For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మగవాళ్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మూత్రాశయ క్యాన్సర్ లక్షణాలు..!

By Swathi
|

కారణం ఏదైనా క్యాన్సర్ బాధితుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. బాగా పరిశీలిస్తే మూత్రాశయ క్యాన్సర్ ఆడవాళ్లలో కంటే, పురుషుల్లో నాలుగు రెట్లు అధికంగా కనిపిస్తుంది. యుక్తవయస్కుల్లో ఈ క్యాన్సర్ అసలే రాదని కాదు కానీ, 60 ఏళ్లు దాటిన వారిలోనే ఈ క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తుంది. వయసు పైబడటం ఒక కారణమైతే, మూత్రాశయ క్యాన్సర్ రావడానికి పొగతాగడం మరో ప్రధాన కారణం అని చెప్పవచ్చు.

లంగ్ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన భయంకరమైన ఫ్యాక్ట్స్..

మూత్రాశయ క్యాన్సర్లు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. వాటిలో పాలిఫాయిడల్ కణుతులు అంటే ఉబ్బెత్తుగా వచ్చేవి ఒక రకం. పరిచినట్లు వచ్చే ఫ్లాట్ గ్రోత్ కణుతులు రెండవ రకం. నిజానికి ఉబ్బెత్తుగా ఉండే కణుతుల కన్నా.. పరిచినట్లు ఉండే కణుతులే ఎక్కువ ప్రమాదకరమైనవి. ఎందుకంటే మూత్రాశయపు గోడల్లోకి ఉబ్బెత్తు గోడల కన్నా వేగంగా ఫ్లాట్ గ్రోత్ కణతులు పాకుతాయి.

పొట్టలో క్యాన్సర్(కొలరెక్టల్ క్యాన్సర్) లక్షణాలు గుర్తించడం ఎలా...?

బ్లాడర్ క్యాన్సర్ కి ప్రధాన కారణాలు పొగాకు ఉత్పత్తులు, స్మోకింగ్ అని నిపుణులు చెబుతున్నారు. స్మోకింగ్, టొబాకో అనేది ఈ క్యాన్సర్ రిస్క్ ని పెంచుతాయి. ఈ మూత్రాశయ క్యాన్సర్ గుర్తించడానికి కొన్ని ప్రధాన లక్షణాలున్నాయి. వాటిపై మగవాళ్లలందరిలో అవగాహన ఉంటే.. మొదట్లోనే దీన్ని నయం చేసుకోవడం తేలికవుతుంది.

యూరిన్ లో బ్లడ్

యూరిన్ లో బ్లడ్

యూరిన్ బ్లడ్ రావడం అనేది చాలా రేర్ గా జరుగుతుంది. మగవాళ్లకు ఈ సమస్య ఉండదు. మగవాళ్ల యూరిన్ లో బ్లడ్ పడటాన్ని హెమట్యూరియా అని పిలుస్తారు. బ్లాడర్ క్యాన్సర్ ( మూత్రాశయ క్యాన్సర్ ) కి ఇది ప్రధాన లక్షణం. యూరిన్ లో బ్లడ్ పడేటప్పుడు నొప్పి ఉండదు. కాబట్టి యూరిన్ లో ఎలాంటి సంకేతం లేకుండా బ్లడ్ పడిందంటే.. మగవాళ్లు వెంటనే అలర్ట్ అవ్వాలి.

యూరిన్ లో మంట

యూరిన్ లో మంట

యూరిన్ కి వెళ్లినప్పుడు మంట అనేది చాలా కామన్. కానీ మూత్రంపోయేటప్పుడు భరించలేని మంట, నొప్పి ఉన్నాయంటే.. బ్లాడర్ క్యాన్సర్ కి సంకేతమని గుర్తించాలి.

యూరిన్ లో వైట్ టిష్యూస్

యూరిన్ లో వైట్ టిష్యూస్

మగవాళ్లు యూరిన్ కి వెళ్లినప్పుడు మూత్రంతోపాటు తెల్లటి టిష్యూస్ వస్తున్నాయంటే.. బ్లాడర్ క్యాన్సర్ కి సంకేతమని గుర్తించాలి. ఇలాంటి పరిస్థితిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

బరువు తగ్గడం

బరువు తగ్గడం

ఊహించని రీతిలో బరువు తగ్గిపోవడం అనేది అనేక కారణాలుంటాయి. అలాగే బ్లాడర్ క్యాన్సర్ కి కూడా కారణం కావచ్చు. ఇతర లక్షణాలతో పాటు బరువు కూడా తగ్గిపోయారంటే.. ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిదని గ్రహించాలి.

లోయర్ బ్యాక్ పెయిన్

లోయర్ బ్యాక్ పెయిన్

కిడ్నీలు ఉండే ప్రాంతంలో నొప్పిగా ఉంది అంటే.. యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ఈ సమస్యలు.. పొత్తి కడుపు నొప్పికి కూడా కారణమవుతాయి. కాబట్టి ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.

అలసట

అలసట

బ్లాడర్ లేదా మూత్రాశయంలో చాలా అసౌకర్యానికి గురిచేసినప్పుడు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా.. అలసట వేధిస్తుంటుంది. ఎక్కువగా అలసిపోతారు.

పాదాల్లో వాపు

పాదాల్లో వాపు

కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లలో పాదాల వాపులు చాలా సాధారణం. అలాగే బ్లాడర్ క్యాన్సర్ ఉన్నవాళ్లలో కూడా .. పాదాల వాపు కనిపిస్తుంది. కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకండి.

యూటీఐ

యూటీఐ

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మగవాళ్లలో కామన్ కాదు. కానీ.. మగవాళ్లలో ఇలాంటి లక్షణం కనిపించింది అంటే.. అది బ్లాడర్ క్యాన్సర్ కి సంకేతమని గుర్తించండి.

యూరినేషన్ లోప్రాబ్లమ్

యూరినేషన్ లోప్రాబ్లమ్

యూరినేషన్ లో ప్రాబ్లమ్ ని బ్లాడర్ క్యాన్సర్ అని చెప్పడం కష్టం. అయితే పెయిన్ ఫుల్ యూరినేషన్, యూరిన్ స్ట్రీమ్ వీక్ గా మారడం, బ్లాడర్ ఖాళీగా ఉన్నా.. యూరిన్ కి వెళ్లాలి అనిపించడం, తరచుగా కొద్దికొద్దిగా యూరిన్ పాస్ చేయడం వంటి లక్షణాలు బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలు అయి ఉండవచ్చు.

English summary

9 symptoms of bladder cancer every man should know

9 symptoms of bladder cancer every man should know. One of the most common causes is the use of tobacco and smoking. Smoking and tobacco are two factors that increase one’s risk of suffering from this cancer.
Story first published:Monday, June 13, 2016, 17:15 [IST]
Desktop Bottom Promotion