For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హార్ట్ బ్లాకేజ్ ను నివారించే 7 ఆయుర్వేదిక్ రెమెడీస్...

|

చాలా తక్కువ కాలంలో వాతావరణం, ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో చాలా వేగంగా మార్పులు చోటు చేసుకున్నాయి. పుర్వకాంలో మనుష్యలు చాలా ఆరోగ్యంగా ఉండే వారు . వారి జీవన శైలి ఆరోగ్యకరంగా ఉండేది. ఎలాంటి అనారోగ్య సమస్యలను త్వరగా చూసేవారు కాదు.

జీవనశైలిలో ఇలా సెడన్ గా వచ్చని మార్పుల వల్ల , ఒత్తిడి, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామలేమి, మొదలగు కారణాల వల్ల వివిధ రకాల లైఫ్ స్టైల్ సంబంధిత సమస్యలెన్నో మనుష్యులను చుట్టిముడుతున్నాయి. వీటి వల్ల అనారోగ్యపాలవుతున్నారు. చిన్న వయస్సులోని పెద్ద పెద్ద వ్యాధులను ఎదుర్కుంటూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు.

ముఖ్యంగా ఈ మోడ్రన్ యుగంలో అతి చిన్న వయస్సులోనే హై కొలెస్ట్రాల్, డయాబెటిస్, హార్ట్ కు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. మోడ్రన్ లైఫ్ స్టైల్ వల్ల అతి చిన్న వయస్సులోనే మరణాల రేటు పెరుగుతన్నది. ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్ మితిమీరి తినడం మరియు వ్యాయామం లేకపోవడం వల్ల చాలా మంది చిన్న వయస్సులో హై కొలెస్ట్రాల్ కు గురిఅవుతున్నారు . బాడీలో కొలెస్ట్రాల్ అధికమవ్వడంతో హార్ట్ లో బ్లాకేజ్ లు ఎక్కువ అవుతాయి . ప్రస్తుత కాలంలో హైకొలెస్ట్రాల్ ఉండటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు . కొలెస్ట్రాల్లో రెండు రకాలున్నాయి. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండవది చెడు కొలెస్ట్రాల్.

శరీరంలో కొలెస్ట్రాల్ పరిమితంగా ఉండటం వల్ల విటమిన్ డి ఉత్పత్తికి, కణజాలాల పెరుగుదలకు, కొన్ని రకాల ఫ్యాట్ ను గ్రహించే యాసిడ్స్ ఉత్పత్తికి కొలెస్ట్రాల్ చాలా అవసరమవుతుంది .

ఆయుర్వేదం ప్రకారం, ఎక్కువ స్ట్రెస్, పోషకాహార లోపం, వ్యాయామ లేమి మొదలగునవి శరీరంలో టాక్సిన్స్ ఎక్కువగా పెరిగిపోతాయి . అలాగే ధమనుల్లో కూడా టాక్సిన్స్ చేరడం వల్ల హార్ట్ బ్లాకేజ్ అవుతుంది. ఆయుర్వేదం ప్రకారం శరీరంలో టాక్సిన్స్ ను క్లియర్ చేయడం(తొలగించుకోవడం)వల్ల హార్ట్ ఆరోగ్యంగా చురుకుగా పనిచేస్తుంది.

శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి హార్ట్ హెల్తీగా పనిచేయాలంటే ఆయర్వేదంలో కొన్ని నేచురల్ హెర్బ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి .ఈ నేచురల్ హెర్బ్స్ ధమనుల్లో చేరిన టాక్సిన్స్ తొలగించడానికి ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. దాంతో బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది . కాబట్టి , హార్ట్ సమస్యలను నివారించుకోవడానికి అలోపతి మందులు తీసుకుంటున్నట్లైతే వీటికి బదులుగా ఆయుర్వేద హెర్బ్స్ ను గ్రేట్ గా సహాయపడుతాయి. అంతే కాదు వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. టాక్సిన్స్ వల్ల హార్ట్ బ్లాకేజ్ సమస్యను నివారించుకోవడానికి 7 ఆయుర్వేదిక్ రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

1. అర్జున ట్రీ బెరడు:

