Latest Updates
-
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.! -
గురు పుష్య అమృత యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకం మారుతుందా? -
చెఫ్ రణ్వీర్ స్పెషల్ ధన్ సాక్ మసాలా.. మీ వంటల రుచిని రెట్టింపు, ఆరోగ్యానికి మేలు! -
ఎముకలను ఉక్కుగా మార్చే రాగులతో రవ్వ దోశ.. ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని కలిపితే తిరుగే ఉండదు.!
స్త్రీలు తమ వెన్నును ధృడపరచుకోవడానికి చేయగలిగే 10 వ్యాయామాలు !!
ప్రపంచంలో ఎంతో మంది ఎదుర్కొనే అతి తీవ్రమైన సమస్యల్లో ఒకటి వెన్ను వెప్పి అని అధ్యయనాల్లో తేలింది. ఇది ఎక్కువగా స్త్రీలను బాధిస్తుంది – వారు ఎంతో నెప్పి, అసౌకర్యంతో ఇబ్బంది పడుతుంటారు.
సరైన భంగిమలో కూర్చోకపోవడం, వ్యాయామం లేకపోవడం దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు. ఒక అరగంట పాటు ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల దైనందిన జీవితంలో బాధ పెడుతూ వుండే నెప్పిని తగ్గించడంలో చాలా సహాయకారి అవుతుంది
చాలా సందర్భాల్లో ఇది ఏదైనా ఉపద్రవం ఫలితం అయి ఉండవచ్చు. వయసు మళ్లే కొద్దీ బలహీనపడే కండరాలు, శిశు జననం లాంటి కారణాల వల్ల స్త్రీలు ఎక్కువగా వెన్ను నెప్పి బారిన పడుతుంటారు.
ఒకే భంగిమలో చాలా సేపు కూర్చుని వుండడం వల్ల కండరాలు బలహీన పడతాయి, దాని వల్ల శరీరానికి సౌలభ్యం తగ్గి వెన్ను నెప్పికి దారి తీస్తుంది.
వెన్నును ధృడ పరచేవి, కండరాలకు బలాన్ని, స్థిరత్వాన్ని ఇచ్చే కొన్ని వ్యాయామాలు చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. నిరోధించడమే కీలకమైన విషయం.
కాబట్టి, స్త్రీల వెన్ను బలపరిచే పడి సులభమైన వ్యాయామాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి. వీటిని ఒకసారి పరిశీలించి ఈ వ్యాయామాలను మీ దైనందిన వ్యాయామాలలో కలుపుకోండి.

పిల్లిలా సాగడం
పిల్లి లాగా నాలుగు కాళ్ళ మీదకు రండి. వెన్ను బల్ల లాగా, కాళ్ళు, చేతులు ఆ బల్లకు నాలుగు కాళ్ళలా వుండాలి. అరచేతులు భులాల క్రింది నుంచి నేరుగా నేలమీద ఆన్చాలి. మోకాళ్లను నడుము అంత వెడల్పున దూరం వుంచ్యండి. వెన్నును వీలైనంత పైకి లేపి, దాన్ని క్రిందికి తెండి. ఇలా మార్చి మార్చి చేయండి. ప్రతి భంగిమలోను 15 క్షణాల పాటు వుండండి. బల్ల పరుపు భంగిమ కు వచ్చి విశ్రాంతి తీసుకోండి. దీని వల్ల భుజాలు, వెన్ను బలపడతాయి.

చేతులను చాచడం.
నాలుగు కాళ్ళ మీద నేల మీద నిలబడి వుండగా, ఒక కాలు, అవతలి చేయి సాగదీయాలి. ఇవి రెండూ భూమికి సమాంతరంగా వుండాలి. ఇలా 10 క్షణాల పాటు వుండి, పూర్వపు భంగిమకు రండి. ఇప్పుడు మరో జత కాలు చేయి తో ప్రయత్నించండి.

మెలిక
ఎక్సర్సైజ్ మాట్ మీద వెల్లకిలా పడుకోండి. కుడి కాలును లంబ కోణంలో ముడవండి. తల, భుజాలను నేల మీద నుంచి పైకి లేపి 5 క్షణాల పాటు అలా వుండండి. తల, భుజం అలా ఎత్తిన స్థితిలోనే వుండగా కుడి కాలు ను నిటారుగా వుంచ౦డి. ఇప్పుడు మరో కాలుతో కూడా ఇలాగే ప్రయత్నించండి. మరో 5 క్షణాలు అలా వుండండి. పూర్వ స్థితికి రండి. ఇలా అయిదు సార్లు చేయవచ్చు.

