For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి దుర్వాసనకు మనం ఊహించని కొన్ని ముఖ్య కారణాలు

|

నోటి దుర్వాసన అనేది ఎదుటి వారిని ఇబ్బంది పెట్టేటువంటి చాలా బాధాకరమైన విషయం. ఈ సమస్య వల్ల మీరు నలుగురితో సంతోషం గడపలేరు? మరియు నలుగురిలో హాపీగా నవ్వలేరు? అంతే కాదు మీతో ఉండే వారు మీ మీద జోకులేయడం కూడా మొదలు పెట్టేయవచ్చు.

మనం ఎప్పుడూ నోటిదుర్వాసనకు కారణం నాలుమీద ఫలకం(పాచీ), కావిటీస్ మరియు పంటి గాయం వంటివే నోటి దుర్వాసనకు కారణం అని ఆలోచిస్తుంటాం. అయితే నోటి దుర్వాసనకు కొన్ని ఊహించని మరియు మనకు తెలియని కొన్ని కారణాలున్నాయి. మీరు నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతూ..వివిధరకాల చిట్కాలతో పోరాడుతూ మరియు అది వదిలించుకోవలేకపోతున్నారు . అటువంటప్పుడు నోటి దుర్వాసనకు మరేదైన మీకు తెలియని వింత కారణాలున్నాయామో తెలుసుకోవాలి.

READ MORE:నోటి దుర్వాసనను దూరం చేసే 7 అద్భుత చిట్కాలు...

నోటి దుర్వాసనకు వెనుక అనేక కారణాలుండొచ్చు. దంతాలు సరిగా శుభ్రం చేసుకోకపోవడమే కాదు.. చిగుళ్ల వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, హార్మోన్లలో తేడాలు.. ఇలా రకరకాల కారణాలుండొచ్చు. కాబట్టి నోటి దుర్వాసన సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా మూలకారణాన్ని తెలుసుకుని పరిష్కరించుకోవాలంటున్నారు నిపుణులు. మరి కారణాలేంటో తెలుసుకుందాం...

చిగుళ్ల సమస్యలు

చిగుళ్ల సమస్యలు

చిగుళ్ల వాపు, ఎర్రగా మారడం, నొప్పి, నోటిలో నుంచి రక్తం పడటం, నాలుక రుచి కోల్పోవడం వంటి లక్షణాలతో పాటు నోటి దుర్వాసన కూడా ఉంటుంది. మొదట్లో ఎటువంటి నొప్పి ఉండదు. కాబట్టి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కాని చిగుళ్ల వ్యాధి ముదిరిన కొద్దీ దంతాలు కదిలిపోవడం, పళ్ల మధ్య ఖాళీలు రావడం, చిగుళ్లు కిందికి జారిపోయి నొప్పి, పళ్లు జివ్వుమనడం వంటి సమస్యలు బాధిస్తాయి. మధుమేహం, గుండెజబ్బులు, కిడ్నీ సమస్యల ముప్పులకూ చిగుళ్ల వ్యాధి దోహదం చేస్తుంది. కాబట్టి చిగుళ్ల వాపు సమయంలోనే జాగ్రత్త పడాలి.

కిడ్నీజబ్బులు

కిడ్నీజబ్బులు

నోటి దుర్వాసన వెనుక కిడ్నీ సమస్యలు ఉండే అవకాశం ఉంది. రుచి తగ్గిపోతుంది. దీర్ఘకాల కిడ్నీ జబ్బులను తగ్గించడంలో నోటి శుభ్రత కూడా కీలకమైనదని అధ్యయనాలు చెబుతున్నాయి. దంతాలు ఆరోగ్యంగా ఉన్నవారితో పోలిస్తే పళ్లు ఊడిపోయినవారిలో కిడ్నీల సమస్యల అవకాశం ఎక్కువ ఉన్నట్టు అధ్యయనాల్లో తేలింది.

హార్మోన్లు

హార్మోన్లు

ఆడపిల్లలకు నెలసరి సమయంలో స్త్రీ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల చిగుళ్లు ఎర్రబడడం, వాపు, బ్రష్‌తో పళ్లు తోముకునేటప్పుడు రక్తం రావడం వంటివి కనిపిస్తాయి. గర్భధారణ సమయంలో కూడా హార్మోన్ ఎక్కువగా విడుదల కావడం వల్ల చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశం ఉంది. తద్వారా నోటి దుర్వాసన రావచ్చు.

జీర్ణ సమస్యలు

జీర్ణ సమస్యలు

నోట్లోని బాక్టీరియా కొన్నిసార్లు జీర్ణాశయంలోకి చేరుకుని సమస్యలు తేవచ్చు. వీటివల్ల నోటి దుర్వాసన వస్తుంది.

ఆహారంలో రకాలు

ఆహారంలో రకాలు

మనం తినే ఆహారంలోని కొన్ని రకాల పదార్థాలు కొన్ని రకాల బాక్టీరియాను వృద్ధి చేస్తాయి. ఈ బాక్టీరియా విడుదల చేసే సల్ఫర్ సంబంధిత పదార్థాలు నోటి దుర్వాసనకు దారితీస్తాయి. కాఫీలోని ఆమ్లాలు నోటి కణజాలంలోకి ఆక్సిజన్ వెళ్లకుండా అడ్డుకుని బాక్టీరియా పెరిగేలా చేస్తాయి. చక్కెరతో కూడిన చూయింగ్‌గమ్ వంటి వాటితో కూడా బాక్టీరియా పెరుగుతుంది. మసాలాలు, వెల్లుల్లి, ఉల్లి లాంటివి తిన్నప్పుడు వాటిలోని సల్ఫర్ పదార్థాలు రక్తంలో కలుస్తాయి. వీటిని ఊపిరితిత్తులు శ్వాస ద్వారా బయటకు పంపిస్తాయి. ఇది నోటి దుర్వాసనకు దారితీస్తుంది.

బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడం(బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం):

బ్రేక్ ఫాస్ట్ ను దాటవేయడం(బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం):

ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనేది మీ కడుపుకు లేదా మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు మీ నోటి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఉదయం తీసుకొనే బ్రేక్ ఫాస్ట్ వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి పెంచడానికి సహాయపడుతుంది. మరియు నోటి దుర్వాసనకు కారణం అయ్యే మీ నాలుక మీద ఉండే బ్యాక్టీరియాను క్లియర్ చేస్తుంది.

లివర్ ప్రాబ్లమ్స్(కాలేయ సమస్యలు):

లివర్ ప్రాబ్లమ్స్(కాలేయ సమస్యలు):

కాలేయానికి సంబంధించిన ఫ్యాటీ లివర్ లేదా కామెర్లు వంటి కాలేయ సమస్యలు కూడా మీ నోటి దుర్వాసనకు కారణం కావచ్చు. క్రొవ్వు జీవక్రియల బాధత్య కాలేయానిదే. ఎప్పడైతే ఈ బాద్యత కాలేయ వహించదో అప్పడు నోటిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దాంతో నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.

మౌత్ అల్సర్(నోటి పూత):

మౌత్ అల్సర్(నోటి పూత):

నోటిపూత వల్ల పళ్ళు పుచ్చిపోవడం, మరియు నోట్లో గాయాలేర్పడటం జరుగుతుంది . నోటి అల్సర్ వల్ల గాయాలేర్పడ్డ ప్రదేశం నుండి రక్తం లేదా చీము రావడం జరగవచ్చు. ఇలా తరుచూ బాధిస్తుంటే కనుక ఇది నోటి దుర్వాసనకు దారితీస్తుంది.

థ్రోట్ ఇన్ఫెక్షన్(గొంతు నొప్పి) :

థ్రోట్ ఇన్ఫెక్షన్(గొంతు నొప్పి) :

ఎప్పుడైతో గొంతు నొప్పి, జులబు వంటి సమస్యలతో బాధపడుతుంటారో అప్పుడు కొన్నిబ్యాక్టీరియాలు శ్వాసవాహిక యొక్క కణాలను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో మ్యూకస్ ఫ్యూయల్ స్మెల్ వస్తుంది.

మద్యపానం సేవించటం:

మద్యపానం సేవించటం:

అధికంగా మద్యపానం సేవించడం వల్ల సేలవెరీ గ్లాండ్స్ పొడిబారడం జరుగుతుంది. ఈ గ్రంధులు నోటి దుర్వాసనకు కారణం అయ్యే నోటిలోని బ్యాక్టీరియాను శుభ్రపరచడానికి క్లియర్ చేయడానికి సహాయపడుతాయి. కాబట్టి తగినంత సలివ గ్రంథులు లోపిస్తే తప్పకుండా నోటి దుర్వాసన పాలు కావాల్సి ఉంటుంది.

నిద్రభంగిమ:

నిద్రభంగిమ:

నిద్రపోయేటప్పుడు బోర్లా పడుకోవడం వల్ల వారు ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవడం కష్టం అవుతుంది. అటువంటి సమయంలో ఎక్కువగా నోటి ద్వారా శ్వాస పీల్చుకోవడం జరుగుతుంది. అందువల్ల నోటిలో లాలాజలం లేకుండా ఎండిపోవడం వల్ల నోటి దుర్వసనకు కారణం అవుతుంది.

మందులు:

మందులు:

కొన్ని మందులు నోటిని పొడిబారిలే చేస్తాయి. అంటే నోట్లో తేమ లేకుండా చేస్తాయి. పెయిన్ కిల్లర్స్, యాంటీడిప్రెజెంట్స్ మరియు మూత్రస్రావం కూడా మీ నోరు పొడిబారేలా చేస్తుంది. నోట్లో లాలాజలం లేకపోవడంతో నోటి దుర్వాసన పెరగుతుంది.

పరిష్కారం?

పరిష్కారం?

నోటి దుర్వాసన రాకుండా రోజూ ఉదయం, రాత్రి శుభ్రంగా దంతాలు శుభ్రం చేసుకోవాలి. దంతాల మధ్య పేరుకునే పాచిని ఫ్లాసింగ్ వంటి విధానాల ద్వారా ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ఆరునెలలకు ఒకసారి దంతవైద్యులను సంప్రదించి స్కేలింగ్ చేయించుకోవాలి. చిగుళ్ల వ్యాధికి ఈ గార ప్రధాన కారణం. ఆహారంలో పాల పదార్థాలు, విటమిన్ సి ఉండేలా చూసుకోవాలి. స్వీట్లు, టీ, కాఫీ, కూల్‌డ్రింకులు పరిమితంగా తీసుకోవాలి.

English summary

Thirteen Unexpected Causes Of Bad Breath

However, bad breath has many causes that are surprising and hidden. If you are battling with mouth odour and you are unable to get rid of of it inspite of trying everything, then you should consider thinking for some strange causes of bad breath.
Story first published: Thursday, July 30, 2015, 18:03 [IST]
Desktop Bottom Promotion