Latest Updates
-
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై
లేజీ మార్నింగ్ కి గుడ్ బై చెప్తే.. అనేక బెన్ఫిట్స్
రాత్రి ఎంతసేపైనా మెలుకువా ఉంటా కానీ.. పొద్దున మాత్రం త్వరగా లేవలేను. ఈ మాట చాలా మంది అంటూ ఉంటారు. ఉదయం నిద్ర లేవాలంటే చాలా మందికి చిరాకు, బద్దకం. కానీ ఉదయాన్నే నిద్రలేవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. పొద్దున్నే లేస్తే కలిగే ప్రయోజనాలు చూస్తే.. మీరే రేపటి నుంచి కోడి కూసేలోపే నిద్ర లేస్తారు.
రాత్రి త్వరగా పడుకుని.. ఉదయం త్వరగా లేవాలని చాలా మంది అనుకుంటారు. కానీ.. ఫాలో అవడంలో ఫెయిల్ అవుతుంటారు. అయితే.. ఉదయాన్నే లేవడం ఒక్కసారి అలవాటు అయితే.. ఆటోమేటిక్ గా కంటిన్యూ అవుతుందని అందరికీ తెలుసు. అలాగే.. ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల చాలా యాక్టివ్ గా, ఎనర్జిటిక్ ఉంటారని స్టడీస్ చెపుతున్నాయి. అంతేకాదు.. ఇలా పొద్దున్నే నిద్రకు గుడ్ బై చెప్పేస్తే.. పవర్ ఫుల్ బెన్ఫిట్స్ పొందచ్చు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

సక్సెస్:
ఉదయాన్నే నిద్రలేవడం వల్ల.. ఎక్కువ సక్సెస్ అవుతారు. ఎవరైతే లేటుగా నిద్రలేస్తారో వాళ్లతో పోల్చితే.. ఉదయాన్నే నిద్రలేచే అలవాటు ఉన్నవాళ్లు అనుకున్నది వెంటనే సాధిస్తారు. వీళ్లలో.. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
హ్యాపీనెస్:
ఉదయాన్నే నిద్రలేచే వాళ్లు.. రోజంతా చాలా హ్యాపీగా, ఉత్సాహంగా ఉంటారట. యూత్ కంటే.. పెద్దవాళ్లు ఎందుకు హ్యాపీగా ఉంటారు అనేదానిపై అధ్యయనం చేయగా.. వాళ్లు ఉదయాన్నే లేవడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఫ్రెష్ ఫీలింగ్ తో, యాక్టివ్ గా ఉంటారని తేలింది.

సామర్థ్యం:
ఉదయాన్నే నిద్రలేచేవాళ్లు శక్తిసామర్థ్యాలు పొందుతారు. త్వరగా లేవడం వల్ల అన్ని పనులు చకచకా చేసేస్తారు. దీంతో అనుకున్న పని సజావుగా చేయడానికి వీలవుతుంది. అలాగే.. ప్రణాళిక ప్రకారం అనుకున్న పని పూర్తి చేస్తారు. కాబట్టి ఉదయాన్నే లేస్తే.. ప్రొడక్టివిటీ పెరిగి.. మంచి ప్రశంసలు పొందుతారు.
పర్ఫెక్ట్ పర్సనాలిటీ:
ఉదయాన్నే లేచే అలవాటు ఉంటే.. వ్యాయామానికి సమయం కేటాయిస్తారు. దీనివల్ల బాడీ షేప్ కరెక్ట్ గా ఉంటుంది. ఉదయాన్నే లేవడం వల్ల హెల్తీ డైట్ ఫాలో అవుతారు. క్రియేటివీ, ఇంటెలిజెన్స్ కూడా పొద్దున్నే నిద్రలేచే వాళ్లకు ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్ సమస్యలు వచ్చే అవకాశం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications