For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో అనేక వ్యాధులను..ఇన్ఫెక్షన్స్ ను తగ్గించే యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్స్..!

|

మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలు సరైనవా కాదా అన్న విషయం తెలుసుకోవాలి. అవి ఆరోగ్యానికి ఏవిధంగా సహాపడుతున్నాయి అని కూడా తెలసుకోవడం చాలా అవసరం. అనారోగ్యకరమైన ఆహారాలు ఎంత తిన్నా ప్రయోజనం ఉండదు. అదే పోషకాలున్న మంచి ఆహారాన్ని కొద్దిగా తీసుకొన్నా ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి. మనం రెగ్యులర్ గా తీసుకొనే వివిధ రకాల ఆహారాల్లో ప్రత్యేకంగా కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ కూడా ఉన్నాయి. వీటిని మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాలే అయినా, ఇవి యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు.

మీ ఆరోగ్యానికి భరోసా.. ఈ టాప్ టెన్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆహారాలు...!

యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ను మనం రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మన శరీరంలోని అనేక అనారోగ్య సమస్యలను నివారిస్తాయి. ఎందుకని అలా అని మీకు సందేహం కలగవచ్చు? మన శరీరం ఏదైనా ఇన్ఫెక్షన్స్ కు గురైనప్పుడు, అవి వెంటనే తగ్గకపోతే అది క్రమంగా మంటకు దారితీస్తుంది. ఇన్ఫెక్షన్స్ తో పాటు, మంట, దురద లక్షణాలు ఎక్కువైనప్పుడు, వ్యాధిలక్షణాలతో పోరాడే శక్తిసామర్థ్యాలను శరీరం కోల్పోవడం జరగుతుంది. అలాంటి సమయంలో మీరు తీసుకొనే ప్రొసెస్డ్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్, ఫేక్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ తో పాటు ఇన్ఫ్లమేషన్ కూడా పెరుగుతుంది.

ఇన్ఫ్లమేషన్ కు చక్కటి పరిష్కారం : హెల్తీ ఫుడ్స్

అందువల్ల ఏలాంటి వ్యాధులు మరియు వ్యాధి లక్షణాల మన శరీరాన్ని తాకకుండా ఉండాలంటే యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. ఇవి మన శరీరం యొక్క సామర్థ్యాన్ని పెంచుతాయి. వ్యాధులతో పోరాడి, వ్యాధుల నివారిస్తాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాంటి యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మీకోసం కొన్ని...

యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తో ఆరోగ్యానికి భరోసా..!

1. పైనాపిల్:

1. పైనాపిల్:

వివిధ రకాల యాంటీఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్లో చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . అలాంటి ఆహారాల్లో పైనాపిల్ ఒకటి. పైనాపిల్లో డైజెస్టివ్ బ్రొమైలిన్ ఎంజైమ్స్ పుష్కలంగా ఉన్నాయి. తిన్న ఆహారంను జీర్ణింపచేయడం మాత్రమే కాదు ఇది ఇన్ఫ్లమేషన్ మరియు వాపులను కూడా తగ్గిస్తుంది. ఏదైనా గాయాలు వల్ల వాపులు మంటలున్నప్పుడు పైనాపిల్ తీసుకోవడం వల్ల త్వరగా కోలుకుంటారు .

2. బొప్పాయి:

2. బొప్పాయి:

బొప్పాయి కూడా వివిధ రకాల డైజెస్టివ్ ఎంజైమ్స్ ను సప్లై చేస్తుంది . బొప్పాయిలో పెపైన్ అనే ఎంజ్ పుష్కలంగా ఉంటుంది. పైనాపిల్ లో ఉన్న యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలన్నీ బొప్పాయిలో కూడా ఉన్నాయి. పైనాపిల్ వలే బొప్పాయి కూడా అదే ప్రయోజనాలను అంతే మొత్తంలో శరీరానికి అందిస్తాయి. అయితే ఈ రెండింటిలో ఏది బెటర్ అనిపిస్తే మీకు ఇష్టమైనది ఎంపిక చేసుకోవచ్చు. లేదా అల్టర్ నేట్ గా మార్చిమార్చి కూడా తీసుకోవచ్చు.

3. వెల్లుల్లి:

3. వెల్లుల్లి:

ఘాటైన వాసన కలిగిన వెల్లుల్లిలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ బెనిఫిట్స్ ను అందిస్తుంది . ప్రయోజనాలు అనేకం, అంతే కాదు పచ్చిఉల్లిపాయలను తినడం వల్ల ప్రయోజనాలు మరింత ఎఫెక్టివ్ గా ఉంటాయి. వీటిని పచ్చిగా తినడం వల్ల నోరు వాసనొస్తుందనుకుంటారు. కానీ ప్రయోజనాలు మెండుగా ఉండటం వల్ల తినక తప్పదు . ఇంకా రోస్ట్ చేసి తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ ను తగ్గించుకోవచ్చు.

