For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయాగ్ర సైడ్ ఎఫెక్ట్స్ ను గుర్తించడం ఎలా...?

|

చాలా మంది మధ్య వయస్కులకు అంగ స్థంభన ఓ సమస్యగా ఉంటుంది. దీంతో తమలోని సెక్స్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వయగ్రా వంటి మాత్రలను వాడుతుంటారు. వయాగ్ర అంటేనే కామేచ్చను పెంచడం మరియు మొత్తం సెక్సువల్ ఆరోగ్యానికి సహాయపడుతుందని భావిస్తారు. అంగస్తంభన సమస్య కావచ్చు లేదా హార్మోన్ల ప్రభావం కావచ్చు కొంతమందిలో కామ వాంఛలు తగ్గిపోతాయి. ఇది ఒక సాధరణ సమస్య.

ముఖ్యంగా ఈ మద్యకాలంలో, ఆహారపు అవాట్లు, ఒత్తిడి, లైఫ్ స్టైల్ వల్ల మధ్యవయస్కుల వారు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అందుకుగాను వారు ఎంతో ఖరీదైన మందుల వాడకం, మానసిక వైద్యం వంటివి చేయిస్తూ వుంటారు. ముఖ్యంగా వయాగ్ర మందుల వల్ల సెక్స్ హార్మోనులు ఉత్తేజపరిచి అంగస్తంభన సమస్యను నివారించడానికి సహాయపడుతాయి.

కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించారా? సాధారణంగా వయాగ్రా వేస్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ లేదా దుష్పరిణామాలు వ్యక్తికి, వ్యక్తికి మధ్య మారుతూంటాయి. దీనికి కారణం ప్రతివారు ఈ మెడిసిన్ కు వేరుగా స్పందిస్తారు. అయితే అందరికి వుండే కొన్ని కామన్ సమస్యలు చూడండి.

తలనొప్పి:

తలనొప్పి:

వయాగ్ర వాడకం వల్ల తరచూ తలనొప్పితో బాధపడాల్సి వస్తుంది.

కళ్ళు బైర్లుకమ్మటం లేదా కంటి చూపు కోల్పోవడం:

కళ్ళు బైర్లుకమ్మటం లేదా కంటి చూపు కోల్పోవడం:

ఒక అధ్యయనం ప్రకారం వయాగ్రాలో ఉండే సిల్డినాఫిల్ అనే క్రియాశీల పదార్దం మెదడుకు రెటీనా నుండి కాంతి సిగ్నల్ అందించే ఒక ఎంజైమ్ చర్య సంకర్షణ అని వెల్లడించింది. అధిక మోతాదులో వాడినప్పుడు, ఈ మందు యాక్టివ్ వినియోగదారుల దృష్టిలో ఆటంకం కలిగిస్తుంది.మితిమీరిన వినియోగం వలన అస్పష్టమైన దృష్టి, దృష్టి రంగులో మార్పు,కాంతి సున్నితత్వం వంటి వాటికీ కారణం కావచ్చు.

సడెన్ గా వినపడకుండా పోవడం లేదా గట్టిగా వినపడటం

సడెన్ గా వినపడకుండా పోవడం లేదా గట్టిగా వినపడటం

సడెన్ గా వినపడకుండా పోవడం లేదా గట్టిగా వినపడటం జరుగుతుంది. లేదా కొంత మందిలో చెవిలో ఏదో రింగ్ అయినట్టు వినపడుతున్నట్లు భావిస్తారు . ఇలాంటి లక్షణాలు ఉన్నట్లైతే వెంటనే వీటిని తీసుకోవడం మానేయాలి.

వయాగ్రా వలన దృష్టి కోల్పోతారు

వయాగ్రా వలన దృష్టి కోల్పోతారు

ఒక పరిశోధనలో వయాగ్రా అధిక వినియోగం వలన అస్పష్టమైన దృష్టికి కారణం కావచ్చనే వాదనలు ఉన్నప్పటికీ,ఒక 86 ఏళ్ల వ్యక్తి వయాగ్రా వాడటం వలన నిజంగానే తన దృష్టి కోల్పోయాడని పేర్కొన్నారు. అతను 2012 నుండి వయాగ్రాను ఉపయోగిస్తున్నానని చెప్పాడు. అతను స్థిరమైన దృష్టి లోపం నుండి బాధపడిన తర్వాత, వయాగ్రా అమ్మకాన్ని ఆపాలని కోర్టును కోరటం మరియు అతను 2 మిలియన్ డాలర్లు పరిహారం కోరారు.

