For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డూ ఇట్ యువర్ సెల్ఫ్ : యూరిన్ ఇన్ఫెక్షన్ కు ఎఫెక్టివ్ హోం రెమెడీస్

|

యూటిఐ (యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ )అత్యంత సాధారణ సమస్య. ప్రస్తుత రోజుల్లో ప్రతి 100 మందిలో ఒకరు ఈ సమస్యను ఎందుర్కొంటున్నారు . పురుషులతో పోల్చితే మహిళల్లో ఈ ఇన్ఫెక్షన్ పది రెట్లు ఎక్కువగా ఉంటుంది . 50శాతం మంది మహిళలు వారి జీవిత కాలంలో ఈ సమస్యను అనుభవ పూర్వకంగా ఒక్కసారైనా ఎదుర్కొని ఉంటారు.

ఒక్క సారి ఈ సమస్య వచ్చిందంటే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొని, నివారించుకోవడం ఉత్తమం. యూటిఐ ఇన్ఫెక్షన్ కు ముఖ్యకారణం ప్రెగ్నెన్సీ, ఇంటర్ కోర్స్, మోనోపాజ్, యూరిన్ ఎక్కువ సేపు హోల్డ్ చేసి బాత్రూమ్ కు వెళ్లకుండా అలాగా ఉండటం మొదలగు కారణాల వల్ల ఇన్ఫెక్షన్ కు కారణం అవుతుంది. ఇటువంటి ఇన్ఫెక్షన్స్ అత్యంత సాధారణమైనవి .

యూరిన్ ఇన్ఫెక్షన్ కు గురైనప్పుడు ఫీవర్, పొట్ట ఉదరంలో నొప్పి, ఫ్రీక్వెంట్ యూరిన్ మరియు యూరిన్ వెల్లేటప్పుడు మంటగా అనిపించడం వంటి లక్షనాలు కనబడుతాయి. ఈ సమస్య నివారణకు డాక్టర్ల వద్దకు వెళితే డాక్టర్స్ ఏవో కొన్ని యాంటీబయోటిక్స్ సూచిస్తుంటారు . అయితే వీటి వల్ల త్వరిత ఉపశమనం ఉండదు , కాబట్టి హోం రెమెడీస్ ను ఉపయోగించడం వల్ల ఈ పెయిన్ ఫుల్ సమస్యను స్వయంగా మనం ఇంట్లోనే త్వరగా నివారించుకోవచ్చు. మరి అందుకు అవసరం అయ్యే హోం మేడ్ పదార్థాలు, ఏవిధంగా తయారుచేయాలి. ఎలా ఉపయోగించాలన్న విషయం తెలుసుకుందాం....

బేకింగ్ సోడా :

బేకింగ్ సోడా :

బేకింగ్ సోడాలో ఎక్సిబిట్ లక్షణాలు అధికంగా ఉండం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ తో పోరాడుతుంది.

కావల్సినపదార్థాలు:

1 tbsp బేకింగ్ సోడ

1 glass వాటర్

తయారుచేయు విధానం: గ్లాసు నీటిలో బేకింగ్ సోడాను మిక్స్ చేసి నేరుగా తాగాలి. బేకింగ్ సోడా ఆల్కలైన్ నేచర్ కలిగి ఉండటం వల్ల, యూరిన్ లో ఎసిడిటిని న్యూట్రైలైజ్ చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ నివారిస్తుంది.

ఆమ్లా:

ఆమ్లా:

ఇండియన్ గూస్బెర్రీ,. ఇది ఒక ఆయుర్వేదిక్ హోం రెమెడీ. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రొపర్టీస్ యూరిన్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.ఇందులో విటిమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల యూరిన్ ట్రాక్ లో బ్యాక్టీరియాను తొలగిస్తుంది . బ్లాడర్ హెల్తీగా ఉంచుతుంది.

కావల్సిన పదార్థాలు:

1 teaspoon ఆమ్లా పౌడర్

1 teaspoon పసుపు

½ cup నీళ్లు

తయారుచేయువిధానం:

అరకప్పు నీటిలో ఒక స్పూన్ ఆమ్లా పౌడర్ మరియు పసుపు వేసి బాగా మిక్స్ చేసి బాయిల్ చేయాలి. వాటర్ సగం అయ్యే వరకూ బాయిల్ చేసి, స్టౌ ఆఫ్ చేసి గోరువెచ్చగా చల్లారిన తర్వాత తాగాలి. ఈ నేచురల్ డికాషన్ ను రోజులో మూడు సార్లు తీసుకుంటే మంచి ఉపశమనం ఉంటుంది

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్:

ఆపిల్ సైడర్ వెనిగర్ లో అమేజింగ్ బ్యూటీబెనిఫిట్స్ ఉన్నాయి. అంతే కాదు యూటిఐ ఇన్ఫెక్షన్ నివారించడంలో చాలా సామర్థ్యంగా వ్యవరిస్తుంది. ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఎంజైమ్స్ మరియు న్యూట్రీషియన్స్, పొటాషియం వంటివి అధికంగా ఉండటం వల్ల యూరిన్ ట్రాక్ లోని బ్యాక్టీరియాను తొలగిస్తుంది . ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఉండే అసిటిక్ ఆసిడ్ మంచి బ్యాక్టీరియా ప్రోత్సహించి చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

కావల్సిన పదార్థాలు:

2 tablespoons ఆపిల్ సైడర్ వెనిగర్

1 tablespoon తేనె

నిమ్మరసం కొద్దిగా

1 cup వాటర్

తయారుచేయు పద్దతి:

రెండు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ లో నిమ్మరసం, తేనె మరియు వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా తాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తుంది. రోజులో రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్:

క్రాన్ బెర్రీ జ్యూస్ మరో ఎఫెక్టివ్ హోం రెమెడీస్ . యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. క్రాన్ బెర్రీ జ్యూస్ లో ప్రోయాంథోసైనేడ్స్ ఉండటం వల్ల ఇది యూరేత్రేన్ వాల్స్ కు అంటుకొన్న ‘ఈ కోయిల్' బ్యాక్టీరియాన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.

