For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాబ్లెట్స్ కి గుడ్ బై చెప్పి.. న్యాచురల్ యాంటీ బయాటిక్స్ ట్రై చేయండి..

|

సాధారణంగా సొంత వైద్యం ఒంటికి చేటు.. అతిగా మందుల వాడకం ఆరోగ్యానికి చేటు అని తెలిసినా.. చిన్న అనారోగ్యం వచ్చినట్లనిపిస్తే చాలు చాలామంది ఇష్టం వచ్చినట్లు మందులు మింగేస్తుంటారు. విచక్షణారహితంగా యాంటీ బయోటిక్స్ వాడితే రోగ నిరోధక శక్తి తగ్గడమే కాకుండా.. చికిత్స కూడా వికటించే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హిప్పోక్రేట్స్ యొక్క మాటలలో 'మీ ఆహారమే మీ ఔషదం, మరియు మీ ఔషధం మీ ఆహారం'. అంటే మీరు తీసుకొనే ఆహారమే మీ శరీర ఆరోగ్యానికి ఔషధాలాంటివని తన మాట్లో ఇలా తెలిపాడు. ఈ విలువైన విషయాన్ని గుర్తుంచుకుంటే మీ జీవితాంతం మీరు ఆరోగ్యంగా జీవించగలుగుతారు!

మన శరీరంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్స్ ను చికిత్సనందించడానికి లేదా నివారించడానికి యాంటీబయోటిక్స్ ను ఉపయోగిస్తుంటాము . ముఖ్యంగా స్టొమక్ ఇన్ఫెక్షన్స్, ఇయర్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో మరియు మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలను నివారించడానికి యాంటీబయోటిక్స్ ను ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇలా ఎక్కువగా యాంటీ బయోటిక్స్ ను తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శకత్తి తగ్గిపోతుంది. దాంతో ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కొంత మందిలో యాంటీబయోటిక్స్ వల్ల హానికరమైన సైడ్ ఎఫెక్ట్స్ కు దారితీస్తుంది.

మనం యాంటీబయాటిక్స్ వాడినన్ని రోజులూ చాలా ఎఫెక్టివ్ గా బ్యాక్టీరియా పెరుగుదలను నాశనం చేయడం లేదా నిరోధించడం జరుగుతుంది. అయితే ఈ క్రింది లిస్ట్ లో ఇచ్చిన యాంటీబయోటిక్స్ దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వైరస్ కు కారణం అయ్యే వీటిని నేచురల్ యాంటీబయోటిక్స్ ఇన్ఫెక్షన్స్ తో పోరాడలేవు.

యాంటీబయోటిక్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేకంగా కూడా పోరాడలేవు. స్టొమక్ ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి పోరాడటానికి ఈ క్రింది లిస్ట్ లోని యాంటీబయోటిక్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఈ నేచురల్ యాంటీబయోటిక్స్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు సురక్షితమైనవి. ప్రక్రుతి పరంగా మనకు అందుబాటులో ఉండే ఎన్నో ఆహారాలు మనకు నేచురల్ డిఫెండర్స్ గా పనిచేస్తాయి.

వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోవడానికి పురాతన కాలం నుండి నేచురల్ ఫుడ్స్ ను యాంటీబయోటిక్స్ గా ఉపయోగిస్తున్నారు. వీటి ద్వారా అనేక రకాల ఇన్ఫెక్షన్స్ ను నివారించుకోగలుగుతున్నాయి . యాంటీబయోటిక్స్ ఆస్టిజెంట్ ఫుడ్స్ గా వివిధ రకాల కాంపౌండ్స్ కలిగి ఉంటాయి . ఇవి యాంటీ బయోటిక్ , యాంటీఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్పటిక్ లక్షణాలు ఉండటం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది.

మరి ఈ ఎఫెక్టివ్ నేచురల్ యాంటీ బయోటిక్స్ ఎలాంటివో తెలుసుకుందాం...

1. వెల్లుల్లి:

1. వెల్లుల్లి:

వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో యాంటీఫంగల్‌, యాంటీవైరల్‌ గుణాలు అధికంగా ఉన్నాయి. ఖనిజాలు, విటమిన్లు, పోషకాలతో నిండి ఉన్న వెల్లుల్లి బ్యాక్టీరియాను తరిమికొట్టి అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. కాబట్టి వెల్లుల్లిని రోజూ తయారుచేసుకొనే వంటకాల్లో భాగంగా చేసుకోవడంతో పాటు ఉదయాన్నే పరగడుపున రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని నమలడం మంచిది. ప్రతి రోజు ఉదయం కాలీ పొట్టతో రెండు, మూడు వెల్లుల్లిపాయలను నేరుగా తీసుకోవాలి లేదా మీరు తయారుచేసే వంటకాల్లో జోడించుకోవచ్చు. ఈ నేచురల్ యాంటీ బయోటిక్ స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

2. తేనె:

2. తేనె:

తేనెలో ఉండే యాంటీమైక్రోబియల్‌, యాంటీఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్‌ గుణాలు బ్యాక్టీరియాను నశింపజేయడంలో తోడ్పడతాయి. ఇందుకోసం దాల్చిన చెక్క, తేనె సమపాళ్లలో తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రోజూ చెంచా చొప్పున తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి మెరుగుపడడంతో పాటు అనారోగ్యాం దూరమవుతుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు చక్కెరకు బదులుగా తేనెను ఉపయోగించుకోవచ్చు. శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచే నేచురల్ యాంటీ బయోటిక్ తేనె . తేనె మరియు దాల్చిన చెక్క యొక్క పొడిని సమంగా తీసుకొని, బ్రౌన్ బ్రెడ్ కు అప్లైచేసి ఉదయం అల్పాహారంగా తీసుకోవాలి. స్టొమక్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో ఈ యాంటీబయోటిక్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది.

3. రా ఆపిల్ సైడర్ వెనిగర్ :

3. రా ఆపిల్ సైడర్ వెనిగర్ :

రా ఆపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గించడానికి సహాయపడుతుంది . ఇది ఎలాంటి రిమార్క్ లేని నేచురల్ డిఫెండర్ . కెమికల్ ఫ్రీ మరియు ఎఫెక్టివ్ డిస్ ఇన్ఫెక్ట్ యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది.

4. పసుపు:

4. పసుపు:

ఆయుర్వేదిక్‌ మందుల తయారీలోనూ ఉపయోగించే ఔషధం పసుపు. ఇందులోని యాంటీబయోటిక్‌ గుణాలు మన శరీరాన్ని బ్యాక్టీరియా నుంచి కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే పసుపులోని 'కుర్కుమిన్‌' అనే పదార్థం వివిధ రకాల అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది. కాబట్టి పసుపును రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడం ముఖ్యం. దీంతో పాటు రోజూ పసుపు, తేనె మిశ్రమాన్ని తీసుకోవడం కూడా మంచిది. వ్యాధుల వల్ల పొట్టలో ఏర్పడే బ్యాక్టీరియాను నివారించడానికి ఈనేచురల్ యాంటీబయోటిక్ ను ఉపయోగించవచ్చు . ఒక చెంచా పుసుపులో , 6చెంచాల తేనె మిక్స్ చేసి, మూత గట్టిగా ఉండే డబ్బాలో స్టోర్ చేయాలి . అరచెంచాను రోజుకు రెండు సార్లు తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

5. కొబ్బరి నూనె:

5. కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె: కొబ్బరి నూనె ఒక నేచర్ అందించిన బెస్ట్ గిప్ట్ . ఇందులో చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి . అలాగే నేచురల్ యాంటీబయోటిక్స్ గా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇవి నిత్య జీవితంలో ఎదురయ్యే ఇన్ఫెక్షన్స్ ను గ్రేట్ గా నివారిస్తాయి.

6. క్యాబేజ్:

6. క్యాబేజ్:

క్యాబేజీ సహజసిద్ధమైన యాంటీబయోటిక్‌గా పనిచేస్తుంది. ఇందులోని సల్ఫర్‌ సమ్మేళనాలు క్యాన్సర్‌ కారకాలకు వ్యతిరేకంగా పోరాడి ఆ వ్యాధి ముప్పును తప్పించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.క్యాబేజ్ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇన్ఫెక్షన్స్ తో చాలా ఎఫెక్టివ్ గా పోరాడుతాయి. అలాగే ప్రస్తుతం శరీరంలో ఇతర ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

7. ఓరిగానో ఆయిల్:

7. ఓరిగానో ఆయిల్:

ఇందులో కూడా అమేజింగ్ బెనిఫిట్స్ దాగున్నాయి . ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను ఈ ఓరిగానో ఆయిల్లో కనుగొనడం జరిగింది . ఇది బ్యాక్టీరియాను తొలగించడం మరియు ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

8. గ్రేఫ్ ఫ్రూట్:

8. గ్రేఫ్ ఫ్రూట్:

స్కిన్ ఇన్ఫెక్షన్స్ నివారించడంలో గ్రేప్ ఫ్రూట్ ఎక్స్ ట్రాక్ట్ నేచురల్ యాంటీబయోటిక్ అన్న విషయం చాలా మందికి తెలియదు . అందుకు మీరు చేయాల్సింది 10-15 చుక్కల రసాన్ని గ్లాసులో తీసుకొని అందులో నీళ్ళు పోసి దీన్ని రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి.

9. ఫెర్మెంటెడ్ ఫుడ్:

9. ఫెర్మెంటెడ్ ఫుడ్:

ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అంటే నిల్వ చేసిన ఆహారాలు రా పికెల్స్, ప్రొబయోటిక్ యోగ్రట్ వంటివి . ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి నేచురల్ గా శరీరంలో ఇన్ఫెక్షన్స్ వ్యతిరేకంగా పనిచేస్తాయి.

10. అల్లం:

10. అల్లం:

అల్లంలో ఉండే యాంటీబయోటిక్‌ గుణాలు బ్యాక్టీరియా వల్ల కలిగే పలు రకాల ఆరోగ్య సమస్యల నుంచి మనల్ని కాపాడతాయి. అలాగే శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో అల్లాన్ని తప్పనిసరిగా తీసుకోండి. సాల్మొనెల్లా వంటి ఫుడ్ బార్న్ పాతోజెనిస్ తో పోరాడే యాంటీబయోటిక్ బెస్ట్ నేచురల్ ఫ్రెష్ జింజర్ గ్రేట్ గా సహాయపడుతుంది . అందుకు డ్రై లేదా ఫ్రెష్ జింజర్ ను మీ వంటల్లో చేర్చాలి.

English summary

10 Natural Antibiotics That Work Better Than Pills..

Most of us rely on pharmaceutical antibiotics to cure our everyday infections, which are not life threatening. Moreover, the use of antibiotics has reached an all-time high due to the growing environmental pollution, which is a matter of great concern.
Story first published:Thursday, April 28, 2016, 11:31 [IST]
Desktop Bottom Promotion