For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెల్లీ బటన్ ఇన్ఫెక్షన్ నివారించే ఎక్సలెంట్ హోం రెమెడీస్

|

శరీరంలో ఏభాగాల్లో అయినా..ఇన్ఫ్లమేషన్ మరియు ఇన్ఫెక్షన్స్ సోకడం సహజం . కానీ ఏకంగా బెల్లిబటన్ కు ఇన్ఫ్లమేషన్ సోకితే? అబ్బో పరిస్థితి చెప్పలేనంత బాధ చాలా కష్టం? ఎందుకంటే బెల్లీ బటన్ ప్రదేశం చాలా సున్నితమైనది ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్స్ రావడం అనేది చాలా తీవ్రమైనది కావచ్చు

బెల్లీ బటన్ చాలా సున్నితమైన ప్రదేశం, కాబట్టి ఆ ప్రదేశం తడిగా మరియు డార్క్ స్పాట్ కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం అన్ని రకాల బ్యాక్టీరియా మరియు ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ కు అత్యంత అనుకూలమైన ప్రదేశం. నాభి కుహరంలో మిగిలిపోయిన సోపు, చెమట మరియు ఇతర పదార్థాల వల్ల ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది.

బాన పొట్టను తగ్గించే 20 సూపర్ ఫుడ్స్...!

అందువల్ల ఈ ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం పొందాలంటే ?ఇంత సున్నితమైన ప్రదేశంలో ఇన్ఫెక్షన్స్ ను ఎలా తొలగించుకొంటారు ? చాలా సింపుల్ ఇంట్లో ఉండే నేచురల్ పదార్థాలే చాలా ఎఫెక్టివ్ గా బెల్లీ బటన్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది. మరి ఆ పదార్థాలేంటో ఎలా ఉపయోగించాలో చూద్దాం....

గోరువెచ్చని నీరు:

గోరువెచ్చని నీరు:

బెల్లీ బటన్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గోరువెచ్చని సాల్ట్ వాటర్ చాలా ఎఫెక్టివ్ హోం రెమెడీ. వాటర్ వేడి వల్ల ఇన్ఫెక్షన్ అయిన ప్రదేశంలో రక్తప్రసఱను పెరుగుతుంది . అదే విధంగా నీటిలోని సాల్ట్ మాయిశ్చరైజర్ గా గ్రహిస్తుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి శుభ్రం చేసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

వార్మ్ కంప్రెసర్:

వార్మ్ కంప్రెసర్:

మీ నావల్ క్యావిటి నొప్పి లేదా వాపు ఉన్నట్లైతే మీరు వార్మ్ కంప్రెసర్ ను ఉపయోగించుకోవచ్చు . వార్మ్ కంప్రెసర్ సున్నితంగా మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

బెల్లీ బటన్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం:

బెల్లీ బటన్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం:

ప్రివెన్షన్ ఈజ్ బెటర్ ద్యాన్ క్యూర్ అన్న విషయం గుర్తుంటే చాలు. ఏది తీవ్రస్తాయి చేరుకోకుండా , ముందే గ్రహించే తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది . నావల్ క్యావిటి డ్రైగా ఉంచుకోవడం మరియు క్లీన్ గా ఉంచుకోవడం వల్ల ఇతర ఇన్ఫెక్షన్స్ సోకకుండా దూరంగా ఉంచుతుంది.

 టీట్రీ ఆయిల్ :

టీట్రీ ఆయిల్ :

ఇది మరో గ్రేట్ హోం రెమెడీ. దీని వల్ల ఈస్ట్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవచ్చు. టీట్రీ ఆయిల్ యాంటీఫంగల్, యాంటీసెప్టిక్ మరియు యాంటీబ్యాక్టిరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎక్సలెంట్ హోం రెమెడీగా పనిచేస్తుంది

 వైట్ వెనిగర్ :

వైట్ వెనిగర్ :

వైట్ వెనిగర్ లో అసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది బెల్లీ బటన్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ హోం రెమెడీగా పనిచేస్తుంది.

ఆల్కహాల్:

ఆల్కహాల్:

బెల్లీ బటన్ ఇన్ఫెక్షన్ నివారించడానికి మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ ఇది, ఆల్కహాల్లో యాంటీసెప్టిక్ లక్షణాలున్నాట్లు నిర్ధారించడం జరిగింది. బెల్లీబటన్ వద్ద ఆల్కహాల్ రబ్ చేయడం వల్ల ఇది ఇన్ఫెక్షన్ ఏరియాను స్టెరిలైజ్ చేస్తుంది . మరియు ఇది ఇతర బాగాలకు ఇన్ఫెక్షన్ సోకకుండా నివారిస్తుంది.ఆల్కహాల్ మర్ధన వల్ల ఇరిటేషన్ మరియు నొప్పిని నివారించుకోవచ్చు.

పసుపు: :

పసుపు: :

పసుపు మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇందులో యాంటీ సెప్టిక్ మరియు యాంటీ బయోటిక్ లక్షణాలుండటం వల్ల బెల్లీ బటన్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.స్నానం చేసిన వెంటనే తేమ తుడిచి ఆప్రదేశంలో పసుపును అప్లై చేయాలి.

కలబంద:

కలబంద:

కలబంద చర్మానికి కేవలం మాయిశ్చరైజర్ గానే కాదు, ఇది కూల్ గా చేస్తుంది .ఈ స్మూతింగ్ ఎఫెక్ట్ బెల్లీబటన్ ఇన్ఫెక్షన్ మరియు రెడ్ నెస్ ను నివారిస్తుంది . ఇంకా నొప్పి మరియు ఇన్ఫమేషన్ తగ్గిస్తుంది . అందుకే కలబందను ఎక్సలెంట్ హోం రెమెడీ అంటారు.

English summary

8 Effective Home Remedies To Treat Belly Button Infection

Are you experiencing inflammation in your belly button? And is that giving you a hard time? Belly button infections can be quite agonizing, especially because they occur in a sensitive region of the human body.
Desktop Bottom Promotion