For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెదడుపై దుష్ర్పభావం చూపే 10 అన్ హెల్తీ హ్యాబిట్స్

By Swathi
|

పెద్దమెదడు అచేతనమవడం అనేది చాలా సాధారణమైన వ్యాధి. ఇది మెదడుకి హానిచేస్తుంది. అంటే.. మెదడులోని కణాల సైజు తగ్గడాన్ని సెరెబ్రల్ ఆట్రోపీ అని పిలుస్తారు. ప్రొటీన్స్ సరైన మోతాదులో అందనప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది.

కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇది ప్రతి ఒక్కరిలో ఎదురయ్యే సమస్యే. పెద్దవాళ్లు అయ్యే కొద్దీ.. ఈ సమస్య వస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత లైఫ్ స్టైల్ కారణంగా.. కొన్ని అలవాట్లు చిన్నవయసులోనే మెదడు ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతున్నాయి. అయితే ఈ సమస్యకు కారణమయ్యే అలవాట్ల గురించి అవగాహన ఉంటే.. ఎలాంటి సమస్యా ఉండదు. అలాంటి అన్ హెల్తీ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బ్రెయిన్ ని డ్యామేజ్ చేసే 10 అలవాట్లు
బ్రేక్ ఫాస్ట్

బ్రేక్ ఫాస్ట్

ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం వల్ల మెదడుకి మంచిది. ఉదయాన్నే తీసుకునే ఫుడ్ ద్వారా కొన్ని కెమికల్స్ విడుదలై.. పాజిటివ్ ఫీలింగ్స్ క్రియేట్ చేస్తాయి. కాబట్టి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం మాత్రం మానేయకూడదు. దీనివల్ల మెదడు యాక్టివ్ నెస్ కోల్పోతుంది.

MOST READ:7 రోజుల పాటు ఉదయాన్నే వెల్లుల్లి, తేనె తినడం వల్ల పొందే బెన్ఫిట్స్..! MOST READ:7 రోజుల పాటు ఉదయాన్నే వెల్లుల్లి, తేనె తినడం వల్ల పొందే బెన్ఫిట్స్..!

తక్కువ నిద్ర

తక్కువ నిద్ర

నిద్రలేమి సమస్య కారణంగా.. మెదడుపై నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఏకాగ్రత, అలర్ట్ ని తగ్గిస్తుంది. రోజువారీ పనుల్లో యాక్టివ్ నెస్ కోల్పోతుంది.

వ్యాయామం

వ్యాయామం

లేజీగా ఉండటం, వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల.. శరీరం మొత్తం నిరుత్సాహంగా మారుతుంది. ఎక్సర్ సైజులు చేయడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది.

ఫోన్

ఫోన్

మన రోజువారీ అలవాట్లు నిజంగానే హెల్త్ ని రిస్క్ లో పడేస్తాయి. ఎక్కువ సమయం ఫోన్ తో గడపడం వల్ల.. మనల్ని, మన మెదడుని అనారోగ్యం పాలయ్యేలా చేస్తుంది. ఫోన్ ద్వారా వచ్చే బ్లూ లైట్ కారణంగా సమయానికి నిద్రపోకుండా అడ్డుకుంటుంది.

మంచినీళ్లు

మంచినీళ్లు

ఏడాదంతా.. మంచినీళ్లే మీ ఫేవరేట్ డ్రింక్ గా ఉండాలి. దీనివల్ల మిమ్మల్ని ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంచుతుంది. శరీరంలోని ఇతర భాగాలకంటే.. మెదడుకి ఎక్కువ నీళ్లు అవసరమవుతాయి. మెదడులోని కణాలు 85 శాతం నీటితోనే ఉంటాయి కాబట్టి నీళ్లు తాగడాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

MOST READ:ఓంకార నాదంగా పిలువబడే MOST READ:ఓంకార నాదంగా పిలువబడే " ఓం " గురించి ఆసక్తికర విషయాలు !!

ఆల్కహాల్

ఆల్కహాల్

ఆల్కహాల్ తరచుగా తీసుకుంటే సమస్య లేదు.. కానీ ఎక్కువగా తీసుకుంటే దానికి అడిక్ట్ అవుతారు. ఈ అలవాటు ఆరోగ్యకరం కాదు. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల థాట్ ప్రాసెస్ కి ఆటకం కలుగుతుంది.

డ్రగ్స్

డ్రగ్స్

ఇల్లీగల్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మెదడులోని నరాలు, కణాలపై దుష్ర్పభావం చూపుతుంది. అంతేకాదు మెమరీ పవర్ ని కూడా క్షీణించేలా చేస్తాయి. మీ ప్రవర్తనపైనా ప్రభావం చూపుతాయి.

ఒత్తిడి

ఒత్తిడి

ఒత్తిడి సైలెంట్ కిల్లర్ గా చెప్పవచ్చు. కాబట్టి ఒత్తిడిని జయించడం చాలా అవసరం. ఒత్తిడి మెదడులోని కణాలను నాశనం చేస్తాయి. అలాగే మెమరీ, లెర్నింగ్ స్కిల్స్ ని కూడా క్షీణించేలా చేస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆహారం

ఆహారం

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మరణానికి ఒబేసిటీ రెండో కారణంగా చెప్పవచ్చు. ఒబేసిటీతో ఉండటం వల్ల గుండెతో పాటు, మెదడు ఆరోగ్యానికి హాని కలుగుతుంది. తక్కువ ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం ఎవరైతే తీసుకుంటారో.. వాళ్లకు అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

స్మోకింగ్

స్మోకింగ్

స్మోకింగ్ కేవలం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. మెదడు ఆరోగ్యాన్ని క్షీణించేలా చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్ గా స్మోకింగ్ చేయడం వల్ల మెదడు సైజు చిన్నగా అవడానికి కారణమవుతుంది. కాబట్టి స్మోకింగ్ కి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది.

చూశారుగా.. ఇలాంటి అన్ హెల్తీ హ్యాబిట్స్ వల్ల మీ మెదడు ఆరోగ్యం క్షీణించడమే కాకుండా.. మిమ్మల్ని అనారోగ్యం పాలుచేస్తాయి.

English summary

10 Lifestyle Habits That Shrink Your Brain

10 Lifestyle Habits That Shrink Your Brain. Cerebral atrophy is a common feature of many of the diseases that affect the brain.
Desktop Bottom Promotion