For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

లూపన్ (ఆటో ఇమ్యూన్ )వ్యాదిని నివారించే 8 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

By Lekhaka
|

నిజానికి లూపస్‌ అంటే లాటిన్‌లో అర్థం తోడేలనే! పేరుకు తగ్గట్టుగానే ఇది మహా జిత్తులమారి సమస్య! ఆడవాళ్లను ఎక్కువగా పీడించే ఈ వ్యాధి లక్షణాలన్నీ కూడా చాలావరకూ- ఇతరత్రా సమస్యల్లా కనబడుతూ తప్పుదోవ పట్టిస్తుంటాయి. దీన్ని కట్టడి చెయ్యటానికి ఇప్పుడు సమర్థవంతమైన చికిత్సలున్నాయి. కాకపోతే దీనిపై ప్రజల్లోనే సరైన అవగాహన ఉండటం లేదు.

లూపస్‌ ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. 'ఆటో ఇమ్యూన్‌' సమస్యలని పిలుస్తుంటారు. లూపస్‌ కూడా ఈ తరహా సమస్యే. కాకపోతే మిగతా ఆటోఇమ్యూన్‌ వ్యాధులకూ, లూపస్‌కూ తేడా ఏమంటే- మిగతావన్నీ ఏదో ఒక అవయవానికో, వ్యవస్థకో పరిమితమైతే.. లూపస్‌ మాత్రం శరీరంలో తల నుంచి కాళ్ల వరకూ, కిడ్నీల నుంచి గుండె వరకూ.. చాలా వ్యవస్థలపైన, చాలా అవయవాలపైన దాడికి దిగి, వాటిని తీవ్రంగా దెబ్బతీస్తుంటుంది. ఈ దాడి ఏ అవయవం మీద జరిగితే దానికి సంబంధించిన లక్షణాలు బయల్దేరుతుంటాయి. ఈ వ్యాధి శరీరంలో ముఖ్యఅవయవాలపై దాడి చేస్తుంది. ముఖ్యంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం, కీళ్లు, వెన్నెముకపై దాడి చేస్తుందన్నారు. లూపస్‌ వ్యాధిని యాంటి నూక్లియర్‌, యాంటీబాడీ, పరీక్ష ద్వారా నిర్ధారించవచ్చునన్నారు. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఉంటుందని, ఇది మన జబ్బుల బారిన పడకుండా బాక్టీరియా, వైరస్‌, సూక్ష్మక్రిములను ఎదుర్కుంటుంది. ఇది వ్యాధి కారక సూక్ష్మ క్రిములతో నిరంతరం పోరాడుతూ ఉంటుంది.


రోగనిరోధక వ్యవస్థ కొన్ని సార్లు అతిగా పనిచేస్తూ ఏకంగా శరీరంలో అవయవాలపై దాడి చేసి చాల రకాలు సమస్యలకు కారణమవుతుంది. లూపస్‌ వ్యాధి వలన ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌ లెట్స్‌ కణాలు తగ్గిపోతాయన్నారు. దీనివలన మూత్రపిండాల పై దాడి చేస్తే కిడ్నీ వైపల్యానికి దారి తీస్తుంది. గుండెపై దాడి చేస్తే గుండెకండరాల వాస్తుందని, గుండెకవాటాలు, దెబ్బతింటాయన్నారు. ఊపిరి తిత్తులపై దీని ప్రభావం ఉన్నపుడు ఊపితిత్తుల పొరలు వాచి ఊపిరి తిత్తులలో నీరుచేరి, శ్వాస తీసుకొవడం కష్టంగా మారుతుంది. లూపస్‌ బాధితుల్లో శరీరం లోపల రక్త నాళాల్లో రక్త గడ్డకట్టడం ద్వారా ప్రాణాపాయం జరగవచ్చు .

'లూపస్‌' చికాకుపెట్టే పెద్ద సమస్య. విస్మరిస్తే ప్రాణాంతకంగా తయారయ్యే సమస్య కూడా. అయినా మన ప్రాంతంలో ప్రజల్లోగానీ, వైద్యరంగంలోగానీ దీనిపై సరైన అవగాహన ఉండటం లేదు. లక్షణాలపై సమగ్రమైన అవగాహన లేకపోతే 'లూపస్‌' వ్యాధిని గుర్తించటం మహా కష్టం. ఎందుకంటే మొదట్లో లూపస్‌ లక్షణాలు.. 1. ఒళ్లు నొప్పులు, జుట్టు రాలటం, నోట్లో పుండ్లు.. ఇలా చాలా సాదాసీదా బాధల్లాగే ఉంటాయి. 2. లక్షణాల్లో కూడా అందరిలో అన్నీ ఉండవు. 3. ఈ బాధలు ఎప్పుడూ ఉండవు. వస్తూపోతూ, మధ్యమధ్యలో ఉద్ధృతమవుతుంటాయి. 4. పైగా లక్షణాన్నీ ఇతరత్రా సమస్యల్లా కనిపిస్తూ తప్పుదోవ పట్టిస్తుంటాయి. అందుకే దీన్ని 'గ్రేట్‌ ఇమిటేటర్‌' అని కూడా అంటుంటారు. వీటివల్ల చాలా సందర్భాల్లో లూపస్‌ను సత్వరం గుర్తించటం కష్టంగా ఉంటుంది. ఫలితంగా వ్యాధి ముదిరి.. పరిస్థితి ప్రాణాల మీదికి వస్తోంది.