1. అర్జున ట్రీ బెరడు:

ఆయుర్వేదం ప్రకారం అర్జున చెట్టు బెరడు హార్ట్ సమస్యలను గ్రేట్ గా నివారిస్తుంది. ముఖ్యంగా హై కొలెస్ట్రాల్, హైబిపి, ధమనుల్లో బ్లాకేజ్, కరోనరీ ఆర్టరీ వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచి, హార్ట్ ను బలోపేతం చేస్తుంది. ఈ అర్జున హెర్బ్ ను ఉపయోగించడం వల్ల ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ ను నివారించి, గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇందులోఉండే నేచురల్ ఆక్సిడైజింగ్ లక్షణాలు హార్ట్ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

2. దాల్చిన చెక్క:

2. దాల్చిన చెక్క:

మన ఇండియన్ వంటలకు మంచి సువాసన, రుచిని అందివ్వడంలో దాల్చిన చెక్కకు ప్రత్యేక స్థానం ఉంది. దాల్చిన చెక్కలో వివిధ రకాల ఆయుర్వేదిక్ బెనిఫిట్స్ ఉన్నాయి . హార్ట్ బ్లాకేజ్ ను నివారించుకోవడంలో ఇది ఎఫెక్టివ్ ఆయుర్వేదిక్ రెమెడీ. ఇందులో ఉండే ఆక్సిడైజింగ్ లక్షణాల వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తొలగించి, గుడ్ కొలెస్ట్రాల్ ను అందిస్తుంది. దాంతో హార్ట్ సమస్యలను దూరం చేసుకోవచ్చు. రెగ్యులర్ డైట్ లో దాల్చిన చెక్క చేర్చడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంతో పాటు వ్యాస్కులర్ సిస్టమ్ ను మెరుగుపరుస్తుంది.

3. ఫ్లాక్స్ సీడ్స్:

3. ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్ లో ఓమేగా 3ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాడీలోని టాక్సిన్స్ ను తొలగించి, ధమనుల్లో కూడా క్లియర్ చేస్తుంది . దాంతో హార్ట్ హెల్తీగా ఉంటుంది.

4. వెల్లుల్లి:

4. వెల్లుల్లి:

శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి అవసరమయ్యే లక్షణాలు వెల్లుల్లిలో అధికంగా ఉన్నాయి. హార్ట్ ను సురక్షితంగా ఉంచుతుంది. వెల్లుల్లి రెబ్బలను ప్రతి రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

5. యాలకలు:

5. యాలకలు:

మసాలాదినుసుల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని క్వీన్ ఆఫ్ స్పైసీస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వంటలకు వెంటనే మంచి సువాసన అందిస్తుంది. ఆరోమా వాసనతో పాటు, అద్భుతమైన రుచిని అందిస్తుంది . హార్ట్ సంబంధించిన సమస్యలను నివారించుకోవడంలో ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

6. రెడ్ చిల్లీ పౌడర్:

6. రెడ్ చిల్లీ పౌడర్:

మీరు నమ్ముతారో నమ్మరో కానీ, రెడ్ చిల్లీలో అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులోని కులినరీ బెనిఫిట్స్ వల్ల పూర్వకాలం నుండే ఇది ఆయుర్వేద రెమెడీస్ లో బాగా పాపులర్ . అయితే కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలి, బ్లడ్ వెజల్స్ లో ప్లాక్యుని తగ్గిస్తుంది.

7. అశ్వగంధ:

7. అశ్వగంధ:

కార్డియిక్ సమస్యలను నివారించుకోవడంలో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేచురల్ హెర్బ్ లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ టూమర్, హీమోపొయిటిక్ మరియు రిజువేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. హార్ట్ మజిల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతాయి.

English summary

7 Ayurvedic Remedies To Cure Heart Blockage

Ayurveda shows that high stress, poor dietary habit, no exercise, etc, leads to an accumulation of ama (toxin) in the body. This ama gets accumulated in the arteries, leading to heart blockage. Ayurveda believes in cleansing your body from the ama to restore proper functioning of the heart.
Story first published:Tuesday, June 7, 2016, 16:39 [IST]
Desktop Bottom Promotion