For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఉల్లిపాయల గురించి మీకు తెలియని వాస్తవాలు

By Swathi
|

పూర్వకాలం ఎవరైనా అనారోగ్యం పాలైతే.. ఏం చేసే వాళ్లో తెలుసా ? అప్పట్లో మందులు, సైంటిఫిక్ రీసెర్చ్ లు ఉండేవి కాదు. మరి వాళ్లంతా అనారోగ్య సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు ? ఒక్కసారి ఆలోచించండి.. మందులు లేకుండా, ఆయింట్ మెంట్స్ లేకుండా మనం ఉండగలమా ? హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి మందులు లేకుండా బయటపడగలమా ?

ఆ రోజుల్లో న్యాచురల్ పదార్థాలతోనే ఎలాంటి అనారోగ్య సమస్య నుంచి అయినా బయటపడేవాళ్లు. హోం రెమిడీస్ తోనే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాళ్లు. అంతేకాదు.. వ్యాధులు, నొప్పులు, లక్షణాలను ముందుగానే తెలుసుకుని.. హోం రెమిడీస్ తో అవి స్ప్రెడ్ అవకుండా జాగ్రత్త పడేవాళ్లు.

స్ప్రింగ్ ఆనియన్స్ లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్స్ప్రింగ్ ఆనియన్స్ లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

అందుకే ఆ కాలం వాళ్లు ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండేవాళ్లు. అప్పుడు మోడ్రన్ మెడిసిన్స్ లేవు కాబట్టి.. వాళ్ల ఇమ్యునిటీకి ఎలాంటి హాని కలిగేది కాదు. నిజమే మనం ఉపయోగించే యాంటీ బయాటిక్స్, మెడిసిన్స్ వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ బలహీనమవుతోంది. చిన్న అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్తాం. కానీ వంటింట్లో ఉన్న హోం రెమిడీస్ ని మరిచిపోతున్నాం. చాలా అనారోగ్య సమస్యలను నివారించే పదార్థాలు మన కిచెన్ లోనే దాగున్నాయి.

7 రోజుల పాటు ఉదయాన్నే వెల్లుల్లి, తేనె తినడం వల్ల పొందే బెన్ఫిట్స్..!7 రోజుల పాటు ఉదయాన్నే వెల్లుల్లి, తేనె తినడం వల్ల పొందే బెన్ఫిట్స్..!

కాబట్టి.. న్యాచురల్ రెమిడీస్ ద్వారా ఎఫెక్టివ్ గా రిలీఫ్ పొందవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. ఫ్రూట్స్, వెజిటబుల్స్, స్పైసెస్ తో రకరకాల వ్యాధులు నయం చేసుకోవచ్చు. మరి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయల గురించి వాస్తవాలు మీకు తెలుసా ? ఉల్లిపాయలను ఏ వ్యాధులకు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందామా..

ఫ్యాక్ట్ 1

ఫ్యాక్ట్ 1

ఉల్లిపాయ రసంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. కాలిన గాయాలు, పుండ్లకు ఇది ఎఫెక్టివ్ రెమెడి. ఎప్పుడైనా చేతులపై బొబ్బలు, కాలిన గాయాలు ఏర్పడినప్పుడు తాజా ఆనియన్ జ్యూస్ అప్లై చేయండి.. అంతే.. వెంటనే ఉపశమనం కలుగుతుంది.

ఫ్యాక్ట్ 2

ఫ్యాక్ట్ 2

దోమలు, పురుగులు కుట్టడం వల్ల వచ్చే నొప్పి, దురదను నివారించడంలో ఆనియన్ జ్యూస్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాంటప్పుడు ఉల్లిపాయ ముక్క తీసుకుని.. దురదగా ఉన్న ప్రాంతంలో రుద్దితే సరిపోతుంది.

ఫ్యాక్ట్ 3

ఫ్యాక్ట్ 3

రుతుక్రమం ( పీరియడ్ కి ) కొన్ని రోజుల ముందు.. పచ్చి ఉల్లిపాయలను డైట్ లో చేర్చుకుంటే.. కడుపునొప్పి తగ్గుతుంది. ఎందుకంటే ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి.

ఫ్యాక్ట్ 4

ఫ్యాక్ట్ 4

అరికాళ్లలో ఏర్పడే పులిపిర్లు చాలా నొప్పి కలిగిస్తాయి. అలాంటి సమస్య మీకు ఉంటే.. వాటిపై ఉల్లిపాయ రసం రాస్తే.. త్వరిత ఉపశమనం కలుగుతుంది.

ఫ్యాక్ట్ 5

ఫ్యాక్ట్ 5

ఫ్లూ, ఫీవర్ తో బాధపడుతుంటే.. కొన్ని ఉల్లిపాయ ముక్కలను సాక్స్ లో పెట్టుకుని పడుకోండి. ఉదయానికల్లా.. జ్వరం తగ్గుతుంది. అలాగే శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తాయి.

ఫ్యాక్ట్ 6

ఫ్యాక్ట్ 6

వాంతులు, వికారంతో బాధపడుతుంటే.. రెండు టీ స్పూన్ల ఆనియన్ జ్యూస్ తీసుకోండి. ఈ చిన్న చిట్కా మీకు మంచి రిలాక్సేషన్ ని ఇస్తుంది.

ఫ్యాక్ట్ 7

ఫ్యాక్ట్ 7

ఒకవేళ మీ జుట్టు పెరగడం లేదు, అలాగే అన్ హెల్తీగా ఉంది అంటే.. ఆనియన్ జ్యూస్ ని జుట్టుకి, స్కాల్ప్ కి పట్టించండి. దీనివల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది.

English summary

7 Unknown Health Facts About Onions

7 Unknown Health Facts About Onions. If you want to know more about a few surprising health facts about onions, then do read on.
Story first published: Thursday, May 12, 2016, 16:51 [IST]
Desktop Bottom Promotion