For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అధిక బరువు ఉండటం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యలు

By Swathi
|

అధిక బరువు, ఒబేసిటీ అనేది ఇప్పుడు చాలా కామన్ గా వినిపిస్తున్న సమస్యలు. పదేళ్లుగా వార్తల్లో విహారం చేస్తోంది ఒబేసిటీ సమస్య. రెగ్యులర్ డైట్ లో ఎక్కువ క్యాలరీలు తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం కారణంగా చాలా మంది ఒబేసిటీ బారిన పడుతున్నారు. అయితే ఇది అత్యంత భయంకరమైన పరిణామంగా పరిగణిస్తున్నారు నిపుణులు.

7 Health Risks of Being Overweight

ఒబేసిటీని బీఎమ్ఐ గా చెబుతారు. ఇది ఒక మనిషి ఎత్తు, బరువు ఆధారంగా కొలుస్తారు. అయితే ఈ బీఎమ్ఐ స్థాయి ఎక్కువగా ఉంటే.. ఒబేసిటీ ఉన్నట్టు గుర్తించాలి. అలాగే.. అన్ హెల్తీ డైట్, తక్కువ నిద్ర, అసంబద్ధ జీవనశైలి, వారసత్వం, వయసు, హార్మోనల్ చేంజెస్, వంటివన్నీ ఒబేసిటీకి కారణమవుతాయి.

అయితే ఒబేసిటీ కేవలం అధిక బరువుకి సంబంధించినది మాత్రమే కాదు. దీనివల్ల.. అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో అనేక అవయవాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల.. అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

టైప్ 2 డయాబెటిస్

టైప్ 2 డయాబెటిస్

ఒబేసిటీ టైప్ టు డయాబెటిస్ రిస్క్ పెరగడానికి కారణమవుతుంది. విదేశాల్లో ఎక్కువగా అధిక బరువు ఉన్నవాళ్లలోనే డయాబెటిస్ సమస్య కనిపిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. దీని కారణంగా హార్ట్ డిసీజ్, స్ట్రోక్స్, కిడ్నీ డిసీజ్, కంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

హై బ్లడ్ ప్రెజర్

హై బ్లడ్ ప్రెజర్

ఒబేసిటీ కారణంగా హైపర్ టెన్షన్ రిస్క్ ఉంది. ఉప్పు ఎక్కువగా తినడం, తాగడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ పెరుగుతుంది. కాబట్టి వెంటనే బరువు తగ్గడం చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

ఒబేసిటీతో బాధపడేవాళ్లకు హై కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒబేసిటీ కాకుండా, స్మోకింగ్, డ్రింకింగ్, వయసు పెరగడం, వారసత్వం, డయాబెటిస్, బ్లడ్ ప్రెజర్ వంటి అనారోగ్య సమస్యలు.. హై కొలెస్ట్రాల్ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కాబట్టి వ్యాయామం ద్వారా బరువు తగ్గితే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

గుండె సంబంధిత సమస్యలు

గుండె సంబంధిత సమస్యలు

బీఎమ్ఐ స్థాయి పెరిగితే.. గుండె వ్యాధులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒబేసిటీ కారణంగా గుండెకు రక్త సరఫరా సక్రమంగా అందకుండా.. ప్లాక్యూ ఏర్పడుతుంది. ఇది బ్లడ్ ఫ్లోని అడ్డుకుంటుంది.

దీనివల్ల స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది.

క్యాన్సర్

క్యాన్సర్

ఒబేసిటీ క్యాన్సర్ రిస్క్ ని పెంచుతుంది. శరీరంలో రకరకాల క్యాన్సర్ కణాలు ఏర్పడటానికి ఒబేసిటీ కారణమవుతుంది. బ్రెస్ట్, కొలన్, రెక్టమ్, యుట్రస్, గాల్ బ్లాడర్, కిడ్నీ క్యాన్సర్లకు ఒబేసిటీ వ్యక్తుల్లో ఎక్కువ ఛాన్స్ ఉంది.

కాలేయ వ్యాధులు

కాలేయ వ్యాధులు

ఒబేసిటీతో బాధపడేవాళ్లలో ఫ్యాటీ లివర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాలేయంలో ఇన్ల్ఫమేషన్, స్కార్రింగ్ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో లివర్ డ్యామేజ్ కి కూడా.. ఒబేసిటీ కారణమవుతుందని స్టడీస్ చెబుతున్నాయి.

గాల్ బ్లాడర్

గాల్ బ్లాడర్

అధిక బరువు ఉన్న వ్యక్తుల్లో గాల్ బ్లాడర్, గాల్ స్టోన్స్ అనేది చాలా సాధారణ సమస్య. గాల్ స్టోన్స్ ఏర్పడటానికి కొలెస్ట్రాల్ ప్రధాన కారణం. సాధారణ స్థాయి కంటే.. ఎక్కువ బీఎమ్ఐ కలిగిన వాళ్లలో గాల్ స్టోన్స్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బరువు తగ్గడం ద్వారా గాల్ బ్లాడర్ సమస్యలు నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

English summary

7 Health Risks of Being Overweight

7 Health Risks of Being Overweight. Some of the reasons for obesity are an unhealthy diet, lack of sleep, inactive lifestyle, genetics, age, pregnancy and hormonal changes in the body.
Desktop Bottom Promotion