For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: రాత్రిపూట లేటుగా భోంచేస్తున్నారా ? ఐతే.. డేంజర్ లో పడ్డట్టే..!!

By Swathi
|

బ్రేక్ ఫాస్ట్ మానేయడం, జంక్ స్నాక్స్ తినడం.. కారణంగా రాత్రిపూట భోజనం లేటుగా, హెవీగా తినడం. ఇలా మీ రోజులు గడుస్తున్నాయి. ఇది ఎంతవరకు హెల్తీనో ఒక్కసారి ఆలోచించారా ? బిజీ లైఫ్ స్టైల్ కారణంగా.. అన్ హెల్తీ ఫుడ్స్ తీసుకుంటున్న.. జాబితాలో మీతోపాటు వేలాదిమంది ఉన్నారు.

రాత్రిపూట భోజనం లేటుగా తినడం శరీరానికి చాలా హానికరం. ఇలాంటి అలవాటు అలాగే కొనసాగితే.. మీ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ లెవెల్స్, మెటబాలిజం రేటు, ఫిజికల్ యాక్టివిటీని బట్టి.. శరీరంలో ఆహారం జీర్ణమవుతుంది.

రాత్రిపూట లేటుగా భోజనం చేసేవాళ్లు.. మధ్యాహ్నం తినే మోతాదు కంటే.. ఎక్కువగా తింటారని మెడికల్ సెంటర్ అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే రాత్రిపూట జీర్ణక్రియ నిదానంగా జరుగుతుంది. దీనివల్ల శరీరంలో ఫ్యాట్ పేరుకుంటుంది. దీనివల్ల బరువు పెరగడం, ఒబేసిటి వంటి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అవేంటో చూద్దాం. లేట్ నైట్ డిన్నర్ ని అవైడ్ చేద్దాం..

ఒబేసిటీ

ఒబేసిటీ

లేటుగా భోజనం చేయడం వల్ల ... ఆహారం ఎక్కువగా తీసుకుంటాం. రాత్రిపూట శరీరంలో జీర్ణక్రియ ప్రాసెస్ నెమ్మదిగా ఉంటుంది. దీనివల్ల పొట్టలో ఫ్యాట్ చేరుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. దీనివల్ల ఒబేసిటీ రిస్క్ వస్తుంది.

హైబీపీ

హైబీపీ

శరీరంలో ఫ్యాట్ కంటెంట్ పెరగడం, గుండె నుంచి ధమనులకు రక్త శుద్ధిలో సమస్యలు రావడం వంటి కారణాల వల్ల హై బ్లడ్ ప్రెజర్ కి దారితీస్తుంది.

డయాబెటిస్

డయాబెటిస్

రాత్రిపూట లేటుగా భోజనం చేయడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశాలుంటాయి. రాత్రిపూట మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది. కార్బొహైడ్రేట్స్ ఎఫెక్టివ్ గా పగలగొట్టబడవు. దీనివల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువై.. డయాబెటిస్ రిస్క్ ఉంటుంది.

గొంతు సమస్యలు, ఆస్తమా

గొంతు సమస్యలు, ఆస్తమా

రాత్రిపూట లేటుగా భోజనం చేయడం వల్ల.. గొంతులోని ఫుడ్ పైప్ ద్వారా పొట్టలో యాసిడ్ చేరుకుంటుంది. ఇది దగ్గు, నోట్లో మంట, ఆస్తమా వంటి సమస్యలకు దారితీస్తాయి. దీన్ని వెంటనే చెక్ చేయించుకోకపోతే.. ఫుడ్ పైప్ లో క్యాన్సర్ కి కారణమవుతుంది.

నిద్రకు ఆటంకం

నిద్రకు ఆటంకం

నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. ముఖ్యంగా రాత్రిపూట లేటుగా మాంసం, స్పైసీ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ అయిన మిల్క్ షేక్, చాక్లెట్, కెఫీన్ వంటివి తీసుకుంటే.. నిద్రలో సమస్యలు ఏర్పడతాయి. నిద్ర సరిగా లేకపోతే.. అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

డిప్రెషన్

డిప్రెషన్

రాత్రిపూట లేటుగా భోజనం చేయడం వల్ల నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. రోజంతా లేజీగా అనిపిస్తుంది. ఏ పని సరిగ్గా చేయలేకపోతారు. దీనివల్ల మానసిక ఒత్తిడి, అలసట ఏర్పడి.. డిప్రెషన్ కి దారితీస్తుంది.

యూరిన్ ప్రాబ్లమ్

యూరిన్ ప్రాబ్లమ్

ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల కొన్ని గంటల్లోనే యూరినరీ బ్లాడర్ నిండిపోతుంది. నిద్రపోయిన తర్వాత... యూరిన్ కి వెళ్లడానికి సాధారణంగా అవైడ్ చేస్తారు. దీనివల్ల కిడ్నీలపై కూడా దుష్ర్పభావం పడుతుంది.

English summary

Are You Eating Dinner Late At Night ? Then Beware of These Health Problems

Are You Eating Dinner Late At Night ? Then Beware of These Health Problems. Skipping breakfast, eating an ‘on-the-go’ junk snack, then a quick lunch because you have to prepare for a meeting, and finally eating a heavy dinner late night.
Desktop Bottom Promotion