ప్రాణాపాయం నుండి రక్షణ పొందడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మంచిది.

అల్లం:

అల్లం:

లూపస్ వ్యాధినివారణకు అల్లం గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది వికారం, వాంతులు, కళ్ళు తిరగడాన్ని నివారిస్తుంది. అల్లం కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. జాయింట్ పెయిన్ , మజిల్ పెయిన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అల్లంను టీ, జ్యూస్, క్యాండీస్ లో మిక్స్ చేసి తీసుకోవచ్చు. లేదా పచ్చిగా తినవచ్చు.

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్:

ఫ్లాక్స్ సీడ్స్ లో ఆల్ఫా లినోలిక్ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. పరిశోధనల ప్రకారం, ఫ్లాక్స్ సీడ్స్ కిడ్నీ ఫంక్షన్స్ ను నివారిస్తుంది. దాంతో లూపస్ నెఫ్రైటిస్ వంటి వ్యాదులను నివారిస్తుంది. పొట్ట ఉదరంలో నొప్నిని తగ్గిస్తుంది.

ఫిష్ ఆయిల్ :

ఫిష్ ఆయిల్ :

ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ తీసుకోవడం వల్ల ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అదికంగా ఉంటాయి. ఇది అలసటను తగ్గిస్తుంది, జాయింట్ పెయిన్ నివారిస్తుంది. మౌత్ అల్సర్ ను నివారిస్తుంది. ఫిష్ ఆయిల్ తీసుకోవడం లూపస్ లక్షణాలను నివారించుకోవచ్చు.

హైడ్రోథెరఫి:

హైడ్రోథెరఫి:

హాట్ అండ్ కోల్డ్ వాటర్ మసాజ్ తో రోజుకు రెండు సార్లు మసాజ్ చేసుకోవడం వల్ల స్ట్రెస్, పెయిన్, డిప్రెషన్, స్వెల్లింగ్, కళ్ళు తిరగడం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. హైడ్రోథెరఫీ పెయిన్ తగ్గిస్తుంది. స్టెస్ తగ్గిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ ను తగ్గిస్తుంది. జాయింట్ పెయిన్ తగ్గిస్తుంది.

క్యారెట్ :

క్యారెట్ :

క్యారెట్ నేచురల్ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్ . ఇందులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఫ్రీరాడికల్స్ డ్యామేజ్ నుండి డిఎన్ ఎ కు రక్షణ కల్పిస్తుంది. క్యారెట్ ను రెగ్యులర్ గా తినడం వల్ల వాపులు, జాయింట్ పెయిన్స్, డీజినెస్, లెథర్జీ, డిప్రెషన్, మౌత్ సోర్ ను తగ్గిస్తుంది. క్యారెట్ యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.

ప్రైమ్ రోజ్ ఆయిల్ :

ప్రైమ్ రోజ్ ఆయిల్ :

ప్రైమ్ రోజ్ ఆయిల్ ఇన్ఫ్లమేషన్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. పెయిన్ తగ్గిస్తుంది.లూపస్ వ్యాధిని తగ్గిస్తుంది. అయితే దీన్ని పరిమితంగా మాత్రమే ఉపయోగించాలి. ఒక టీస్పూన్ లూపస్ ఆయిల్ ఉపయోగించడం వల్ల నొప్పి, స్టిప్ నెస్ నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

మెడిటేషన్:

మెడిటేషన్:

మెడిటేషన్ పురాతన కాలం నాటి హోం రెమెడీ. ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. వివిధ రకాల కండీషన్స్ ను నివారిస్తుంది. మెడిటేషన్ చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్ తగ్గిస్తుంది, డిప్రెషన్, బాడీపెయిన్స్ తగ్గిస్తుంది.

యోగ:

యోగ:

లూపస్ లక్షణాలను నివారించడంలో యోగ గ్రేట్ గా సహాయపడుతుంది.జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. వాపులను తగ్గిస్తుంది. యోగను రెగ్యులర్ గా చేస్తుంటే .జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి.యోగ స్ట్రెస్ బూస్టర్ , లూపస్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది నార్మల్ గా, హెల్తీగా మెయింటైన్ చేయవచ్చు.

English summary

8 Effective Home Remedies For Lupus

Lupus is one of the poorly understood diseases in the world. One interesting fact about lupus is that 9 out of 10 people suffering from this disease are women! The disease has a wide range of symptoms, which makes it difficult for the doctors to diagnose it.
Story first published: Monday, November 21, 2016, 20:00 [IST]
Desktop Bottom Promotion