For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రాత్రుల్లో లెగ్ క్రాంప్స్ నివారించే 7 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

మజిల్ క్రాంప్. నరాలు పట్టేయడం. ఇది ఒక సాధారణ సమస్య. సాధారణంగా ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ బాధ మాత్రం చాలా ఎక్కువే. రాత్రి సమయంలో నిద్రలో ఉన్నట్టుండి పిక్కలు, కండరాలు పట్టేయడం చాలామందికి బాధాకరమైన అనుభవం. మండుటెండలో చెమట పట్టేలా కష్టపడుతున్నప్పుడు ఉన్నట్లుండి తొడ కండరాలు పట్టేసి విపరీతమైన బాధతో కుంటుతూ నడిచారా? బాగా చలిలో వేళ్లు కొంకర్లు పోయినట్లుగా అయిపోయి మీరెంత ప్రయత్నించినా నొప్పితో అవి అలాగే బిగుసుకుపోయి అతి తీవ్రమైన బాధను అనుభవించారా? పై అనుభవాల్లో ఏదో ఒకటి మీకు ఎదురయ్యే ఉంటుంది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలోనైనా అనుభవించే బాధ ఇది. దీనికి గల కారణాలు, నివారణ, చికిత్స వంటి అనేక అంశాలను తెలుసుకుందాం.

రోజంతా పనిచేసి, అలసిపోయినప్పుడు, లేదా ఎక్కువ సమయం నిల్చోని పనిచేయడం వల్ల రాత్రుల్లో కాళ్ళు పట్టేస్తుంటాయి. ఇంకా శరీరంలో విటమిన్ డి, క్యాల్షియం, మెగ్నీషియం, మరియు పొటాషియంలు లోపించడం వల్ల కూడా కాళ్ళు పట్టేస్తుంటాయి. వ్యాయామం, ప్రెగ్నెన్సీ , డీహైడ్రేషన్ వంటి కారణల వల్ల కూడా లెగ్ క్రాంప్స్ కు గురి కావల్సి ఉంటుంది.

కాబట్టి, లెగ్ క్రాంప్స్ కు కారణాలు ఏవైనా రెగ్యులర్ డైట్ లో సరైన న్యూట్రీషియన్ ఫుడ్స్ చేర్చుకోవడం వల్ల నొప్పిని నివారించుకోవచ్చు. ఇది అండర్ లేయింగ్ హెల్త్ సమస్య లెగ్ క్రాంప్ తగ్గిస్తుంది. లెగ్ క్రాంప్స్ నివారించుకోవడానికి కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అండర్ లేయింగ్ సమస్యతై సింపుల్ టిప్స్ తో నివారించుకోవచ్చు. అయితే నొప్పి తీవ్రంగా, లెగ్ క్రాంప్ , మజిల్ వీక్ నెస్ ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. లెగ్ క్రాంప్ నివారించుకోవడానికి కొన్ని బెస్ట్ టిప్స్ ఈ క్రింది విధంగా...

1. గోరువెచ్చని నీటితో స్నానం లేదా హాట్ ప్యాడ్ :

1. గోరువెచ్చని నీటితో స్నానం లేదా హాట్ ప్యాడ్ :

లెగ్ క్రాంప్స్ ఉన్నప్పుడు, హాట్ వాటర్ తో కాపడం పెట్టుకోవడం లేదా, వేడి నీళ్ళు తో స్నానం చేయడం వల్ల లెగ్ క్రాంప్స్ నుండి ఉపశమనం కలుగుతుంది.

2. క్యాల్షియం రిచ్ ఫుడ్స్ :

2. క్యాల్షియం రిచ్ ఫుడ్స్ :

పాలు, డైరీ ప్రొడక్ట్స్ మరియు క్యాల్షియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. క్యాల్షియం సప్లిమెంట్ కూడా తీసుకోవచ్చు. అలాగే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగాలి.

3. చమోమెలీ టీ:

3. చమోమెలీ టీ:

3, 4 కప్పుల చమోమెలీ టీ ని రెండు వారాలు క్రమం తప్పకుండా తాగుతుంటే, లెగ్ క్రాంప్స్ ఉండవు. లెగ్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి, అమినోయాసిడ్ గ్లిసిన్ స్పాసమ్ మరియు పెయిన్ తగ్గిస్తుంది.

4. టైట్ గా మారిన కండరాలకు సున్నితంగా మసాజ్ చేయాలి:

4. టైట్ గా మారిన కండరాలకు సున్నితంగా మసాజ్ చేయాలి:

టైట్ గా మారిన కండరాలకు మసాజ్ చేయడం, స్ట్రెచ్ చేయడం వల్ల కండరాలు వదులై నొప్పిని, క్రాంప్స్ ను తగ్గిస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. నొప్పి తగ్గిస్తుంది.

5. పొటాషియం, మెగ్నీషియం:

5. పొటాషియం, మెగ్నీషియం:

నట్స్, బీన్స్, బ్రెడ్, అరటిపండ్లు, ఆరెంజెస్ వంటి పొటాసియం, విటమిన్ సి, మెగ్నీషియం అధికంగా ఉండే ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

6. ఆవనూనె:

6. ఆవనూనె:

వంటలకు రెగ్యులర్ నూనెలకు బదులుగా ఆవనూనెను ఉపయోగించాలి. ఈ నూనెలో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది శరీరంలో కోల్పోయిన మినిరల్స్ తిరిగి పొందడానికి సహాయపడుతుంది. లెగ్ క్రాంప్స్ తగ్గిస్తుంది. ఆవాలు, ఆవనూనెతో తయారుచేసిన కొన్ని రకాల పికెల్స్ లో అసిటిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది లెగ్ క్రాంప్స్ తగ్గిస్తుంది.

7. అరటి పండ్లు:

7. అరటి పండ్లు:

అరటి పండ్లలో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అరటి పండ్లు రెగ్యులర్ గా తినడం వల్ల లెగ్ క్రాంప్స్ ఉండవు. రోజుకు ఒక బనాన తింటే రాత్రుల్లో లెగ్ క్రాంప్స్ ఉండవు.

English summary

7 Remedies For Leg Cramps At Night

Have you ever experienced leg cramps and pain at bedtime or during night? This is common thing that the muscles of your leg will get tightened and can pose no such health threat. They mostly occur in thighs, feet and calf muscles. This can be a very annoying condition and may disturb your sleep.
Story first published:Saturday, October 15, 2016, 13:43 [IST]
Desktop Bottom Promotion