For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీహైడ్రేషన్ వల్ల బరువు పెరుగుతారు అనడానికి 11 కారణాలు..!!

By Swathi
|

మన శరీరానికి అవసమైనన్ని నీళ్లు తాగకపోతే.. అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. జీర్ణం కాకపోవడం, బ్లాడర్, కిడ్నీ, చర్మ సమస్యలు, తలనొప్పి, అలసట వంటి రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీళ్లు తాగడాన్ని సీరియస్ గా తీసుకోకపోతే.. చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకు శ్వాస తీసుకోవడం ఎంత ముఖ్యమో.. నీళ్లు తాగడం కూడా అంతే ముఖ్యం.

ఇండియన్స్ రాగి పాత్రలో నీళ్లు తాగడం వెనక సీక్రెట్ ఏంటి ?

మీరు ఎప్పుడైతే దప్పిక ఫీలవుతున్నారో.. అప్పటికే మీ శరీరం డీహైడ్రేట్ అయిందని అర్థం. ఎప్పుడూ ఒక గ్లాసు నీటిని.. మీకు దగ్గరగా పెట్టుకోండి. దీనివల్ల మీరు పదేపదే నీళ్లు తాగే అవకాశం ఉంటుంది. అలాగే.. కేవలం దప్పికగా ఉన్నప్పుడు మాత్రమే కాదు.. గ్యాప్ ఇస్తూ.. అప్పుడప్పుడు నీళ్లు తాగుతూ ఉండాలి.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ తాగే అలవాటు మానేయడానికి ప్రయత్నించండి. దానికి బదులు 2 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల.. హెల్తీగా ఉంటారు. బ్లడ్ ప్రెజర్ నార్మల్ గా ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మనలో చాలామంది సోడాలు, స్వీట్ జ్యూస్ లు, టీలు తాగడం వల్ల.. శరీరానికి హైడ్రేట్ అవుతుందని భావిస్తారు. కానీ.. అవి డీహైడ్రేట్ చేస్తాయి.

ఉదయాన్నే నీరు త్రాగడం వల్ల పొందే 15 గొప్పు ఆరోగ్య ప్రయోజనాలు

మనం రోజంతా తీసుకున్న ఆహారంలో ఉండే సాల్ట్, షుగర్ ని తొలగించడంలో నీళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఎక్కవనీళ్లు తాగాలని సూచిస్తారు. కాఫీ మానేయలేకపోతే.. కనీసం ఒక కప్పు కాఫీకి ఒక గ్లాసు ఎక్స్ ట్రా నీళ్లు తాగాలి. అలాగే నీళ్లు మెటబాలిజంను పెంచుతాయి. దీనివల్ల బరువు తగ్గడం తేలికగా, సేఫ్ గా ఉంటుంది. అయితే నీళ్లు సరిగ్గా తాగకపోవడం వల్ల.. డీహైడ్రేషన్ ఏర్పడితే.. బరువు పెరుగుతారు అనడానికి 11 పర్ఫెక్ట్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

అలసట

అలసట

శరీరానికి ఎనర్జీ అందించే వాటిలో నీళ్లు చాలా ముఖ్యమైనవి. డీహైడ్రేషన్ వల్ల.. శరీరంలో ఎంజైమ్ లు యాక్టివిటీ స్లోగా మారుతుంది. దీనివల్ల.. అలసట, నీరసం వస్తాయి.

హై బ్లడ్ ప్రెజర్

హై బ్లడ్ ప్రెజర్

శరీరంలో హైడ్రేట్ గా ఉన్నప్పుడు బ్లడ్ లో 92 శాతం నీళ్లు ఉంటాయి. ఎప్పుడైతే శరీరం డీహైడ్రేట్ అవుతుందో.. బ్లడ్ మందంగా మారుతుంది. దీనివల్ల బ్లడ్ ఫ్లో నెమ్మదిగా మారి.. బ్లడ్ ప్రెజర్ కి కారణమవుతుంది.

