగ్మెంటేషన్

చాలామంది మహిళలకు మెడ పిగ్మెంటేషన్ సమస్య ఉంటుంది. మెడ చర్మం రంగు మారడం అనేది హార్మోన్ల అసమతుల్యత అని అర్ధము. మీరు థైరాయిడ్ మరియు PCOS పరీక్షలను చేయించుకోవటం ఉత్తమం.

ఉబ్బిన ముఖం

ఉబ్బిన ముఖం

ఉబ్బిన ముఖం నిద్ర లేకపోవటాన్ని సూచిస్తుంది. అలాగే గుండె మూత్రపిండాలకు సరిగ్గా రక్తం సరఫరా కాకపోవటం వలన సమస్యలు వస్తాయని సూచిస్తుంది.

English summary

Ten Health Problems Hidden On Your Face: Health Tips in Telugu

Did you know that your face can tell you exactly what is wrong with your health? Shocking right? A new study shows that your face tells a lot about what is happening inside the body.
Desktop Bottom Promotion