For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లంగ్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన భయంకరమైన ఫ్యాక్ట్స్..

By Swathi
|

లంగ్ క్యాన్సర్ అనేది ఇండియాలో రెండో స్థానంలో ఉంది. లంగ్ క్యాన్సర్ బారిన మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ పడుతున్నారు. ఎక్కువగా స్మోకింగ్ దీనికి కారణమవుతోంది. ఇండియాలో లంగ్ క్యాన్సర్ బారిన పడుతున్నవాళ్లు చాలా ఎక్కువ అవుతున్నారు. స్మోకింగ్ ని ప్రస్తుత కాలంలో చిన్న వయసులోని అలవాటు చేసుకుంటున్నారు. ఇది హానికరమని తెలిసినా కూడా.. దీనికి బానిస అవుతున్నారు. దీనివల్ల మీతోపాటు మీ కుటుంబ సభ్యులకు కూడా హానికరమని గుర్తించడం చాలా అవసరం.

వార్నింగ్: మహిళలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని క్యాన్సర్ లక్షణాలు వార్నింగ్: మహిళలు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని క్యాన్సర్ లక్షణాలు

కొంతమంది స్మోకింగ్ అలవాటు ఉన్నా మానేస్తారు. మరికొందరు మానేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ రోజూ ప్యాకుల కొద్దీ సిగరెట్లు కాల్చేస్తుంటారు. మరికొందరికి ఈ అలవాటు కొన్ని ఏళ్లుగా ఉంటుంది. కానీ ఇది చాలా హానికరమని అధ్యయనాలు చెబుతున్నాయి. మీరు స్మోకింగ్ మొదలుపెట్టిన వయసు, ఎన్ని పొగాకు ఉత్పత్తులు తాగుతున్నారు, ఎంత కాలం తాగారు అనేదాన్ని బట్టి కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది.

గర్భాశయ కాన్సర్ లక్షణాలు, చికిత్స ..! గర్భాశయ కాన్సర్ లక్షణాలు, చికిత్స ..!

లంగ్ క్యాన్సర్ ను మొదట్లోనే గుర్తిస్తే.. ఐదేళ్లు అంతకంటే ఎక్కువ బతకడానికి ఛాన్స్ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇతర క్యాన్సర్ల కంటే లంగ్ క్యాన్సర్ ఎక్కువ మందిని చంపేస్తోంది. దీన్ని ఎర్లీ స్టేజ్ లో గుర్తించడం చాలా కష్టమైన పని. స్మోకింగ్ తో పాటు, డైట్ వంటి రకరకాల కారణాలు లంగ్ క్యాన్సర్ కి కారణమవుతాయని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. అయితే లంగ్ క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరూ కొన్ని వాస్తవాలు కంపల్సరీ తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దామాం..

ప్రధాన కారణం

ప్రధాన కారణం

లంగ్ క్యాన్సర్ కి ప్రధాన కారణం స్మోకింగ్. 87 శాతం లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ తో సంబంధం కలిగి ఉంటోందని తేల్చారు. ఎంతకాలం నుంచి స్మోకింగ్ చేస్తున్నారు, ఏ వయసులో వాళ్లు స్మోకింగ్ చేయడం మొదలుపెట్టారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే రోజుకి ఎన్ని పొగాకు ఉత్పత్తులు తీసుకుంటున్నారు అనేది కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ ని సూచిస్తుంది.

పొగ పీల్చేవాళ్లకు

పొగ పీల్చేవాళ్లకు

లంగ్ క్యాన్సర్ స్మోకింగ్ చేసేవాళ్లకు పెద్ద రిస్క్, అలాగే.. ఆ పొగ పీల్చేవాళ్లకు అంటే.. స్మోకింగ్ చేసేవాళ్ల పక్కన ఉండేవాళ్లకు కూడా.. లంగ్ క్యాన్సర్ రిస్క్ ఉంటుంది. దాదాపు 10 నుంచి 15 శాతం లంగ్ క్యాన్సర్ కేసులు నాన్ స్మోకర్స్ పై నమోదు అవుతున్నాయి. అలాగే ఈ బాధితుల్లో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు.

రెండు రకాలు

రెండు రకాలు

85 నుంచి 90 శాతం లంగ్ క్యాన్సర్స్ నాన్ స్మాల్ సెల్ టైప్. ఈ క్యాన్సర్ నిదానంగా పెరుగుతుంది. ఇతర అవయవాలకు వ్యాపించదు. రెండో రకం స్మాల్ సెల్ కార్కినోమా క్యాన్సర్. ఇది చాలా త్వరగా డెవలప్ అవుతుంది. ఇది ఇతర అవయవాలకు స్ప్రెడ్ అవుతుంది.

సంకేతాలు

సంకేతాలు

లంగ్ క్యాన్సర్ లక్షణాలను మగవాళ్లు, ఆడవాళ్లు ఇద్దరూ తెలుసుకోవాలి. రెగ్యులర్ గా దగ్గడం, శ్వాస నెమ్మదిగా ఉండటం, ఆకలి లేకపోడం, బరువు తగ్గడం, దగ్గుతో పాటు రక్తం పడటం ఇవన్నీ లంగ్ క్యాన్సర్ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు గమనించిన వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా అవసరం.

సీటీ స్క్రీన్

సీటీ స్క్రీన్

లంగ్ క్యాన్సర్ గుర్తించడం చాలా కష్టం. కానీ స్క్రీనింగ్ టెస్ట్ లు దీన్ని గుర్తిస్తాయి. సీటీ స్క్రీనింగ్ ద్వారా లంగ్స్ లో ట్యూమర్స్ ఉన్నాయా అనేది మొదటి దశలోనే గుర్తించవచ్చని చెబుతున్నారు. అయితే సీటీ స్క్రీనింగ్ టెస్ట్ కి 55 నుంచి 74 వయసు మధ్యలో ఉండే వాళ్లకు మాత్రమే నిర్వహిస్తారు. అలాగే రోజు ఒక ప్యాక్ చొప్పున 30 ఏళ్లు తాగిన వాళ్లు, అలాగే 15 ఏళ్ల తర్వాత మానేసినవాళ్లకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు.

థెరపీలు

థెరపీలు

టెక్నాలజీ పెరగడం, అడ్వాన్డ్స్ మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ లంగ్ క్యాన్సర్ కి అందుబాటులో ఉన్నాయి. అయితే క్యాన్సర్ టైప్, ట్యూమర్ లొకేషన్, స్టేజ్ ని బట్టి ఈ ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్స్ సర్జరీ, కీమో థెరపీ, టేడియేషన్ థెరపీ లేదా రెండూ నిర్వహిస్తారు.

మానేయడం

మానేయడం

స్మోకింగ్ హానికరమని ప్యాక్ పై రాసి ఉన్నా కూడా.. ప్రతి ఒక్కరూ దీనికి బానిసలవుతూనే ఉన్నారు. స్మోక్ చేసేవాళ్లు మానేయాలని నిర్ణయించుకుంటే.. కొన్ని నెలలు, కొన్ని వారాల పాటు హార్ట్ ఎటాక్, లంగ్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని.. ఎలాంటి ప్రయోజనం లేని స్మోకింగ్ మానేయండి. మీతోపాటు, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

English summary

7 Facts You Must Know About Lung Cancer

7 Facts You Must Know About Lung Cancer. Lung cancer is the second most common cancer in both men and women. With increasing prevalence of smoking, lung cancer has reached epidemic proportions in India.
Desktop Bottom Promotion