4. ఆనియన్:

4. ఆనియన్:

యాంటీఆక్సిడెంట్స్ ఫుడ్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవచ్చు . ముఖ్యంగా ఫ్లెవనాయిడ్స్ మరియు క్యూరియాసిటిన్ వంటివి మరిన్ని ప్రయోజనాలను అందిస్తాయి. ఉల్లిపాయల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి . అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఉల్లిపాయలు కూడా అద్భుతంగా సహాయపడుతాయన్నమాట . కాబట్టి, సూపులు, ఫ్రైలు, సలాడ్స్ మరియు సాండ్విచ్ లకు ఉల్లిపాయలు జోడించి తీసుకోవచ్చు.

5. కేయాన్ పెప్పర్:

5. కేయాన్ పెప్పర్:

ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణాలు కేయాన్ పెప్పర్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా క్యాప్సికమ్ లో ఎక్కువగా మరియు స్ట్రాంగ్ గా ఇన్ఫ్లమేషన్ గుణాలు ఉండటం వల్ల స్పైసీగా మార్చుతుంది . ఈ పవర్ ఫుల్ టేస్ట్ కూడా పవర్ ఫుల్ గా గాయాలను మాన్పుతుంది. నయం చేసే గుణాలు అధికం. ఈ స్పైసీస్ ను రెగ్యులర్ డైట్లో ఏదోఒకవిధంగా చేర్చుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

6. స్వీట్ పొటాటో:

6. స్వీట్ పొటాటో:

ఆరెంజ్ కలర్ రూట్ వెజిటేబుల్ స్వీట్ పొటాటో . ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. స్వీట్ పొటాటోలో బీటా కెరోటీన్ అధికంగా ఉంటుంది . ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆరెంజ్ పిగ్మెంట్ ను ఇస్తుంది. శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయన్న విషయం ఇదివరికటి పాయింట్స్ లో తెలుసుకోవడం జరిగింది. స్వీట్ పొటాటలో విటమిన్స్, మినిరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉండి వ్యాధుల భారీన పడకుండా శరీరానికి రక్షణ కల్పిస్తాయి.

7. ఆకుకూరలు:

7. ఆకుకూరలు:

ఫ్లెవనాయిడ్స్ నే స్ట్రాంగర్ యాంటీఆక్సిడెంట్స్ గా చెప్పుకుంటారు . ఇవి యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి . ఆకుకూరల్లో అలాంటి ప్రయోజనాలను అందించే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మరింత పవర్ ఫుల్ గా మార్చుతాయి . గ్రీన్ లీఫ్స్ తో ఫ్రెష్ సలాడ్స్ ను తయారుచేసుకొని రెగ్యులర్ గా తినవచ్చు.

8. బ్లూ బెర్రీస్:

8. బ్లూ బెర్రీస్:

బ్లూ బెర్రీస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధిక మొత్తంలో ఉంటాయి . ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి మరియు ఆకుకూరలు, బ్లూబెర్రీస్ లో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉండే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి . అందుకే తరచూ బ్లూబెర్రీస్ ను స్కిన్ కేర్ ప్రొడకట్స్ లో ఉపయోగిస్తుంటారు. ఇవి కళ్ల ఉబ్బు మరియు ఇన్ఫ్లమేటెడ్ స్కిన్ ను నివారిస్తాయి . బ్లూబెర్రీస్ తినడం వల్ల వ్యాధుల బారీ నుండి ఉపశమనం పొందవచ్చు.

9. ఫ్లాక్ సీడ్స్:

9. ఫ్లాక్ సీడ్స్:

ఓమేగా ఫ్యాటీ3యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయని నిరూపించబడ్డాయి. ఫ్లాక్స్ సీడ్స్ లో ఓమేగా ఫ్యాటీ 3యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి అందుకే ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

10. అల్లం:

10. అల్లం:

అల్లానికీ ఎన్నో వైద్యప్రయోజనాలున్నాయి. వాటిలో ఒకటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం. ఒక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం మాత్రమే కాకుండా దీనికి రక్తంలో చక్కెరను తగ్గించే గుణం కూడా ఉంది.

English summary

TOP 10 Anti-inflammatory Foods That Will Help Heal and Prevent Disease in Your Body !

Consuming anti-inflammatory foods regularly will help prevent diseases in your body. Why is that, you may ask? Well, when your body responds to some kind of infection or stimulant, it creates an inflammatory response.
Story first published: Wednesday, December 9, 2015, 16:55 [IST]
Desktop Bottom Promotion