For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హార్ట్ పేషంట్స్ తమ డైట్ లో చేర్చుకోగలిగిన స్పైసెస్

By Super
|

ఈ మోడ్రన్ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడితో చాలా మంది హార్ట్ డిసీజ్ ల బారినపడుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడితో కూడిన జీవనశైలితో పాటు కొన్ని ఆహారపు అలవాట్లు తాత్కాలికంగా కడుపు నింపి ఆకలిని తగ్గించినా...అలాంటి ఆహారాలు మన శరీరానికి అవసరం అయ్యే న్యూట్రీషియన్స్ అందివ్వవు. అలాగే పోషకలోపంతో శరీరంలో పెరుగుదల ఉండదు.

హెరిడిటి, జెనిటిక్స్, వయస్సు, జెండర్, కుంటుంబ చరిత్ర వంటివి వ్యాధులను కంట్రోల్ చేయలేవు. కానీ, ఇతర ప్రమాదకర పరిస్థితులను ఓబేసిటి, హైబ్లడ్ ప్రెజర్, హైకొలెస్ట్రాల్ వంటివి ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పుల వల్ల మార్చుకోవచ్చు.

ఆరోగ్యకరమైన హార్ట్ కలిగి ఉండటం ఇతరులను ప్రేమించడానికి మాత్రమేకాదు, జీవితం ఆరోగ్యంగా, విజయవంతంగా ముగించడానికి చాలా ముఖ్యం. జబ్బు వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే జబ్బు రాకుండా ముందుగా అరికట్టడం మంచిది.

మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని హోం రెమెడీస్ చక్కగా పనిచేస్తాయి. వీటిని మన రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే మన గుండె సురక్షితంగా ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం...

అజ్వైన్:

అజ్వైన్:

అజ్వైన్ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ తో పాటు , గుండె ఆరోగ్యానికి గొప్పగా ఉపయోగపడుతుంది . దీన్ని రోటీలు, సలాడ్స్, వెజిటేబుల్స్, ధాన్యాలతో తీసుకోవచ్చు.

ఆమ్ చూర్:

ఆమ్ చూర్:

ఇది భారతీయ వంటకాల్లో చాలా ఫేమస్. ఇందులో విటమిన్స్ అధికంగా ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులకు వ్యతిరేఖంగా పనిచేస్తాయి. కాబట్టి సలాడ్స్ , ఇతరకూరల్లో జోడించుకోవచ్చు.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

పురాత కాలం నుంచి దాల్చిన చెక్కను ఉపయోగిస్తున్నాం. చిటికెడు దాల్చిన చెక్క పౌడర్ ను వంటల్లో జోడించడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచుతుంది.

ఫెన్నల్:

ఫెన్నల్:

సోంపు గింజలు రక్తనాళాల్లో మంచి కొలెస్ట్రాల్ మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది . దాంతో గుండె సంబంధిత సమస్యలను నివారించుకోవచ్చు. ఇది ఆహారాలకు సువాసనతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తుంది.

మెంతులు:

మెంతులు:

మెంతుల్లో ఉండే గాలాక్టోమెన్ హార్ట్ కు చాలా మంచిది. ఇందులో ఉండే అధిక శాతం పొటాసియం హార్ట్ రేట్ ను మరియు బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . వీటిని సలాడ్స్ లో చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఇందులో ఉండే సోలబుల్ ఫైబర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది .

అల్లం:

అల్లం:

అల్లంలో ఉండే యాక్టివ్ ఎంజైమ్స్ రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. మరియు బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది . ఫ్రెష్ గా ఉండే అల్లం మంచి వాసన కలిగి ఉంటుంది.

పసుపు:

పసుపు:

రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా పసుపు అడ్డుకుంటుంది . దాంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటివి రాకుండా నివారిస్తాయి . విటమిన్ బి 6 అధికంగా ఉండటం వల్ల హీమోసైటని కంట్రోల్లో ఉంటుంది . ఇది బ్లడ్ వాల్స్ ను డ్యామేజ్ చేస్తుంది . దాంతో పేషంట్ సిహెచ్ డితో బాధపడాల్సి వస్తుంది.

కసూరి మేతి:

కసూరి మేతి:

ఈ ఎండుటాకుల్లో మంచి వాసన దాగి ఉంటుంది. హార్ట్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇందులో ఉండే బిట్టర్ టేస్ట్ వల్ల ఆహారాలకు ఒక మంచి రుచిని అందిస్తుంది.

English summary

10 Healthy Spices That Heart Patients Can Eat

10 Healthy Spices That Heart Patients Can Eat. 10 best spices that heart patients can eat, without getting worried.
Story first published: Thursday, April 21, 2016, 17:16 [IST]
Desktop Bottom Promotion