For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డైజెషన్ అవ్వట్లేదా..? 100% జీర్ణ శక్తిని పెంచే అమేజింగ్ ఫుడ్స్ ఇవి..!

జీర్తిని నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా అజీర్తి సమస్యలను నివారించుకోవచ్చు. మరి జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి కొన్ని హోం రెమెడీ

|

మారిన జీవనవిధానం, ఆహారపు అలవాట్లు అనేక జీర్ణసమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఎవ్వరిని పలకరించినా ఎసిడిటీ, ఐబీఎస్, అల్సర్ వంటి సమస్యల్లో ఏదో ఒకటి ఉందని చెబుతున్నారు. నిజానికి ఈ సమస్యలు చేజేతుల్లా కొనితెచ్చుకున్నవే. అయితే లక్షణాలు తగ్గే విధంగా కాకుండా, వ్యాధి మూలకారణాన్ని తొలగించే విధంగా చికిత్స ఉన్నప్పుడే శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి జీర్ణసంబంధ సమస్యలకు కారణమవుతున్నాయి. జీర్ణ సంబంధ సమస్యలలో సాధారణంగా కనిపించే లక్షణాలు అజీర్తి, గ్యాస్, తేన్పులు, కడుపు నొప్పి, కడుపులో మంట, మలబద్దకం, విరేచనాలు. ఒక్కోసారి మలంలో రక్తం, తీవ్రమైన కడుపునొప్పి, మలబద్దకం, బరువు తగ్గటం, ఛాతీలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాలేయం, పిత్తాశయం, క్లోమగ్రంథి పనితీరు వల్ల కూడా జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతుంటాయి. కొందరిలో రోజువారి విరేచనాలు సాఫీగా జరగవు. దీనినే మలబద్దకం అంటారు. విరేచనం అయిన తరువాత కూడా మళ్లీ వెళ్లాలనిపించడం మలబద్దకం లక్షణమే.

7 Amazing Foods To Improve Your Digestion

కొందరిలో అన్నం తినకపోతే కడుపులో మంట, తింటే అజీర్తి వేధిస్తుంటాయి. మరికొందరిలో మలబద్దకం సమస్య ఏళ్ల పర్యంతం ఉంటుంది. ఇవి మొదట్లో చిన్న సమస్యలుగానే అనిపించినా నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారతాయి. అయితే వీటిని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు. జీర్తిని నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా అజీర్తి సమస్యలను నివారించుకోవచ్చు. మరి జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ....

ఆపిల్స్ :

ఆపిల్స్ :

ఇది అద్భుతమైన రుచిని కలిగి ఉండటమే కాదు, ఇది బౌల్ మూమెంట్ కు సంబంధించిన అన్ని రకాల ఆరోగ్య సమస్యలను నివారించడంల అద్భుతంగా సహాయపడుతుంది. ఇందులో కరిగే గుణాలు మరియు కరగని గుణాలు రెండు ఉన్నాయి. ఆపిల్స్ లోని సెల్యులోజ్ బౌల్ మూమెంట్ సక్రమంగా జరిగేలా చేసి,మలబద్దకాన్ని నివారిస్తుంది.

బీట్ రూట్:

బీట్ రూట్:

జీర్ణ సమస్య కడుపు ఉబ్బరం, మలబద్దకం, కడుపు నొప్పి , వంటి సమస్యలనుండి ఉపశమనం పొందడానికి బీట్ రూట్ బాగా సహాయపడుతుంది. బీట్ రూట్ లోని మెగ్నీషియ, ఫైబర్ మరియు పొటాషియం లు ఆరోగ్యకరమైన జీర్ణక్రియను అందిస్తుంది. ఇది అసిడిటిని తగ్గిస్తుంది.

పుదీనా :

పుదీనా :

పుదీనా నమలడం ద్వారా శ్వాస చాలా స్వచ్చంగా తాజాగా ఉంటుంది. పుదీనాలోని యాంటీ ఇన్ఫ్లమేటర్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది. కడుపు సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, పుదీనా ఆకులను సలాడ్స్, సూప్స్ లో జోడించి తీసుకోవాలి . అలాగే కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో పిప్పర్ మెంట్ ఆయిల్ వేసి త్రాగాలి . ఇలా చేయడం వల్ల ప్రేగుల్లోని చెత్తను బయటకు నెట్టివేయబడుతుంది.

అల్లం:

అల్లం:

చాలా పాతకాలపు మసాలా దినుసు అల్లం. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది సరిగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరి మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలను వికారం, గ్యాస్, కడుపు ఉబ్బరం నివారిస్తుంది.కాబట్టి, అల్లం టీని రెగ్యులర్ గా తీసుకొని సమస్యను నుండి బయటపడండి.

అరటి పండ్లు

అరటి పండ్లు

జీర్ణక్రియను మెరుగుపరుచుకోవడానికి అరటిపండు కూడా ఒక అద్భుతమైన ఆహారం. ఇది డయేరియా మరియు రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు చికిత్సనందిస్తుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఓట్స్

ఓట్స్

ఓట్స్ లో సోలబుల్ మరియు ఇన్ సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతే కాదు ఇందులో వివిధ రకాల మినిరల్స్ మరియు విటమిన్స్ ఇ పుష్కలంగా ఉంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఓట్స్ చాలా మంచిది. అంతే కాదు పొట్ట ఆరోగ్యం మరియు మలబద్దకాన్ని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బొప్పాయి:

బొప్పాయి:

మీరు తిన్న ఆహారం 24గంటల్లో జీర్ణం అవ్వడాినకి పచ్చిబొప్పాయి గ్రేట్ గా సహాయపడుతుంది . ఈ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది లూజ్ మోషన్ అయినప్పుడు శరీరానికి కావల్సినంత శక్తిని అందిస్తుంది. మరియు బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ గా విచ్చిన్నమై, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

English summary

7 Amazing Foods To Improve Your Digestion

Improper digestion is a common problem we have been for atleast once in our lives. Imperfect digestion occurs due to poor eating habits, viral infections, certain medications and some other reasons.
Desktop Bottom Promotion