కావల్సినపదార్థాలు:

క్రాన్ బెర్రీ జ్యూస్

ఎలా పనిచేస్తుంది: ప్రస్తుతం మార్కెట్లో క్రాన్ బెర్రీ జ్యూస్ రెడీమేడ్ గా అందుబాటులో ఉంది . దీన్ని డైలీ బేస్ తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ ను నివారిస్తుంది . ఇప్పటికే యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లైతే రోజులో 4గ్లాసుల జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలను రక్షించుకోవచ్చు . ఈ జ్యూస్ కు ఇతర ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ను చేర్చకండి.

పైనాపిల్:

పైనాపిల్:

యూరిన్ ఇన్ఫెక్షన్ కు యాంటీబయోటిక్ సూచించినప్పుడు, యాంటీబయోటిక్స్ తో పాటు, రోజూ పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల త్వరగా రికవర్ అవుతుంది. పైనాపిల్లో ఉండే బ్రొమిలియన్ ఎంజైమ్ యాంటీ బ్యాక్టీరియల్ ట్రీట్మెంట్ గా గ్రేట్ గా సహాయపడుతుందని మెచిగన్ యూనివర్శిటీ వారు వెల్లడించారు.

కావల్సిన పదార్థాలు:

1 cup పైనాపిల్ ముక్కలు

ఏం చేయాలి?

పైనాపిల్ ముక్కలను నేరుగా తినడం లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఇన్ఫెక్షన్ క్లియర్ అయ్యే వరకూ రోజూ ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తినాలి.

వాటర్:

వాటర్:

జీవించడానికి మరో ముఖ్య మూలకం నీరు. నీరు మన జీవక్రియలకు మాత్రమే కాదు, కొన్ని రకాల వ్యాధులను నివారిస్తుంది. వాటిలో యూటిఐ ఒకటి. రోజులో సరిపడా నీరు త్రాగాలి. రోజుకు కనీసం 8గ్లాసుల నీరు త్రాగడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది . ఇది చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ హోం రెమెడీ.

హాట్ వాటర్ కంప్రెసర్:

హాట్ వాటర్ కంప్రెసర్:

హాట్ వాటర్ కంప్రెసర్ తో కాపడం పెట్టుకోవడం వల్ల బ్లాడర్ మీద ప్రెజర్ తగ్గుతుంది . దాంతో యూరిన్ ఇన్ఫెక్షన్ మరియు నొప్పి తగ్గుతుంది.

కావల్సినవి:

హాట్ ప్యాక్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటాయి లేదా ఫ్లెక్సిబుల్ బాటిల్స్

హాట్ వాటర్

ఏం చేయాలి:

హాట్ వాటర్ ను ఫ్లెక్సిబుల్ వాటర్ లేదా హాట్ ప్యాక్స్ లో వేడి నీరు పోసి పొట్ట ఉదరంలో కాపడం పెట్టుకోవాలి, దాంతో కొద్దిగా ఉపశమనం పొందుతారు .ఈ పద్దతిని రోజులో రెండు మూడు సార్లు, సమస్య తగ్గే వరకు ఉపయోగించుకోవచ్చు.

పెరుగు:

పెరుగు:

పెయిన్ గా ఉన్న పెరుగును భోజనం చేసే ప్రతి సారి తినాలి. పెరుగు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది . కాబట్టి, డైలీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి. పెరుగులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉండటం వల్ల మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తుంది దాంతో చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది . యూటీఐ ట్రీట్మెంట్ పెరుగు ఒక గ్రేట్ డైట్ సప్లిమెంట్ .

విటమిన్ సి రిచ్ ఫుడ్స్:

విటమిన్ సి రిచ్ ఫుడ్స్:

విటమిన్ సి ఫుడ్స్ యూరిన్ ఇన్ఫెక్షన్ తొలగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది, . కాబట్టి రెగ్యులర్ డైట్ లో విటమిన్ సి రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్ క్లియర్ అవుతుంది . యూరిన్ ఆసిడ్ ఎక్కువగా ఉంటే నొప్పికి దారితీస్తుంది, మంట ఉంటుంది. వీటికి విటమిన్ సి పుడ్ చెక్ పెడుతాయి.

 గ్రీన్ టీ :

గ్రీన్ టీ :

గ్రీన్ టీ యూరిన్ ఇన్ఫెక్షన్ ను గ్రేట్ గా నివారిస్తుంది. గ్రీన్ టీ ఆకులను గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి, గోరువెచ్చగా తాగాలి. రోజూ రెండు సార్లు తాగుతుంటే మంచి ఫలితం ఉంటుంది. గ్రీన్ టీలో యాంటీ మైక్రోబయల్ యాక్టివిటీస్ అధికంగా ఉండటం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది.

English summary

DIY : Effective Home Remedies To Prevent Urinary Tract Infection

Urinary tract infection or UTI is one of the most common health problems faced by people today. This painful infection is 10 times more prevalent in women than in men, with almost 50 percent of females experiencing this condition at least once during their lifetime.
Desktop Bottom Promotion