For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ నడుము చుట్టుకొలతను బట్టి మీకున్న హెల్త్ రిస్క్ లు ఏంటి ?

నడుము చుట్టుకొలత ఎక్కువ పెరిగింది అంటే.. మీరు బరువు పెరుగుతుండటమే కారణం. కానీ.. బరువు పెరగడంపై ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం అవసరం. నడుము చుట్టుకొలత పెరిగే కొద్దీ.. అది అనేక వ్యాధులకు సంకేతాలుగా గమనించాల

By Swathi
|

మీరు మామూలుగా ధరించే ప్యాంట్లు మీకు ఫిట్ అయిపోతున్నాయా, అలాగే మీ షర్ట్ బటన్స్ కూడా పెట్టడం కష్టంగా మారిందా ? ఇవన్నీ.. మీ నడుము చుట్టుకొలత పెరిగింది అనడానికి.. ఇది క్లియర్ గా కనిపిస్తున్న సంకేతం.

సాధారణం కంటే.. ఎక్కువ నడుము చుట్టుకొలత ఎక్కువ పెరిగింది అంటే.. మీరు బరువు పెరుగుతుండటమే కారణం. కానీ.. బరువు పెరగడంపై ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడం అవసరం. నడుము చుట్టుకొలత పెరిగే కొద్దీ.. అది అనేక వ్యాధులకు సంకేతాలుగా గమనించాలి.

waist size

గర్భధారణ సమయంలో కాకుండా.. ఆడవాళ్ల నడుము 38 ఇంచులు, 33 ఇంచులు పెరిగింది కంటే ఎక్కువ పెరిగింది అంటే.. దానికి అన్ హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్, వ్యాయామం చేయకపోవడం, సరిగా నిద్రపోకపోవడం వంటివన్నీ నడుము చుట్టుకొలత పెరగడానికి ప్రధాన కారణాలు.

మీరు హెల్తీగా ఉండాలి అనుకుంటే.. మీ బరువు ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలి. నడుము చుట్టుకొలత కంట్రోల్ లో ఉండాలి. హెల్తీ డైట్, వ్యాయామం గురించి జాగ్రత్త వహించండి. నడుము చుట్టుకొలత కొన్ని వ్యాధులపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

ఒబేసిటీ

ఒబేసిటీ

నడుము చుట్టూ ఫ్యాట్ పేరుకుంటే.. నముడు చుట్టుకొలత పెరుగుతుంది. దీనివల్ల ఆ వ్యక్తి ఒబేసిటటీకి గురవుతాడు. ఒబేసిటీ వల్ల.. ఎముకలు, కండరాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువవుతాయి.

గుండె వ్యాధులు

గుండె వ్యాధులు

మీ నడుము ఫ్యాట్, క్యాలరీలు చేరడం వల్ల సైజు పెరిగిందంటే.. హార్ట్ ప్రాబ్లమ్స్ తో బాధపడే రిస్క్ పెరుగుతుంది.

డయాబెటిస్

డయాబెటిస్

నడుము సైజ్ పెరుగుతోందని మీరు గమనించినట్లైతే.. డయాబెటిస్ రిస్క్ పెరుగుతోందని గమనించాలి. దాంతోపాటు స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్నవాళ్లలో ఈ రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

కాలేయ వ్యాధి

కాలేయ వ్యాధి

బాడీ ఫ్యాట్, కొలెస్ట్రాల్ నడుము, పొట్ట భాగంలో పేరుకుంటోంది అంటే.. నడుము సైజ్ పెరుగుతుంది. ఇలాంటి సంకేతం.. ఫ్యాటీ లివర్ డిసీజ్ రిస్క్ ని పెంచుతుంది.

హైపర్ టెన్షన్

హైపర్ టెన్షన్

నడుము చుట్టుకొలత హైపర్ టెన్షన్, హైబ్లడ్ ప్రెజర్ రిస్క్ ని పెంచుతుంది. నడుము ఫ్యాట్ ని కంట్రోల్ చేయడం వల్ల.. బ్లడ్ ప్రెజర్, హైపర్ టెన్షన్ ని తగ్గించవచ్చు.

బ్రీతింగ్ ప్రాబ్లమ్

బ్రీతింగ్ ప్రాబ్లమ్

నడుము చుట్టూ ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ చేరిందంటే.. బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కొంతదూరం నడిచేసరికి.. బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చిందంటే.. వాళ్లు ఈ సమస్యతో ఉన్నట్టు సంకేతం.

క్యాన్సర్

క్యాన్సర్

నడుము చుట్టుకొలత పెరగడం వల్ల.. వచ్చే మరో సీరియస్ హెల్త్ ఇష్యూ.. క్యాన్సర్. నడుము పెరిగితే.. లివర్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని ఓ మెడికల్ జర్నల్ వివరించింది.

English summary

Check Your Waist Size, It Tells You About These Diseases

Check Your Waist Size, It Tells You About These Diseases. Tremendous increase in the waist size in not good. It might be a hint for several health diseases.
Story first published: Saturday, November 5, 2016, 15:31 [IST]
Desktop Bottom Promotion