For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరీ సన్నగా ఉన్నారా..?హెల్తీగా బరువు పెరగడానికి 7 సూపర్ ఫుడ్స్!

By Super Admin
|

ఓవర్ వెయిట్ లేదా అండర్ వెయిట్ ఈ రెండూ ఆరోగ్యానికి హానికరమే. ఐడియల్ గా చెప్పాలంటే, వయస్సుకు , పొడవుకు తగ్గ బరువు ఉండాలని చెబుతారు. దీన్నే బియంఐ ఇండెక్స్ అని కూడా పిలుస్తారు.

ఓవర్ వెయిట్ ఉండటం వల్ల ఆరోగ్యానికి హానికరమైన ప్రభావాలు చూపుతుంది. బరువు తక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చాలా మంది అనుకుంటారు. కానీ మరీ తక్కువ బరువు ఉన్నా కూడా ఆరోగ్యానికి హానికరమే..

ఈ సమస్య ను నివారించుకోవడానికి వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు . అయితే దాని వల్ల మరిన్ని హెల్త్ సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు. కాబట్టి, నేచురల్ గా, సురక్షితంగా, రిలయబుల్ గా ఎంపిక చేసుకోవడం సురక్షితమైనది.మరీ సన్నగా ఉన్నవారు, హెల్తీగా బరువు పెరగాలని కోరుకునే వారికోసం కొన్ని సూపర్ ఫుడ్స్ ను ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది.

ఈ సూపర్ ఫుడ్స్ లో ప్రోటీన్స్ మరియు హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల బరువు పెరగడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. వీటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటిసైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ సూపర్ ఫుడ్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్తీగా బరువు పెరగవచ్చు. బరువు తక్కువగా ఉన్నవారు, స్పెషలిస్ట్ ను కలిసి, మీరు అండర్ వెయిట్ తో ఉండటానికి గల కారణాలు తెలుసుకోవాలి.అందుకు వారి సూచించే సూచనలు గుర్తించుకుని , వాటిని పాటిస్తు, ఈ క్రింది సూపర్ ఫుడ్స్ ను కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

1. వాల్ నట్స్:

1. వాల్ నట్స్:

వాల్ నట్స్ లో హెల్తీ ఫ్యాట్స్ , డైటరీ ఫైబర్ మరియు ప్రోటీనులు ఎక్కువ.వాల్ నట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హెల్తీగా బరువు పెరుగుతారు. అదనంగా, ఇది బ్రెయిన్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది, శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

2. చీజ్:

2. చీజ్:

చీజ్ లో క్యాల్షియం, విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. ఒక స్లైస్ చీజ్ లో 100 కంటే ఎక్కువ క్యాలరీలున్నాయి. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో చీజ్ చేర్చుకుని టేస్ట్ బడ్స్ ఉత్తేజపరచడంతో పాటు, బరువు పెరగండి.

3. పాస్తా:

3. పాస్తా:

పాస్తా స్ట్రార్చ్ ఫుడ్, ఇది వెయిట్ గెయిన్ ప్రొగ్రామ్ ను స్పీడప్ చేస్తుంది. ఇందులో క్యాలరీలు ఎక్కువ. కాబట్టి బరువు పెరగాలని కోరుకునే వారు రెగ్యులర్ డైట్ లో పాస్తాను చేర్చుకోవాలి.

4. పీనట్ బట్టర్:

4. పీనట్ బట్టర్:

పీనట్ బటర్ లో ప్రోటీన్స్, పొటాషియంలు ఎక్కువ. ఇంకా హెల్తీ ప్యాట్ కలిగి ఉంటుంది. రెగ్యులర్ డైట్ లో పీనట్ బటర్ చేర్చడం వల్ల హెల్తీగా బరువు పెరగవచ్చు.

5. గుడ్డు:

5. గుడ్డు:

ముఖ్యంగా స్రాంబుల్డ్ ఎగ్ లో హెల్తీ ఫ్యాట్ మరియు హై క్యాలరీలున్నాయి. బ్రేక్ ఫాస్ట్ లో గుడ్డు చేర్చుకోవడం వల్ల బరువు పెరగడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది.

6. డార్క్ చాక్లెట్స్:

6. డార్క్ చాక్లెట్స్:

ఒక్క చాక్లెట్ తినడం వల్ల ఎక్కువ క్యాలరీలను పొందుతారు. రెగ్యులర్ డైట్ లో డార్క్ చాక్లెట్స్ చేర్చడం వల్ల బరువు పెరుగుతారు.

7. పెరుగు:

7. పెరుగు:

పెరుగు మరో సూపర్ ఫుడ్ , ఇది బరువు పెరగడంలో గ్రేట్ గా సహాపడుతుంది. ఇందులో పోషకవిలువలు కూడా ఎక్కువ .కాబట్టి, హెల్తీగా బరువు పెరగడానికి సహాయపడుతూ, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

English summary

7 Super foods That Can Help You Gain Weight

Overweight or underweight, both the states are extremely harmful. Ideal weight for anyone is something that is insyn with their height and age. While, all the attention is directed towards the harmful effects of being overweight, very few people know that weighing too low to be healthy is equally dangerous.
Story first published:Tuesday, August 30, 2016, 17:06 [IST]
Desktop Bottom Promotion