For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ లో పొట్టనొప్పి, తిమ్మెర్లను నివారించే 7 హోం రెమెడీస్

By Super
|

రుతుక్రమం లేదా పీరియడ్స్ ప్రతి ఒక్క మహిళ జీవితంలో వచ్చే ఒక సహజమైన మార్పు. దీన్నే రుతుచక్రం అని కూడా అంటారు. మహిళలు నెలకొకసారి పీరియడ్స్ వస్తుంటాయి. శరీరంలో అంతర్గతంగా జరిగే మార్పుల్లో ఇది ఒకటి. బ్లీడింగ్ అవ్వడమంటే ఇది ఒక ఇబ్బందికలిగించే, అసౌకర్యానికి గురిచేసే ఒక శారీరిక మార్పు. ఈ మార్పు వచ్చినప్పడు శరీరంలో ముఖ్యంగా పొట్ట ఉదరంలో నొప్పి పుడుతుంది, ఇది క్రమంగా 5రోజుల వరకూ అలాగే ఉంటుంది.దీన్ని మెనుష్ట్ర్యువల్ క్రాంప్ అని అంటారు.

రుతుక్రమంలో వచ్చే తిమ్మెర్ల ఒక లాంటి చిన్న పాటి నొప్పిని కలిగిస్తుంది. అది క్రమంగా పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. కానీ మహిళలకు పనులకు మాత్రం అంతరాయం కలిగిస్తుంది .

నిజానికి మహిళ పీరియడ్స్ సమయంలో వచ్చే ఇటువంటి నొప్పులు, క్రాంప్స్ కు ఎక్కువగా భయపడుతుంటారు . పొట్ట ఉదరంలో వచ్చే నొప్పి తట్టుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది.

ఇటువంటి నొప్పిని తట్టుకోవడానికి లేదా నివారించుకోవడానికి కొన్ని మందులను తీసుకొన్నా , అవి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈ 5రోజుల పీరియడ్స్ లో ఉండే పొట్టనొప్పికి తోడుగా ఇతర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే , ఇక ఆపరిస్థితి ఊహించుకోలేము.

కాబట్టి, ఆరోగ్యానికి హాని కలిగించే నొప్పి నివారణ మందులు ఎందుకు తీసుకోవాలి? వీటి స్థానంలో నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మరియు ఇవి చాలా సింపుల్ గా మరియు చాలా ఎపెక్టివ్ గా నొప్పిని నివారిస్తాయి. పీరియడ్ క్రాంప్స్ ను నివారించే కొన్ని నేచురల్ రెమెడీస్ ఈ క్రింది విధంగా..

రాస్బెర్రీ లీఫ్ టీ:

రాస్బెర్రీ లీఫ్ టీ:

కొన్ని వేల సంవత్సరాల నుండి వివిధ రకాల వ్యాధులను నివారించుకోవడంలో రాస్బెర్రీ టీని ఔషదంగా తీసుకుంటున్నారు. చాలా మంది మహిళలు పీరియడ్స్ సమయంలో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. దీన్ని తీసుకోవడం వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యలు, కడుపుబ్బరం , క్రాంప్స్ నివారించబడుతాయి . వేడి నీటిలో రాస్బెర్రీ ఆకులు వేసి బాగా మిరిగించాలి, తర్వాత వడగట్టి, ఈ టీని రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ధనియాలు:

ధనియాలు:

ధనియాల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే వివిధ రకాల ఔషధగుణాలున్నాయి. పీరియడ్ క్రాంప్స్ నుండి ఉపశమనం పొందాలంటే , ఒక కప్పు నీటిని మరిగించి అందులో ఒక టీస్పూన్ ధనియాలు వేసి ఉడికించాలి. కొంత సేపు అలాగే కలుపుతుండాలి. తర్వాత ఈ నీటిని వడగట్టి అందులో ఒక చెంచా తేనె మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

అల్లం టీ:

అల్లం టీ:

ఇది ఒక నేచురల్ ఎఫెక్టివ్ హోం రెమెడీ. పీరియడ్స్ లో వచ్చే నొప్పిని చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఒక కప్పు వేడి నీలిటో రెండు టేబుల్ స్పూన్ల అల్లం తురుము వేసి బాగా మరిగించాలి. తర్వత ఈ నీటిని వడగట్టి, రోజులోఅప్పుడప్పుడు తాగుతుండటం వల్ల పీరియడ్ క్రాంప్స్ క్రమంగా తగ్గిపోతాయి. అల్లం ఒక గొప్ప నేచురల్ హోం రెమెడీ , అయితే ఇందులో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి .ఇతర ఆరోగ్య సమస్యలున్నప్పడు అల్లం పరిమాణం తగ్గించుకోవాలి.

అలోవెర జ్యూస్ మరియు తేనె:

అలోవెర జ్యూస్ మరియు తేనె:

అలోవెర ఒక ఔషధ మొక్క . టేస్ట్ గా తయారుచేసుకోవడం సులభం . అలోవెర జ్యూస్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి రోజూ తాగాలి. పీరియడ్ క్రాంప్స్ ను తొలగిస్తుంది.

సినామిన్ టీ:

సినామిన్ టీ:

పీరియడ్స్ క్రాంప్స్ నివారించుకోవడంలో మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ సినామిన్ టీ. ఇందులో ఉండే నయం చేసే గుణాలు మరియు స్మూతింగ్ లక్షణాల వల్ల ఈ డ్రింక్ బాగా పాపులర్ అయ్యింది. ఈ టీని తయారుచేయడం సులభం . ఒక కప్పువేడి నీటిలో దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్కపొడి వేయాలి 5నిముషాలు అలాగే వేడి చేసి, తర్వాత వడగట్టి, తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

పార్స్లే జ్యూస్:

పార్స్లే జ్యూస్:

పార్ల్సే ఒక మూలిక , ఇందులో ఔషధగుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది పీరియడ్ క్రాంప్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఈ జ్యూస్ తయారుచేసుకోవడానికి క్యారెట్ కీరదోస, బీట్ రూట్ తీసుకోవాలి. వీటన్నింటి మిక్సీలో పే్ట్ చేసి , జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల స్టొమక్ క్రాంప్ నివారించబడుతుంది.

తులసి టీ:

తులసి టీ:

తులసి టీని ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ గా తీసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చాలా సింపుల్ గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కలిగించదు. ఒక కప్పు నీటిలో తులసి ఆకుల ను వేసి బాయిల్ చేసి రోజులో రెండు మూడు సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక:

గమనిక:

ఈ నేచురల్ రెమెడీస్ పీరియడ్ క్రాంప్స్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది . ఇవి చాలా సింపుల్ హోం రెమెడీస్, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటితో పాటు, ఎక్కువ నీరు తాగాలి మరియు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.

English summary

7 DIY Home Remedies To Curb Period Stomach Cramps Instantly

Every woman is well aware of the wrath of the menstrual cycle that she faces on a monthly basis. Dealing with the discomfort of bleeding in itself is a daunting task, let alone the cramps that occur in the lower abdomen during those 5 days. These menstrual cramps could range from dull and annoying to severe and extreme. It could lower the activity level of a woman to a great extent.
Story first published: Monday, May 23, 2016, 17:45 [IST]
Desktop Bottom Promotion