For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెంగ్యు నివారణకు ఖచ్చితంగా తినాల్సిన ఇమ్యూనిటి పవర్ ఫుడ్స్

|

ఈ మద్య కాలంలో ఎక్కడ చూసినా డెంగ్యూ మాట వినిపిస్తోంది. నార్త్ ఇండియానే కాదు, ఇటు సౌత్ స్టేట్స్ లో కూడా డెంగ్యు ఎక్కువగా విస్తరించింది. పక్కింట్లోనే, ఎదురింట్లోనే ఎవరో ఒక్కరు డేంగ్యు బారీన పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ డెంగ్యు గురించి భయపడుతుంటారు. ఇటువంటి వ్యాధులకు తీసుకోవల్సిన వెంటనే నివారణ పద్దతులను ఫాలో అవ్వడానికి ఒక సూచన.

ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. ఈ వైరస్ జీవితచక్రమం దోమల నుంచి మనుషులకు, మనుషుల నుంచి దోమలకు ఇది ఒక విష వలయంలా ఉంటుందన్నమాట. దోమ, దోమ కుట్టిన 5 నుంచి 6 రోజులకు జ్వరం ప్రారంభమవుతుంది. పగలు కుట్టే దోమల వల్ల ఈ విషజ్వరం వ్యాపిస్తుంటుంది.

నిలువ నీళ్లల్లో ఈడిస్ ఈజిప్టై దోమ గుడ్లు పెడుతుంది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, అండర్‌గ్రౌండ్ ట్యాంకులు, కూలర్లు, ఇంట్లోని పాత్రలు, ఫ్లవర్‌వాజులు, నీటి కుండీలు, పాతటైర్లు, పనికిరాని పడేసిన బాటిళ్లు, పాత్రలు, డబ్బాలు... ఇలా ఎక్కడ నీళ్లు నిలువ ఉండటానికి అవకాశం ఉంటే అక్కడ ఈ దోమ గుడ్లు పెడుతుంది. ఈ నీళ్ల నుండి వారం, పదిరోజుల్లో లక్షలాది దోమలు తయారవుతాయి. ఇవి చల్లగా ఉండే, నీడగా ఉండే ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటాయి. అంటే మన ఇళ్లల్లో కర్టెన్ల వెనకా, తలుపుల వెనకా, గోడల మాటన విశ్రమించి మధ్యాహ్నం, సాయం సమయాలలో కుట్టడం ప్రారంభిస్తాయి.

ఇలా పగటి పూట కుట్టడం వల్ల ఫీవర్, తలనొప్పి, బ్యాక్ పెయిన్, కళ్ళ మరియు జాయింట్స్ లో నొప్పిగా అనిపించడంలో , ప్లేట్ లెట్స్ తగ్గడం వంటి లక్షణాలు కనబడుతాయి. డెంగ్యు వైరస్ సోకినప్పుడు, వీక్ నెస్, మరియు అలసట సోకుతాయి. జాయింట్ పెయిన్స్, బ్రేక్ బోన్ ఫీవర్ ఎక్కువ అవుతుంది. డెంగ్యు నివారిచుకోవడానికి వ్యాక్సినేషన్ వేయించుకోవడం ఒకటే మార్గం. అందువల్ల డెంగ్యు లక్షణాలు కనబడిన వెంటనే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది.డెంగ్యును ఎదుర్కోవడానికి బాడీలో ఇమ్యూనిటి పవర్ పెంచుకోవాలి. అందుదకు కొన్ని ఇమ్యూన్ పవర్ బూస్టింగ్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి....

బాడీ హైడ్రేషన్ లో ఉంచుకోవాలి:

బాడీ హైడ్రేషన్ లో ఉంచుకోవాలి:

ఇమ్యూనిటి లెవల్స్ తగ్గడం వల్ల వైరస్ త్వరగా వ్యాప్తి చెందుతుంది. రోజులో ఎక్కువగా నీరు తాగడం, కోకనట్ వాటర్ తాగడం వల్ల శరీరానికి గ్రేట్ గా ఉపయోగపడుతుంది.

 గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి.

గ్రీన్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి.

గ్రీన్ వెజిటేబుల్స్ లో విటమిన్స్, మినిరల్స్, ఫైబర్స్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటి పవర్ ను పెంచుతాయి. గ్రీన్ వెజిటేబుల్స్, ఆకు కూరలు, బ్రొకోలీ, లెట్యూస్, కొత్తిమీర, ఇంకా ఫ్రెఫ్ వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

ఆరెంజెస్:

ఆరెంజెస్:

డెంగీ రోగికి ఒక మంచి ఆహారం సిట్రస్ పండ్లు, ఆరెంజ్ జ్యూస్ మరియు పండ్లలో పుష్కలమైన విటిమిన్ సి మరియు శక్తి నిండి ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల, ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. యూరినరీ అవుట్ పుట్ ను మెరుగుపరిచి యాంటీబాడీస్ ప్రోత్సహించి రోగి త్వరగా కోలుకొనేందుకు సహాయపడుతుంది.

లవంగాలు:

లవంగాలు:

లవంగాల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. లవంగాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఇమ్యూనిటి పవర్ ను పెంచుకోవచ్చు. ఇది వివిధ రకాల వ్యాధులను తగ్గిస్తుంది.

పెరుగు:

పెరుగు:

పెరుగులో ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి, పెరుగు బ్యాక్టీరియాతో పోరాడుతుంది.డెంగ్యుతో పోరాడే శక్తిని అందిస్తుంది

 వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచుతుంది. వెల్లుల్లిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇమ్యూనిటిని పెంచుకోచ్చు.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

క్యారెట్స్ లో బీటా కెరోటిన్స్ అధికంగా ఉన్నాయి, ఇవి సెల్స్ మరియు యాంటీబాడీస్ కు రక్షణ కల్పిస్తుంది. దాంతో ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది.

 ఫ్రెష్ సీ ఫుడ్స్:

ఫ్రెష్ సీ ఫుడ్స్:

సీఫుడ్స్ లో తున, సాల్మన్ వంటి చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇంకా యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి ఇమ్యూనిటి లెవల్స్ ను పెంచుతుంది,ఇతర ఇన్ఫెక్షన్స్ ను కూడా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

రెగ్యులర్ వ్యాయామం:

రెగ్యులర్ వ్యాయామం:

ఫుడ్ విషయంలోనే కాదు, వ్యాయామం కూడాప చాలా అవసరం. ఇమ్యూనిటి లెవల్స్ ను పెంచుకోవడానికి వ్యాయామం కూడా సహాయపడుతుంది.

మష్రుమ్స్ :

మష్రుమ్స్ :

మష్రుమ్స్ వ్యాధినిరోధకతను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది శరీరంలో డెంగ్యు వంటి ఇన్ఫెక్షన్స్ తో పోరాడటానికి సహాయపడుతుంది.

తులసి:

తులసి:

కొన్ని తులసి ఆకులను తీసుకుని, ఉదయం తినడం వల్ల ఇమ్యూనిటి లెవల్స్ పెరుగుతాయి. ఇన్ఫెక్షన్స్ నివారించబడుతాయి. డెంగ్యుల లక్షణాలను తగ్గుతాయి.

 వేప:

వేప:

వేప ఇమ్యూన్ సిస్టమ్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని వేపఆకులను తీసుకుని వాటర్ లో వేసి టీలాగా తయారుచేసి, కొద్దిగా కొద్దిగా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

English summary

12 Ways To Boost Immunity To Prevent Dengue

12 Ways To Boost Immunity To Prevent Dengue, Your neighbour has caught dengue and has been hospitalized and a small kid succumbed to dengue close by. Hearing all this, might have surely led you to panic. Well, if this is the case then taking measures to prevent the dreaded disease should be the first step.
Desktop Bottom Promotion