For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనీమియా నివారించడానికి ఆయుర్వేద చిట్కాలు

By Swathi
|

ప్రస్తుత రోజుల్లో మహిళలు ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ అనీమియా. అనీమియాతో బాధపడేవాళ్లలో బ్లడ్ లో ఎర్ర రక్త కణాలు తగ్గుతూ వస్తాయి. దీని కారణంగా.. రక్తంలో క్రమంగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలా బలహీనత, గుండె దడ, తలతిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే శ్వాస కూడా సరిగా అందకుండా ఇబ్బందిపడాల్సి వస్తుంది.

ముఖ్యంగా విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్తకణాలు తగ్గుతాయి. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువగా బ్లడ్ కోల్పోయినప్పుడు కూడా.. డేంజరస్ అనీమియా వచ్చే అవకాశం ఉంది. అయితే న్యాచురల్ హెర్బ్స్ ఉపయోగించి దీన్ని ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.

ఆయుర్వేదం త్వరగా ఉపశమనం కలిగించకపోయినా.. నెమ్మదిగా పూర్తీగా నయం చేస్తుంది. మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలిగే ప్రమాదం ఉంది. కానీ.. ఆయుర్వేదం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా.. సేఫ్ గా వ్యాధిని నయం చేస్తుంది. మరి అనీమియాతో పోరాడే ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమిడీస్ ఏంటో చూద్దాం..

Effective Ways To Treat Anaemia With Ayurveda

ఉసిరి
ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. ఐరన్ ని వేగంగా గ్రహించడానికి ఇవి సహాయపడతాయి. అలాగే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి సహాయపడి.. అనీమియాని నివారిస్తాయి. దీన్ని ఫ్రూట్ జ్యూస్ రూపంలో లేదా అలాగే కాయ రూపంలో తీసుకోవచ్చు.

ఉసిరి జ్యూస్ కి టీ స్పూన్ తేనె, నీళ్లు కలిపి రోజుకి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. ఇది శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ పెంచడానికి సహాయపడుతుంది. ఇవి పెరిగితే.. అనీమియాని అరికట్టవచ్చు.

Effective Ways To Treat Anaemia With Ayurveda

వేప ఆకులు
వేప ఆకులలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి ఫుడ్స్ అయిన ఉసిరి, వేప ఆకులు తీసుకోవడం వల్ల.. హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగడానికి సహాయపడతాయి. కాబట్టి అనీమియాతో బాధపడేవాళ్ల డైట్ లో వీటిని కంపల్సరీ చేర్చుకోవాలి.

2 టీస్పూన్ల తేనె, 10 గ్రాముల వేప ఆకుల జ్యూస్ కలిపి ప్రతి రోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ పెరిగి.. అనీమియా నయం అవుతుంది.

వీట్ గ్రాస్
వీట్ గ్రాస్ అద్భుతమైన ఆయుర్వేద హెర్బ్. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీట్ గ్రాస్ జ్యూస్ ని డైలీ తీసుకోవడం వల్ల బ్లడ్ లో ఐరన్ లెవెల్స్ పెరిగి అనీమియాను నివారిస్తుంది.

English summary

3 Effective Ways To Treat Anaemia With Ayurveda

3 Effective Ways To Treat Anaemia With Ayurveda. One of the major and common health issues that are faced by women these days is anaemia.
Story first published:Wednesday, June 22, 2016, 16:27 [IST]
Desktop Bottom Promotion