ఆస్తమా, అలర్జీ

ఆస్తమా, అలర్జీ

శరీరం డీహైడ్రేషన్ కి గురయినప్పుడు.. శ్వాసనాళాలకు ఆటంకం ఏర్పడుతుంది. దీనివల్ల ఆస్తమా, ఎలర్జీలు సమస్య పెరుగుతుంది.

చర్మ సమస్యలు

చర్మ సమస్యలు

డీహైడ్రేషన్ వల్ల.. చర్మం ద్వారా టాక్సిన్స్ తొలగించడం ఇబ్బందిగా మారుతుంది. దీనివల్ల.. అనేక రకాల చర్మ సమస్యలు ఎదురవుతాయి. సోరియాసిస్, డెర్మటిటిస్, చిన్నవయసులోనే ముడతలు వంటి సమస్యలు కనిపిస్తాయి.

హై కొలెస్ట్రాల్

హై కొలెస్ట్రాల్

ఎప్పుడైతే శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు.. కణాలు నీటిని కోల్పోకుండా ఉండటానికి ఎక్కువ కొలెస్ట్రాల్ ని ఉత్పత్తి చేస్తుంది.

బ్లాడర్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్

బ్లాడర్ లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్

శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు.. శరీరంలో టాక్సిన్స్, యాసిడ్ పేరుకుపోయి.. బ్లాడర్, కిడ్నీల్లో సమస్యలు, ఇన్ఫెక్షన్లు, ఇన్ల్ఫమేషన్, పెయిన్ కి కారణమవుతాయి.

జీర్ణసంబంధ సమస్యలు

జీర్ణసంబంధ సమస్యలు

శరీరంలో నీళ్లు, అల్కలైన్ మినరల్స్ అయిన క్యాల్షియం, మెగ్నీషియం లోపించినప్పుడు.. అనేక రకాల జీర్ణసంబంధ సమస్యలు ఎదురవుతాయి. అల్సర్, గ్యాస్ట్రిక్, ఎసిడిక్ రిఫ్లక్స్ వంటి సమస్యలు వెంటాడుతాయి.

కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

శరీరంలో నీళ్లు తగ్గినప్పుడు శరీరంలో ముఖ్యమైన అవయవాలకు ఫ్లూయిడ్స్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. కోలన్. సరైన మోతాదులో నీళ్లు లేనప్పుడు పెద్ద పేగులకు ఇబ్బంది కలుగుతుంది. దీనివల్ల కాన్ట్సిపేషన్ సమస్య ఎదురవుతుంది.

జాయింట్ పెయిన్స్

జాయింట్ పెయిన్స్

అన్ని కీళ్లు.. కార్టిలేజ్ అని కలిగి ఉంటాయి. ఇది.. ముఖ్యంగా వాటర్ సపోర్ట్ తో ఉంటుంది. ఎప్పుడైతే శరీరం డీహైడ్రేట్ అవుతుందో.. కార్టిలేజ్ బలహీనమవుతుంది. జాయింట్స్ లో నొప్పి, అసౌకర్యం ఏర్పడుతుంది.

బరువు పెరగడానికి

బరువు పెరగడానికి

శరీరం డీహైడ్రేట్ అయినప్పుడు కణాల్లో ఎనర్జీ క్షీణించి.. ఆధారపడేలా చేస్తాయి. దీనివల్ల మనం దప్పిక ఫీలవుతాం.

ప్రీమెచ్యూర్ ఏజింగ్

ప్రీమెచ్యూర్ ఏజింగ్

డీహైడ్రేట్ అయినప్పుడు శరీరంలోని అవయవాలు.. ముఖ్యంగా చర్మంలో ముడతలు, ప్రీమెచ్యూరిటీ కనిపిస్తుంది.

English summary

11 Reasons Dehydration Is Making You Fat

11 Reasons Dehydration Is Making You Fat. Not drinking enough water can lead to numerous health problems such as digestive, bladder, kidney, skin problems, headaches and fatigue.
Story first published:Wednesday, July 13, 2016, 14:47 [IST]
Desktop Bottom Promotion