 పీనిస్ లో బ్లీడింగ్ :

పీనిస్ లో బ్లీడింగ్ :

వయాగ్రా సెక్స్ డ్రైవ్ ని పెంచటానికి కాదు ఒక మనిషి వయాగ్రాను లైంగిక కార్యకలాపాలు తక్కువ అని భయపడుతూ తీసుకుంటారని కనుగొన్నారు. ఈ మందు సెక్స్ డ్రైవ్ బాగా మెరుగుపడటానికి సహాయపడకపోవచ్చు. అయితే, ఇది వాస్తవానికి, అంగస్తంభన సమస్యలలో పురుషులు అంగస్తంభన కోసం అవసరమైన లైంగిక అవయవాలు భౌతిక రక్త ప్రవాహంను పెంచుతుంది.

మహిళల ఆరోగ్యం మీద తీవ్రప్రభావం చూపుతుంది:

మహిళల ఆరోగ్యం మీద తీవ్రప్రభావం చూపుతుంది:

మహిళల కోసం వయాగ్రా అనేక ఔషధ కంపెనీల వారు మహిళల కోసం ఒక వయాగ్రా వంటి మందును రూపొందించారు. ఇది ఒక ఆహ్లాదకరమైన సెక్స్ కోసం సహాయపడుతుందని చెప్పారు. కానీ ఆ వాదనలు అన్ని తప్పు. సెక్స్ ని ఆహ్లాదకరముగా చేయడానికి స్త్రీగుహ్యాంకురమునకు బలవంతంగా రక్త ప్రవాహం పెంచటానికి వయాగ్రా వంటి FDA ద్వారా ఆమోదం పొందిన మందులు మార్కెట్ లో అందుబాటులో లేవు.

జలుబు:

జలుబు:

వయాగ్రను పరిమితికి మించి వాడటం వల్ల తరచూ తుమ్ములు, ముక్కులో నీరు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు.

అజీర్ణం మరియు కడుపు నొప్పి:

అజీర్ణం మరియు కడుపు నొప్పి:

వయాగ్రలోని ఫాస్ట్ రిలీఫ్ కెమికల్స్ వాడకం వల్ల కొన్ని సందర్భాల్లో పొట్ట మీద ప్రభావం చూపి అజీర్ణానికి మరియు పొట్టనొప్పికి గురి చేస్తుంది.

ఛాతీ నొప్పి:

ఛాతీ నొప్పి:

వయాగ్ర వాడకం వల్ల ఇది చాలా అరుదుగా కనిపించే లక్షణం. గుండె సమస్యల చికిత్సకు సూచించే నైట్రేట్ తో కలిపిన మందులతో వయాగ్రా వాడితే ప్రాణాంతకం కావచ్చు.

స్కిన్ రాషెస్:

స్కిన్ రాషెస్:

వయాగ్ర మాత్రలు ఎక్కువగా వాడటం వల్ల స్కిన్ వాటి అలర్జీ వల్ల స్కిన్ రాషెస్ ఏర్పడుతాయి. కాబట్టి, మోతాదుకు మించి తీసుకోవడం అన్ని విధాల ప్రమాధకరమే అని గుర్తించాలి.

సూచన:

సూచన:

వయాగ్రా వేసిన మరికొంతమందికి పురుషులకు అంగస్తంభన 4 గంటలకు పైగా కొనసాగింది. మరి అంగంలో టిష్యూలు దెబ్బతిని నయం అవటానికి చాలా సమయం పట్టిందట. ఆరోగ్య సమస్యలు రాకుండా వుండాలంటే, వయాగ్రా ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో వినియోగించాల్సిందే. ఒక వయసు తర్వాత వయాగ్రావేస్తే గుండె పోటే కాదు, నేరుగా మరణమే.

సూచన

సూచన

ఈ వయాగ్రా పిల్ వేసేటపుడు దాని ప్యాకింగ్ పై వున్న సూచనలు తప్పక చదవాలి. ఆరోగ్య రీత్యా వయాగ్రా నీటితో మాత్రమే తీసుకోండి. దానిని ఆల్కహాల్, జ్యూస్ వంటి వాటిలో కలిపి తీసుకుంటే మరింత హానికరం.

English summary

Common and Rare Side Effects of Viagra

The most common side effect of Viagra is a headache, which affects at least one in ten men who take the drug. A mild headache is not serious and should pass quickly. In the meantime, you can use an over-the-counter painkiller such as aspirin or paracetamol.
Story first published: Saturday, January 2, 2016, 17:35 [IST]
Desktop Bottom Promotion