For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏసీల వల్ల వచ్చే భయంకరమైన అనారోగ్య సమస్యలేంటో తెలుసా ?

By Swathi
|

ప్రస్తుతం ఏ ఆఫీస్ లో చూసినా.. ఏసీలు ఉంటాయి. ఇక బస్సులు, ఇంట్లోనూ, షాపింగ్ మాల్స్ లోనూ, థియేటర్లలోనూ ఏసీలే ఉంటాయి. చాలా వరకు అందరి ఆఫీసుల్లోనూ ఏసీ ఉంటుంది. ఇలా ఏసీలలో పనిచేవాళ్లు.. చాలా హ్యాపీగా ఫీలవుతారు. కానీ.. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు.

ఇంట్లోకూడా ఏసీ కావాలని చాలామంది కోరుకుంటారు. చాలా మంది వేయించుకుంటారు కూడా. కానీ.. ఇంట్లో ఏసీలు ఉంటే.. వాళ్లకు లగ్జరీ ఉందని ఫీలవుతారు. కానీ.. అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని తాజా అధ్యయనాలు తేల్చాయి. పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, సమ్మర్ వల్ల.. చాలా వేడిగా ఉంటోంది.

దీనివల్ల ప్రజలు..ఇళ్లలో ఏసీలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా ఆఫీసుల్లో సెంట్రలైజ్డ్ ఏసీలే ఉంటాయి. ఉద్యోగులకు కంఫర్టబుల్ గా ఉండటం కోసం ఇలా ఏసీలు ఇస్తారు. కానీ.. ఇవి ఆర్టిఫిషియల్ టెంపరేచర్ చేంజ్ ని ఇస్తాయి. ఇవి మనుషుల ఇమ్యునిటీపై తీవ్ర ప్రభావం చూపుతాయట.

ఎలాంటి కారణం లేకుండా తరచుగా మీరు అనారోగ్యానికి గురవుతున్నారంటే.. ఎక్కువ సమయం ఏసీల్లో ఉండటమే కారణం అయి ఉండవచ్చు. కాబట్టి.. ఏసీల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సైనస్

సైనస్

నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం ఎవరైతే.. ఏసీల్లో గడుపుతారో వాళ్లకు సైనస్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

తరచుగా అలసట

తరచుగా అలసట

ఏసీని తక్కువ టెంపరేచర్ లో పెట్టుకోవడం వల్ల... అంతర్గతంగా.. శరీరంలో ఎక్కువ హీట్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల తరచుగా అలసిపోతూ ఉంటారు.

వైరల్ ఇన్ఫెక్షన్స్

వైరల్ ఇన్ఫెక్షన్స్

ఎక్కువ సమయం ఏసీల్లో గడపటం వల్ల.. ఫ్రెష్ ఎయిర్ అందక.. వైరల్ ఇన్ఫెక్షన్స్ కి అవకాశం ఉంటుంది. ఫ్లూ, కామన్ కోల్డ్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

కళ్లు డ్రైగా మారడం

కళ్లు డ్రైగా మారడం

కళ్లు డ్రైగా మారడానికి ప్రధాన కారణం.. ఏసీల్లో ఎక్కువ సమయం గడపడం. కళ్లు పొడిబారడమే కాకుండా.. దురద, ఇరిటేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

చర్మం పొడిబారడం

చర్మం పొడిబారడం

ఆర్టిఫిషియల్ గా వాతావరణాన్ని చల్ల బరుచుకోవడం వల్ల చర్మ కణాలు డ్రైగా మారతాయి. దీనివల్ల డ్రై, రఫ్ స్కిన్ పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

అలర్జీ

అలర్జీ

చాలా సందర్భాల్లో ఏసీలను శుభ్రపరచడం మరిచిపోతూ ఉంటారు. ఇందులో ఉండే దుమ్ము, ధూళి.. గాలి ద్వారా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అలా దుమ్ము కూడా.. చేరి.. ఎలర్జీలకు కారణమవుతుంది.

ఇమ్యునిటీ తగ్గిపోవడానికి

ఇమ్యునిటీ తగ్గిపోవడానికి

ఎక్కువ సమయం ఏసీల్లో గడపడం వల్ల.. ఆ వాతావరణం ఇమ్యునిటీ తగ్గడానికి కారణమవుతుంది. చాలా తరచుగా సిక్ అవుతూ ఉంటే.. ఉపశమనం పొందడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది.

English summary

7 Shocking Effects Air Conditioning Can Have On Your Health!

7 Shocking Effects Air Conditioning Can Have On Your Health! Do you feel like you need an AC at your home too? If yes, then may be you should re-consider.
Desktop Bottom Promotion