For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్రెస్ట్ సైజ్ తగ్గించే అర్ధచంద్రాసనం

By Super Admin
|

అర్ధ అంటే సగం అని అర్థం. ఆసనం అంటే యోగాలో చేయు ప్రక్రియ. అర్ధచంద్రాసనం వలన శరీరం సమతుల్యంగా ఉంటుంది. నమస్కారాసన భంగిమలో అలాగే నిలబడి, శ్వాసను పీలుస్తూ నెమ్మదిగా రెండు చేతులను పైకి లేపి, తలతో పాటు సాగదీసి వెనక్కు వంచాలి. కాళ్లు వంచకూడదు. అరచేతులు ఆకాశం వైపు ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో బ్యాలెన్స్‌ సరిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే వెనకకు పడిపోయే ప్రమాదముంది. మనసును ఛాతీ మీద కేంద్రీకరించాలి.

ఆసనం వేయు పద్ధతి : చదునైన నేలపై నిలబడాలి. మొదట పాదాలను దగ్గరకు చేర్చాలి. పాదాలు ఒకదానికొకటి ఆనుకుని ఉండేలా చూడాలి.(సావదాన్లో నిలబడడం) రెండుకాళ్లను ఒకదానికొకటి దూరం జరపాలి. అంటే విశ్రామ్‌లో నిలబడమన్న మాట.

Ardha Chandrasana (Half Moon Pose) To Reduce Breast Size

కుడి చేయిని భూమికి సమాంతరంగా పక్కకు చాచాలి.

ఆరచేయి ఆకాశానికి అభిముఖంగా ఉండేలా తిప్పాలి.

అలాగే చేయిని నిటారుగా ఉంచుతూనే పైకి లేపాలి. భుజాలు తలను తాకుతూ చేయి ఆకాశాన్ని చూపుతున్నట్లు ఉండాలి. అలాగే మెల్లగా నడుము నుంచి తలవరకు ఎడమవైపు వంచాలి. అలాగే చెయ్యిని కూడా శరీరంతో పాటు వంచాలి. ప్రసుత్తం అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది. తిరిగి ఆసనం వేసిన రీతిలోనే మెల్లగా మొదటి స్థానానికి రావాలి. ఇదేవిధంగా ఎడమ చేయిని భూమికి సమాంతరంగా పక్కకు చాచాలి.

అరచేయి ఆకాశానికి అభిముఖంగా ఉండేలా తిప్పాలి. అలాగే చేయిని నిటారుగా ఉంచుతూనే పైకి లేపాలి. భుజాలు తలను తాకుతూ చేయి ఆకాశాన్ని చూపుతున్నట్లు ఉండాలి. అలాగే మెల్లగా నడుము నుంచి తలవరకు కుడివైపుకు వంచాలి.

అలాగే చెయ్యిని కూడా శరీరంతో పాటు వంచాలి. ప్రస్తుతం అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది. తిరిగి ఆసనం వేసిన రీతిలోనే మెల్లగా మొదటి స్థానానికి రావాలి.

Ardha Chandrasana (Half Moon Pose) To Reduce Breast Size

ఇదేవిధంగా

ఎడమ చేయిని భూమికి సమాంతరంగా పక్కకు చాచాలి.

అరచేయి ఆకాశానికి అభిముఖంగా ఉండేలా తిప్పాలి.

అలాగే చేయిని నిటారుగా ఉంచుతూనే పైకి లేపాలి.

భుజాలు తలను తాకుతూ చేయి ఆకాశాన్ని చూపుతున్నట్లు ఉండాలి.

అలాగే మెల్లగా నడుము నుంచి తలవరకు కుడివైపుకు వంచాలి.

అలాగే చెయ్యిని కూడా శరీరంతోపాటు వంచాలి. ప్రస్తుతం అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది.

తిరిగి ఆసనం వేసిన రీతిలోనే మెల్లగా మొదటి స్థానానికి రావాలి.

Ardha Chandrasana (Half Moon Pose) To Reduce Breast Size

ఉపయోగాలు: ఈ ఆసనాన్ని వేయడం వలన శరీరానికి సమతుల్యత ఏర్పడుతుంది. ఛాతీ భాగాలకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది.

ఈ ఆసనం చేయడం వల్ల పొట్ట దగ్గర కండరాలు పూర్తిగా స్ట్రెచ్‌ అవుతాయి. నెలసరి సక్రమంగా రానివారికి.. ఎక్కువగా రక్తస్రావం అవుతున్న వారికీ ఈ ఆసనం మంచిది. ఆ సమయంలో తీవ్రంగా నడుం నొప్పి వస్తుంటే దాన్నుంచీ ఉపశమనం లభిస్తుంది.

English summary

Ardha Chandrasana (Half Moon Pose) To Reduce Breast Size

Yoga mythology is quite rich and advanced. You name a problem for which yoga doesn’t provide you with the pose. Sun and Moon have rich importance in the Yoga mythology.
Story first published: Wednesday, June 22, 2016, 14:40 [IST]
Desktop Bottom Promotion