‘T’ లాగా సాగడం
ఎక్సర్సైజ్ మాట్ మీద బోర్లా పడుకొని చేతులను గద్ద లాగా అటూ ఇటూ చాచండి – T ఆకారం వచ్చేలా. పాదాలు నేలను తాకుతూ వుండాలి. చేతుల వేళ్ళు కుడి వైపు కుడికి, ఎడమ వైపు ఎడమకు చూపేలా చూసుకోండి. చేతులను వీలైనంత ఎత్తుకు లేపండి. ఇలా కొద్ది క్షణాల పాటు వుండి పూర్వ స్థితికి రండి. సరళంగా, ప్రభావ వంతంగా వుండే వ్యాయామం ఇది.

ఎగిరే భంగిమ
ఒక చేయి నేల మీద వుంచి అది మీ బరువును మోసేలా ఒక పక్కకి పడుకోండి. మిమ్మల్ని మీరు పైకి లేపుకునే ప్రయత్నం చేయండి – అలా కొద్ది క్షణాలు వుంచండి. తిరిగి మరో చేత్తో అలానే ప్రయత్నించండి.

కుర్చీ భంగిమ
కుర్చీలో నిటారుగా కూర్చోండి. తొడలు, మోకాళ్ళు నెలకు 90 డిగ్రీల కోణంలో వుండాలి. మీరు గాలి పీల్చేటప్పుడు చేతులు తల పైకి ఎత్తండి. గాలి వదులుతూ ముందుకు వంగండి – అలా చేసినంత సేపూ కుర్చీలో నిటారుగా కూర్చునే వుండండి. నడుము నుంచి ముందుకు వంగి శరీరం పై భాగం తొడల మీద వుంచండి. చేతులు క్రిందికి వదిలి అలా పది క్షణాల పాటు వుండండి. ఇది క్రింది నడుమును ధృడపరచడానికి మంచి వ్యాయామం.

కూర్చొని సాగడం
వీపు గోడకు ఆన్చి కూర్చోండి. మోకాళ్ళు వంచకుండా కూర్చొని చేతులు ముందుకు చాచండి. అలా అయిదు క్షణాల పాటు వుండి తిరిగి నిలబడ్డ స్థితికి రండి. దీన్ని కనీసం 10 సార్లు రిపీట్ చేయండి.

మెలిక వేసి తిప్పడం
మీ కుర్చీ నుంచి లేచి నిలబడండి, సాగదీస్తూ నడుమును వెనక్కు అటూ ఇటూ వీలైనంత వరకు తిప్పండి. ఇది ఎక్కడైనా చేయగలిగే సరళమైన వ్యాయామం. ఇదే పద్ధతిని రెండు వైపులా చేయండి.

చేతులు క్రాస్ గా వేయండి
మీ చేతిని ఒకదానిని ముందుకు సాగదీయండి. రెండో దానితో సాగదీసిన చేతి యొక్క మోచేతిని లాగండి, దాన్ని గుండెకు దగ్గరగా తీసుకు రండి. అదే సమయంలో భుజాలు, పై వీపు భాగం సాగదీయండి. ఇలా కొద్ది క్షణాలు వుండి వదలివేయండి. ఇది మరో చేత్తో కూడా చేయండి.

ముందుకు సాగడం
కాళ్ళ మధ్య పన్నెండు అంగుళాల దూరం ఉండేలా కూర్చొని పాదాలు బయటకు సాగదీయండి. చేతులను ముందుకు సాగదీస్తూ ఎడమ పాదాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. ఇలా ఒక 15 క్షణాల పాటు వుండి, అప్పుడు కూర్చొని వున్న స్థితికి రండి. ఇలా కుడి వైపు పాదాన్ని తాకే ప్రయత్నం చేస్తూ రిపీట్ చేయండి, అలా వుండి కూర్చొన్న స్థితికి రండి. ఇలా ప్రతిసారీ 2 లేదా 3 సార్లు రిపీట్ చేయండి.



Click it and Unblock the Notifications