For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాంటీ బయాటిక్స్ వల్ల ఎదురయ్యే డేంజర్ సైడ్ ఎఫెక్ట్స్..!!

By Swathi
|

చల్లటి వాతావరణం.. అనేక ఇన్ఫెక్షన్స్, శ్వాస సంబంధ సమస్యలకు కారణమవుతుంది. ముఖ్యంగా.. దగ్గు, జలుబు, తుమ్ములు, తల పట్టేయడం వంటి సమస్యలు తీసుకొస్తాయి. ఇలాంటి లక్షణాలతో డాక్టర్ ని సంప్రదించినప్పుడు వెంటనే సూచించేది యాంటీ బయోటిక్స్. లేదా కొంతమంది డాక్టర్ సలహా తీసుకోకుండా.. స్వతహాగా.. యాంటీ బయోటిక్స్ తీసుకుంటూ ఉంటారు.

ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ట్యాబ్లెట్ కోసం చూస్తారు. కానీ యాంటీ బయాటిక్స్ ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల.. చాలా పెద్ద సమస్య ఫేస్ చేయాల్సి వస్తుంది. లైఫ్ సేవ్ చేసేవి యాంటి బయాటిక్స్. కానీ.. అందులో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి.

డయేరియా

డయేరియా

యాంటిబయాటిక్స్ లో అమోక్సిసిల్లిన్, మెట్రోనైడజోల్ ఉంటాయి. ఇవి.. డయేరియాకి కారణమవుతాయి. చాలా తరచుగా.. నీళ్ల విరేచనాలు అవడానికి యాంటీ బయాటిక్స్ కారణమవుతాయి.

ఎసిడిటీ, గ్యాస్

ఎసిడిటీ, గ్యాస్

యాంటీ బయాటిక్స్ ని ఏదైనా ఇన్ఫెక్షన్ నివారించడానికి తీసుకోవడం వల్ల.. అవి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్స్ కి కారణమవుతాయి. సాధారణంగా.. యాంటి బయాటిక్స్ మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కానీ.. ఇవి ఇన్ టెస్టైన్ కి చాలా అవసరం.

స్కిన్ ఎలర్జీ

స్కిన్ ఎలర్జీ

కొన్ని రకాల డ్రగ్స్ సల్పా టెట్రాసైక్లిన్ అనే యాంటీ బయాటిక్.. స్కిన్ ఎలర్జీకి కారణమవుతాయి. వీటివల్ల దురద, పొక్కులు చర్మంపై ఏర్పడతాయి. చాలా అరుదుగా.. స్టివెన్స్, జాన్ సన్ సిండ్రోమ్ కి దారితీస్తాయి. దీనివల్ల.. చర్మంపై తీవ్రమైన వాపు, మంట వస్తాయి.

వాజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్

వాజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్

యాంటి బయాటిక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లో చాలా సాధారణమైనది.. వాజినల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్. టెట్రాసైక్లిన్, క్లిండమిసిన్ వంటి యాంటీ బయాటిక్స్ ఈస్ట్ గ్రోత్ ని పెంచి.. వాజినల్ ప్రాంతంలో తక్కువ ఎసిడిక్ ఉండటానికి కారణమై.. ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది.

నోటి పుండు

నోటి పుండు

యాంటి బయాటిక్స్ వల్ల.. ఓరల్ ఇన్ఫెక్షన్ కూడా వేధిస్తుంది. వీటిని స్టొమటిటిస్ అంటారు.

కిడ్నీ పనిచేయకపోవడం

కిడ్నీ పనిచేయకపోవడం

ఎమినొగ్లైకోసైడ్స్ వంటి యాంటీ బయాటిక్స్ కిడ్నీలకు మంచిది కాదు. ఇలాంటి యాంటీ బయాటిక్స్ వాడటం వల్ల.. కిడ్నీల పనితీరు ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి.. ఇలాంటి యాంటీ బయాటిక్స్ కి దూరంగా ఉండటం వల్ల.. కిడ్నీ వ్యాధులను అరికట్టవచ్చు.

English summary

6 side effects of antibiotics you should know

6 side effects of antibiotics you should know. Yes, antibiotics are life-saving drugs. But they can also have potential side effects. Dr Pradip Shah, a physician at Fortis Hospital, Mumbai, warns us about the following signs.
Story first published:Tuesday, August 9, 2016, 10:41 [IST]
Desktop Bottom Promotion