For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీహైడ్రేషన్ తగ్గించే సూపర్ వాటర్ రిచ్ ఫుడ్స్..

|

శరీరంలో వాటర్ కంటెంట్ తగ్గిపోతే బాడీ డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. శరీరంలో జీవక్రియలన్నీకరెక్ట్ గా మరియు హెల్తీగా పనిచేయాలంటే శరీరంలో సరిపడా నీళ్ళు ఉండాలి.

శరీరంను ఎప్పుడూ హైడ్రేషన్ లో ఉంచుకోవడం వల్ల శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో వాటర్ తగ్గిపోవడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాల మీద ప్రభావం పడుతుంది. వాటి పనితీరు మీద దుఫ్ప్రభావాలు కలిగిస్తుంది.

బాడీలో వాటర్ కంటెంట్ తగ్గకుండా, హైడ్రేషన్ లో ఉంచుకోవడం చాలా అవసరం. మన దినచర్యలో చాలా తక్కువగా నీళ్ళు తాగే వారి సంఖ్య ఎక్కువనే చెప్పాలి.చాలా మంది నీరు సరిగా తాగకపోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ కు గురి అవుతుంది.

బాడీ హైడ్రేషన్ లో ఉంచుకోవడానికి పూర్తిగా 8గ్లాసుల నీరు మాత్రమే తాగాల్సిన అవసరం లేదు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

అటువంటి హెల్తీ , వాటర్ రిచ్ ఫుడ్స్ ను ఈ క్రింది విధంగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది.

ఈ గ్రేట్ ఫుడ్స్ శరీరంను హైడ్రేషన్లో ఉంచడంతో పాటు, ఓవరాల్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే..మొదట వాటర్ఎక్కువగా తాగాలి. వాటర్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. హైడ్రేషన్ అందించే సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం...

కీరదోసకాయ:

కీరదోసకాయ:

ఈ సూపర్ ఫుడ్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. నిజానికి, కీరదోసకాయలో నీటి శాతం 95శాతం ఉంటుంది . ఈ సూపర్ ఫుడ్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరం పూర్తి హైడ్రేషన్లో ఉంటుంది.

సెలరీ:

సెలరీ:

సెలరీలో విటమిన్స్, మరియు న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్లో బాడీ సిస్టమ్ ను హైడ్రేట్ చేస్తుంది. ఈ సెలరీలో 95శాతం నీరు ఉంటుంది.

టమోటోలు:

టమోటోలు:

టమోటోల్లో 94శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. వీటిని సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. లేదా స్లైస్ గా కట్ చేసి తీసుకోవాలి, . వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల బాడీ హైడ్రేషన్ లో ఉంచుకోవచ్చు.

ముల్లంగి:

ముల్లంగి:

ముల్లంగిలో 93నుండి 94శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. అందుకే దీన్నిరెగ్యులర్ వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు, సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు. ముఖ్యంగా సమ్మర్లో దీని వాడకం ఎక్కువ.

వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ :

వాటర్ మెలోన్ లో 91శాతం నీరుంటుంది. అంతే కాదు, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి.ఇది ఆకలిని తగ్గిస్తుంది. బాడీని డీహైడ్రేషన్ లో ఉంచుతుంది.

కాలీఫ్లవర్:

కాలీఫ్లవర్:

కాలీఫ్లవర్ లో వాటర్ కంటెంట్ లెవల్స్ ఎక్కువగా ఉంటుంది. 91శాతం ఉంటుంది. ఈ గ్రీన్ వెజిటేబుల్ విటమిన్ మరియు ఫైటో న్యూట్రీషియన్స్ కు పవర్ హౌస్ వంటిది. . ఈ సూపర్ ఫుడ్ ను డైలీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

బాడీ డీహైడ్రేషన్ తగ్గించడానికి ఆకుకూరలు ఒక సూపర్ ఫుడ్. ఇందులో 95శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఆకుకూర స్మూతి తయారుచేసుకుని తాగాలి.

English summary

7 Superfoods That Can Keep You Hydrated

Dehydration is a health problem that occurs when the water and fluid content in the body is below the required level.Staying well hydrated is highly imperative for your overall health and wellness. Lack of water or fluids in your system can put a pressure on the internal organs and adversely affect their efficiency.
Story first published: Tuesday, June 28, 2016, 12:06 [IST]
Desktop Bottom Promotion