For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిన్నర్ లో తీసుకోవాల్సిన తేలికగా జీర్ణమయ్యే ఆహారాలు

By Swathi
|

రాత్రిపూట ఎంత లైట్ గా ఆహారం తీసుకుంటే.. అంత తేలికగా జీర్ణమవుతుందని చాలా మంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే.. జీర్ణమవడానికి ఎక్కువ సమయం పట్టే ఆహారాలు తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిస్టమ్ పై తీవ్ర ఒత్తిడి పడుతుంది. అది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

జంక్ ఫుడ్, భోజనం మిస్ చేయడం, టైమ్ కి తినకపోవడం వంటి అలవాట్లన్నీ.. పొట్టలో కొత్త సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి హెల్తీ ఫుడ్ ని డిన్నర్ లో చేర్చుకోవడం వల్ల.. పొట్ట నొప్పి, గ్యాస్, కాన్స్టిపేషన్, బ్లోటింగ్ వంటి సమస్యలకు దూరంగా ఉండటమే కాకుండా.. తేలికగా జీర్ణమవుతాయి.

రాత్రిపూట నిద్రకు భంగం కలిగించే చెమటకు చెక్ పెట్టే రెమిడీస్రాత్రిపూట నిద్రకు భంగం కలిగించే చెమటకు చెక్ పెట్టే రెమిడీస్

డిన్నర్ కి అంటే రాత్రిపూట భోజనంలో ఈ కింద సూచించిన ఆహారాలు తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే రాత్రి నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందైనా.. తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు జీర్ణమవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి. ఇంతకీ డిన్నర్ లో చేర్చుకోవాల్సిన హెల్తీ ఫుడ్ ఏంటో చూద్దామా..

బీట్ రూట్

బీట్ రూట్

డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ నివారించడానికి చక్కటి పరిష్కారం బీట్ రూట్. అలాగే స్టమక్ అప్ సెట్ నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇందులో పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఉండటం వల్ల తేలికగా జీర్ణమవుతుంది.

పెరుగు

పెరుగు

పెరుగు లేదా యోగర్ట్ లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఏసిడోఫిలస్ అనే బ్యాక్టీరియా జీర్న ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. కాబట్టి డిన్నర్ లో పెరుగు చేర్చుకోవడం మంచిది.

అవకాడో

అవకాడో

అవకాడో ఫ్రూట్ లో ఫైబర్, మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు చాలా మంచిది. వీటిని తినడం వల్ల డైజెస్టివ్ ట్రాక్, గాల్ బ్లాడర్ హెల్తీగా ఉంటాయి. కాబట్టి చట్నీ లేదా సలాడ్ రూపంలో వీటిని డిన్నర్ లో చేర్చుకోవాలి.

టమోటా

టమోటా

టమోటాలు జీర్ణమవడానికి సహాయపడతాయి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, లైకోపిన్ ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.

క్యారట్స్

క్యారట్స్

క్యారట్స్ కంటి చూపుకి మంచివి. అలాగే.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. జీర్ణక్రియకు సహాయపడతాయి. కాబట్టి రాత్రిపూట భోజనంలో క్యారట్, రోటీ తీసుకుంటే.. మంచి ఫలితాలు పొందవచ్చు.

సాల్మన్

సాల్మన్

సాల్మన్ ఆరోగ్యానికే కాదు.. డైజెస్టివ్ హెల్త్ కి కూడా మంచిది. సాల్మన్ లో ఉండే ప్రొటీన్స్ తేలికగా జీర్ణమవడానికి సహాయపడతాయి.

బీన్స్

బీన్స్

జీర్ణవ్యవస్థ హెల్తీగా ఉండటానికి బీన్స్ బాగా ఉపయోగపడతాయి. కాబట్టి డ్రైడ్ బీన్స్ ని పప్పులో ఉపయోగించి.. డిన్నర్ కి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన ఫైబర్ అందుతుంది.

దోసకాయ

దోసకాయ

దోసకాయలో జీర్ణక్రియకు సహాయపడే పోషకాలుంటాయి. ఇందులో డైటరీ ఫైబర్, విటమిన్ సి, క్యాల్షియం, దోసకాయ ఉండటం వల్ల.. పొట్టలోని సమస్యలు దరిచేరవు.

అల్లం

అల్లం

అల్లంను డైజెస్టివ్ హెల్తీ ఫుడ్ గా పరిగణిస్తారు. ఆహారం తేలికగా జీర్ణమవడానికి అల్లం సహాయపడుతుంది.

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్

బ్రౌన్ రైస్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి.. దీన్ని రాత్రి భోజనంలో తీసుకోవడం వల్ల.. జీర్ణమవడం మరింత సులువవుతుంది. బోవెల్ మూమెంట్స్ లో సమస్యలున్న వాళ్లు బ్రౌన్ రైస్ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

Desktop Bottom Promotion