For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైలెంట్ కిల్లర్ స్మోకింగ్ వల్ల క్యాన్సర్ ముప్పే కాదు.. మరెన్నో ??

By Swathi
|

నోట్లో సిగరెట్ పెట్టుకుని.. గుప్పులు గుప్పులుగా పొగ వదలడాన్ని ట్రెండ్ అంటారు, స్టైల్ అంటారు. అంతేకాదు.. ఫ్యాషన్ అని కూడా చెబుతుంటారు. మరో ఆశ్చర్యకర విషయమేంటో తెలుసా ? స్మోకింగ్ అనారోగ్యమని తెలిసినా.. దీన్నో హ్యాబిట్ గా మార్చుకోవడం పరిపాటిగా మారింది. స్మోకింగ్ వల్ల క్యాన్సర్ మాత్రమే కాదు.. 7 రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

స్మోకింగ్ వల్ల క్యాన్సర్ రిస్క్ పెరగడమే కాదు.. సెక్స్ లైఫ్, ఇన్ఫెర్టిలిటీ వంటి రకరకాల సమస్యలు వస్తాయని తాజా అధ్యయనాల్లో గుర్తించారు. స్మోకింగ్ సైలెంట్ కిల్లర్ లా.. ఏడు రకాలుగా మీపై దుష్ర్పభావం చూపుతుందట. మరి స్మోకింగ్ వల్ల వచ్చే భయంకరమైన ఏడు రకాల అనారోగ్య సమస్యలేంటో చూద్దామా..

వాజినల్ ఇన్ఫెక్షన్

వాజినల్ ఇన్ఫెక్షన్

స్మోకింగ్ వల్ల రిలీజ్ అయ్యే కెమికల్స్ వల్ల.. హార్మోనల్ లెవెల్స్ లో సమస్యలు రావడంతోపాటు.. వాజినాలో పీహెచ్ లెవెల్స్ పెరిగి, వాజినల్ ఇన్ఫెక్షన్స్ కి కారణమవుతుంది.

తెల్లజుట్టు

తెల్లజుట్టు

20లలోనే తెల్లజుట్టు సమస్య ఎందుకు వచ్చిందని చాలా మంది వాపోతుంటారు. మీకు స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే.. అదే దీనికి కారణం అయి ఉండవచ్చు. స్మోకింగ్ వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడి.. ఏజింగ్ ప్రాసెస్ ముందుగానే మొదలవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి స్మోకింగ్ మానేయడం మంచిది.

బ్లోటింగ్

బ్లోటింగ్

స్మోకింగ్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ లో బ్లోటింగ్ ఒకటని తెలుసా ? స్మోకింగ్ చేయని వాళ్ల కంటే.. స్మోకింగ్ చేసేవాళ్లు.. ఎక్కువ గాలి పీల్చుకుంటారు. దీనివల్ల కడుపులో మోతాదుకి మించి గాలి చేరి.. బ్లోటింగ్ కి కారణమవుతుంది.

లివర్ డిసీజ్

లివర్ డిసీజ్

సిగరెట్ లో ఉండే హానికారక కెమికల్స్ వల్ల.. కాలేయంలో టాక్సిక్ లోడ్ ఎక్కువ అవుతుంది. దీనివల్ల లివర్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. కాలేయం హెల్తీగా ఉండాలన్నా, లివర్ డిసీజ్ లకు దూరంగా ఉండాలన్నా.. స్మోకింగ్ మానేయడం చాలా అవసరం.

కంటి చూపు

కంటి చూపు

లంగ్స్, లివర్ మాత్రమే కాదు.. కంటిలోని నరాల వ్యవస్థను కూడా డ్యామేజ్ చేస్తుంది స్మోకింగ్. స్మోకింగ్ వల్ల కళ్లకు కూడా హాని కలుగుతుందని.. అనేక అధ్యయనాలు వెల్లడించాయి. స్మోకింగ్ వల్ల కళ్లు పొడిబారడం, గ్లూకోమా వంటి సమస్యలు ఎదురవుతాయి.

గాయాలు

గాయాలు

స్మోకింగ్ చేయని వాళ్ల కంటే.. స్మోకింగ్ చేసేవాళ్లలో.. గాయాలు మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. అంతేకాదు గాయాల వల్ల ఇన్ఫెక్షన్స్ కి కూడా అవకాశం ఉంది. అలాగే స్కిన్ టిష్యూ లో టెన్సైల్ శక్తి తగ్గడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.

వెన్నెముక సమస్యలు

వెన్నెముక సమస్యలు

స్మోకింగ్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడమే కాదు.. ఎముకల డెన్సిటీ కూడా తగ్గుతుంది. కొల్లాజెన్ లెవెల్ తగ్గి.. వెన్నెముక సమస్యలు, ఆస్టియోపోరోసిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.

English summary

7 ways smoking can silently kill you

7 ways smoking can silently kill you. Not just increase your risk of cancer, smoking can wreak havoc in your day-to-day life as well and make your life miserable. Here are a few more ways smoking can harm your health. Do not miss the last slide.
Story first published: Wednesday, May 11, 2016, 17:12 [IST]
Desktop Bottom Promotion